చిరంజీవి కూతురిగా కృతి శెట్టి.. బాబీ కొల్లి డైరెక్షన్‌లో వస్తున్న మూవీపై ఆసక్తికర బజ్

చిరంజీవి మరోసారి బాబీ కొల్లి డైరెక్షన్ లో సినిమాకు సిద్ధమవుతున్న విషయం తెలుసు కదా. అయితే ఇందులో చిరు కూతురిగా కృతి శెట్టి నటించనుందన్న వార్తలు ఆసక్తి రేపుతున్నాయి. ఓటీటీప్లే రిపోర్టు ఈ విషయాన్ని వెల్లడించింది.

Published on: Jan 20, 2026, 19:09:32 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన వయసుకు తగ్గ పాత్రలను, పరిణితి కలిగిన కథలను ఎంచుకునే పనిలో ఉన్నాడు. తాజాగా అతడు డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో ఒక ఎమోషనల్ డ్రామా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పుడు వీరి కొత్త ప్రాజెక్ట్‌కు సంబంధించి ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ బయటకు వచ్చింది.

చిరంజీవి కూతురిగా కృతి శెట్టి.. బాబీ కొల్లి డైరెక్షన్‌లో వస్తున్న మూవీపై ఆసక్తికర బజ్
చిరంజీవి కూతురిగా కృతి శెట్టి.. బాబీ కొల్లి డైరెక్షన్‌లో వస్తున్న మూవీపై ఆసక్తికర బజ్

తండ్రి పాత్రలో చిరు.. కూతురిగా కృతి శెట్టి

ఈ సినిమాలో చిరంజీవి ఒక పవర్‌ఫుల్ తండ్రి పాత్రలో కనిపించనున్నాడు. తప్పిపోయిన తన కూతురి కోసం ఒక తండ్రి చేసే పోరాటమే ఈ సినిమా కథాంశం అని సమాచారం. అయితే చిరు కూతురి పాత్ర కోసం చాలా మంది హీరోయిన్ల పేర్లను పరిశీలించిన మేకర్స్.. చివరకు ‘ఉప్పెన’ ఫేమ్ కృతి శెట్టిని (Krithi Shetty) ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.

నటనకు ప్రాధాన్యమున్న పాత్ర కావడం, ఆమె వయసు కూడా పాత్రకు సరిగ్గా సరిపోవడంతో కృతిని ఎంపిక చేశారట. ఈ విషయాన్ని ఓటీటీప్లే రిపోర్టు వెల్లడించింది. దీనిపై మూవీ టీమ్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

వరుస ప్లాపుల్లో ఉన్న కృతికి బంపర్ ఆఫర్..

కృతి శెట్టికి ఇది నిజంగా జాక్‌పాట్ అని చెప్పాలి. ఇటీవల వరుస ప్లాపులతో సతమతమవుతున్న ఆమెకు.. ఏకంగా మెగాస్టార్ సినిమాలో, అందులోనూ అతని కూతురిగా నటించే అవకాశం రావడం కెరీర్‌కు పెద్ద బూస్ట్ అవుతుంది. ఈ సినిమాలో కృతి సరసన ఒక యువ హీరో నటించనున్నాడు. ఆ పేరు త్వరలోనే వెల్లడి కానుంది.

‘మన శంకర వరప్రసాద్’ సక్సెస్ జోష్‌లో..

మరోవైపు సంక్రాంతికి విడుదలైన చిరు లేటెస్ట్ మూవీ ‘మన శంకర వరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద రూ. 300 కోట్ల గ్రాస్‌తో దూసుకెళ్తోంది. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా ఫిబ్రవరి రెండో వారంలో జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సక్సెస్ ఆనందంలో చిరు తన ఫ్యాన్స్‌కు ధన్యవాదాలు తెలుపుతూ ఎమోషనల్ నోట్ కూడా రాశాడు.

అభిమానులు, ప్రేక్షకుల విజిల్స్, చప్పట్లే తనకు శక్తి అని, అవే తనను ముందుకు నడిపిస్తున్నాయని చిరంజీవి అన్నాడు. అంతేకాదు అటు అల్లు అర్జున్ కూడా ఈ సినిమాపై రివ్యూ ఇస్తూ.. ఇది సంక్రాంతి బాస్‌బస్టర్ అని అనడం విశేషం.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More