లిమిట్స్ దాటిన ప్రభాస్ ఫ్యాన్స్-మన శంకర వరప్రసాద్ గారు పోస్టర్లో చిరు ఫేస్‌కు ప్రభాస్ మాస్క్-వీడియో వైరల్
ప్రభాస్ ఫ్యాన్స్ రెచ్చిపోయారు. మన శంకర వర ప్రసాద్ గారు పోస్టర్ లో ఉన్న చిరంజీవి ముఖంపై ప్రభాస్ మాస్క్ ఉంచారు. ఇదంతా వీడియో తీస్తూ మెగాస్టార్ ను అవమానించేలా మాటలన్నారు. ఈ వీడియో వైరల్ గా మారింది.
ఇండస్ట్రీలోని హీరోలందరూ ఒక్కటే. వాళ్లకు ఒకరికొకరు సపోర్ట్ గా ఉంటారు. కానీ కొన్ని సార్లు ఫ్యాన్స్ అదుపు తప్పుతారు. అభిమానులు లిమిట్స్ క్రాస్ చేస్తారు. తాజాగా ప్రభాస్ అభిమానులు ఇలాగే ప్రవర్తించారు. ఓ థియేటర్లో పోస్టర్ పై చిరంజీవి ముఖంపై ప్రభాస్ మాస్క్ పెట్టారు. ఇదంతా వీడియో తీశారు. ఈ వీడియో వైరల్ గా మారింది.

చిరంజీవి ముఖంపై
ప్రభాస్ ఫ్యాన్స్ చేసిన పని ఇంటర్నెట్ లో తీవ్ర విమర్శల పాలవుతోంది. చిరంజీవి హీరోగా వచ్చిన మన శంకర వర ప్రసాద్ గారు బ్లాక్ బస్టర్ టాక్ తో సాగిపోతోంది. ఈ నేపథ్యంలో ప్రభాస్ ఫ్యాన్స్ ఓ గుంపు కలిసి చిరంజీవి ముఖంపై తమ హీరో మాస్క్ పెట్టారు. ఓ థియేటర్లో ఇది జరిగింది. మాస్క్ పెట్టడమే కాకుండా చిరంజీవిని అవమానించేలా మాటలన్నారు. ఇదంతా వీడియోలో వినపడింది. థియేటర్ యాజమాన్యం వచ్చి అలా చేయొద్దని చెప్పడంతో ఆ అభిమానులు వెళ్లిపోయారు.
నిజమైన ఫ్యాన్స్ కాదు
చిరంజీవిని అగౌరవపరిచేలా ప్రవర్తించిన ప్రభాస్ ఫ్యాన్స్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇలా చేసేవాళ్లు అసలు నిజమైన ఫ్యాన్స్ కాదనే కామెంట్లు వస్తున్నాయి. ఇక చిరు ఫ్యాన్స్ కూడా ఎదురు దాడి చేస్తున్నారు. ‘‘హీరోనేమో డబుల్ బాడీతో మేనేజ్ చేస్తాడు. ఫ్యాన్స్ ఏమో ఇలా మాస్క్ లు పెట్టి ఆనందపడతారు’’ అని పోస్టులు పెడుతున్నారు.
ది రాజా సాబ్ గురించి
సంక్రాంతి 2026 సందర్భంగా జనవరి 9న ది రాజా సాబ్ థియేటర్లలో రిలీజైంది. ప్రభాస్ ఫస్ట్ టైమ్ చేసిన హారర్ ఫాంటసీ థ్రిల్లర్ ఇది. దీనికి మారుతి డైరెక్టర్. భారీ ఓపెనింగ్ అందుకున్న రాజా సాబ్ మిక్స్ డ్ టాక్ కారణంగా వెనకబడింది. డిజాస్టర్ గా నిలిచిపోయింది. పెట్టిన బడ్జెట్ రాబట్టలేని పరిస్థితికి చేరుకుంది. రాజా సాబ్ మూవీలో ప్రభాస్, నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్, సంజయ్ దత్ తదితరులు నటించారు.
బ్లాక్ బస్టర్
మరోవైపు సంక్రాంతి 2026కే బాక్సాఫీస్ బరిలో నిలిచిన మన శంకర వర ప్రసాద్ గారు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. జనవరి 12న రిలీజైన ఈ సినిమాలో చిరంజీవి, నయనతార, వెంకటేశ్ తదితరులు నటించారు. దీనికి అనిల్ రావిపూడి డైరెక్టర్. ఈ ఫ్యామిలీ కామెడీ ఎంటర్ టైనర్ వారంలోనే బ్రేక్ ఈవెన్ సాధించింది. 15 రోజుల్లో మన శంకర వర ప్రసాద్ గారు ప్రపంచవ్యాప్తంగా రూ.358 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


