అలా రీల్ చేసినందుకు దళపతి విజయ్ అభిమానిపై అజిత్ ఫ్యాన్స్ దాడి- గిల్లి బాక్సాఫీస్ రికార్డ్ బ్రేక్ చేసిన గ్యాంబ్లర్
స్టార్ హీరోల అభిమానం దాడికి దారి తీసింది. తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ బ్లాక్ బస్టర్ హిట్ 'మంగాత్తా' (తెలుగులో గ్యాంబ్లర్) రీ రిలీజ్ సందర్భంగా తమిళనాడులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. థియేటర్‌లో దళపతి విజయ్ అభిమానిపై అజిత్ న్స్ దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తమిళ చిత్ర పరిశ్రమలో తల అజిత్ కుమార్, దళపతి విజయ్ అభిమానుల మధ్య ఉండే పోటీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా అజిత్ 2011 నాటి సంచలన చిత్రం ‘మంగాత్తా’ (తెలుగులో గ్యాంబ్లర్) రీ రిలీజ్ సందర్భంగా ఈ విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. థియేటర్ లోపల జరిగిన ఒక దాడి ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది.

జెండా ఊపినందుకు చొక్కా చింపి మరీ దాడి!
కారాకుడిలోని పాండియన్ సినిమాస్‌లో ‘మంగాత్తా’ స్క్రీనింగ్ జరుగుతుండగా ఒక చేదు ఘటన చోటుచేసుకుంది. అజిత్ ఫ్యాన్స్ అంతా సినిమాను ఎంజాయ్ చేస్తున్న సమయంలో ఒక విజయ్ ఫ్యాన్ తన దళపతి కొత్త రాజకీయ పార్టీ ‘తమిళగ వెట్రి కజగం’ (TVK) జెండాను థియేటర్ లోపల ఊపాడు.
అజిత్ సినిమా థియేటర్‌లో విజయ్ టీవీకే జెండా పట్టుకుని దళపతి అభిమాని ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆగ్రహానికి గురైన అజిత్ ఫ్యాన్స్ విజయ్ అభిమానిపై మూకుమ్మడిగా దాడి చేశారు. అతని చొక్కా చింపివేసి, థియేటర్ బయటకు గెంటేశారు.
వీడియోలు వైరల్
దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. "ఒక స్కూల్ అబ్బాయిలా ఉన్న వ్యక్తిపై ఇలా దాడి చేయడం దారుణం" అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.
"విజయ్ అభిమానుల తిక్కను అజిత్, రజనీకాంత్ ఫ్యాన్స్ మాత్రమే కుదర్చగలరు" అంటూ మరొకరు వీడియోను పోస్ట్ చేశారు. "ఎంత అభిమానం ఉన్న మరొక హీరో సినిమా సమయంలో జెండా ఊపడం కరెక్ట్ కాదు కదా" అని మరొక నెటిజన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
'గిల్లి' రికార్డు గల్లంతు.. బాక్సాఫీస్ వద్ద 'మంగాత్తా' జోరు
ఇదిలా ఉంటే, ఇలా వరుస గొడవలు ఒకవైపు ఉన్నా, బాక్సాఫీస్ వద్ద మాత్రం అజిత్ తన సత్తా చాటారు. రీ రిలీజ్ చిత్రాల్లో ఇప్పటివరకు విజయ్ నటించిన ‘గిల్లి’ (రూ. 4 కోట్లు) పేరిట ఉన్న ఫస్ట్ డే కలెక్షన్ల రికార్డును ‘మంగాత్తా’ తుడిచిపెట్టేసింది.
మొదటి రోజున మంగాత్తా (గ్యాంబ్లర్) సుమారు రూ. 4.1 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. కేవలం తమిళనాడులోనే రూ. 3.75 కోట్ల గ్రాస్ సాధించి, అజిత్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించింది.
విజయ్ ‘జన నాయకన్’ విడుదలకు బ్రేక్!
మరోవైపు విజయ్ చివరి చిత్రంగా ప్రచారం పొందుతున్న ‘జన నాయగన్’ సెన్సార్ చిక్కుల్లో పడింది. సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ సినిమా సెన్సార్ బోర్డు (CBFC) నుంచి అభ్యంతరాలు ఎదురవడంతో వాయిదా పడింది. ఈ వివాదంపై మద్రాస్ హైకోర్టులో జనవరి 27న విచారణ జరగనుంది. త్వరలోనే ఈ చిత్రానికి లైన్ క్లియర్ అవుతుందని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper












