Rajasaab OTT:ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న ది రాజాసాబ్-ప్ర‌భాస్ హార‌ర్ ఫాంట‌సీ థ్రిల్ల‌ర్‌-నెల రోజుల్లోపే స్ట్రీమింగ్-డేట్ ఇదే

ప్రభాస్ తన కెరీర్ లో ఫస్ట్ టైమ్ చేసిన హారర్ థ్రిల్లర్ మూవీ ‘ది రాజాసాబ్’. సంక్రాంతి సందర్భంగా థియేటర్లలో రిలీజైన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది. డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ పై క్లారిటీ వచ్చేసింది.

Published on: Jan 30, 2026, 12:13:27 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ హారర్ ఫాంటసీ థ్రిల్లర్ ‘ది రాజాసాబ్’ ఓటీటీలోకి రాబోతుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ పై క్లారిటీ వచ్చేసింది. సంక్రాంతి సందర్బంగా జవనరి 9న ఈ సినిమా థియేటర్లలో రిలీజైంది. బంపర్ ఓపెనింగ్ సాధించిన ఈ మూవీ ఆ తర్వాత మిక్స్ డ్ టాక్ కారణంగా స్లో అయింది. చివరకు డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.

రాజాసాబ్ ఓటీటీ రిలీజ్ డేట్ (x/DirectorMaruthi)
రాజాసాబ్ ఓటీటీ రిలీజ్ డేట్ (x/DirectorMaruthi)

రాజాసాబ్ ఓటీటీ

వరుసగా పాన్ ఇండియా సినిమాలతో దూసుకెళ్తున్నారు రెబల్ స్టార్ ప్రభాస్. ఆయన కెరీర్ లో ఫస్ట్ టైమ్ చేసిన హారర్ ఫాంటసీ థ్రిల్లర్ మూవీ ‘ది రాజాసాబ్’. దీనికి మారుతి డైరెక్టర్. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది. ఫిబ్రవరి 6 నుంచి తమ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో రాజాసాబ్ స్ట్రీమింగ్ కానున్నట్లు జియోహాట్‌స్టార్‌ లో చూపిస్తోంది.

నాలుగు భాషల్లో

ది రాజాసాబ్ మూవీ నాలుగు భాషల్లో డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈ హారర్ ఫాంటసీ థ్రిల్లర్ ఓటీటీలోకి రానుంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన ముగ్గురు హీరోయిన్లు నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ నటించారు. సంజయ్ దత్ కీలక పాత్ర పోషించాడు.

నెల రోజుల్లోపే

సుమారు రూ.400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన రాజాసాబ్ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఇప్పటివరకూ ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.207 కోట్ల గ్రాస్ కలెక్షన్లు మాత్రమే సాధించింది. పెట్టిన బడ్జెట్ తిరిగి రాబట్టలేని రాజాసాబ్ డిజాస్టర్ గా నిలిచింది. జనవరి 9న రిలీజైన ఈ మూవీ ఇప్పుడు నెల రోజుల్లోపే ఓటీటీలోకి రానుంది. ఫిబ్రవరి 6 నుంచి జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది.

రాజాసాబ్ స్టోరీ

ఒకప్పుడు దేవనగర సంస్థానికి జమిందారు అయిన గంగాదేవి (జరీనా వాహబ్) సాధారణ జీవితం గడుపుతుంటారు. గంగాదేవితో మనవడు రాజు అలియాస్ రాజా సాబ్ (ప్రభాస్) నివసిస్తాడు. నానమ్మ అంటే రాజుకు ఎంతో ఇష్టం. అయితే, గంగాదేవి అల్జీమర్స్‌తో బాధపడుతుంటుంది. కానీ, భర్త కనకరాజు (సంజయ్ దత్)ను మాత్రం మరిచిపోదు.

కలలో కనిపించిన తాతను ఎలాగైనా వెతికి తీసుకురమ్మని రాజును కోరుతుంది నానమ్మ. ఈ క్రమంలోనే హైదరబాద్‌లో కనకరాజు ఉన్నట్లు తెలిసి రాజు బయలుదేరుతాడు. నర్సాపూర్ అడవిలోని రాజ మహల్‌కి రాజు కొంతమందితో వెళ్తాడు. ఆ బంగ్లాలో ఎన్నో మార్మిక విద్యలు తెలిసిన కనకరాజు.. రాజును చంపాలని చూస్తాడు.

మార్మిక విద్యలు తెలిసిన కనకరాజును రాజా సాబ్ ఎలా ఎదుర్కొన్నాడు? అసలు కనకరాజు గతమేంటీ? అతనికి ఏం కావాలి? రాజా సాబ్ లైఫ్‌లోకి వచ్చిన ముగ్గురు అమ్మాయిలు భైరవి (మాళవిక మోహనన్), బ్లెస్సీ (నిధి అగర్వాల్), అనిత (రిద్ధి కుమార్) ఎవరు? గంగాదేవి ఆస్తులు ఏమైపోయాయి? వారు సాధారణ జీవితం గడపడానికి కారణం ఏంటీ? బంగ్లా నుంచి రాజు బయటపడ్డాడా? అనేది తెలియాలంటే ది రాజా సాబ్ చూడాల్సిందే.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More