రొమాంటిక్ సీన్లు చేస్తుంటే డైరెక్టర్ కట్ కట్ చెప్పేవాడు-బాయ్స్‌తో ఫ్రెండ్‌షిప్ వద్దన్న మమ్మీ: ఫంకీ హీరోయిన్ కాయదు లోహర్

విష్వక్ షేన్, కాయదు లోహర్ జంటగా నటించిన అప్ కమింగ్ మూవీ ఫంకీ. ఈ సినిమాకు అనుదీప్ డైరెక్టర్. సినిమా షూటింగ్ టైమ్ లో రొమాంటిక్ సీన్లు చేస్తుంటే డైరెక్టర్ కట్ కట్ అని అరిచేవాడని హీరోయిన్ కాయదు పేర్కొంది. ఈ కామెంట్లు ఇప్పుడు వైరల్ గా మారాయి. 

Published on: Jan 28, 2026, 11:03:43 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సినిమాలో రొమాంటిక్ సీన్లు కామనే. హీరో హీరోయిన్లతో కెమెరా ముందు రొమాన్స్ చేయించి డైరెక్టర్ ఈ సీన్లు రాబడతాడు. కానీ జాతిరత్నాలు సినిమాతో పాపులర్ అయిన డైరెక్టర్ అనుదీప్ మాత్రం దీనికి పూర్తిగా రివర్స్. రొమాన్స్ అంటేనే అతను అన్ కంఫర్ట్ గా ఫీల్ అవుతాడంటా. ఈ విషయాన్ని ఫంకీ మూవీ హీరో విష్వక్ సేన్, హీరోయిన్ కాయదు లోహర్ చెప్పారు.

విష్వక్ సేన్, కాయదు లోహర్ (x/SitharaEnts)
విష్వక్ సేన్, కాయదు లోహర్ (x/SitharaEnts)

రొమాన్స్ అంటే

విష్వక్ సేన్, కాయదు లోహర్ జంటగా నటించిన మూవీ ‘ఫంకీ’. దీనికి అనుదీప్ డైరెక్టర్. వాలైంటైన్స్ డే సందర్బంగా ఈ చిత్రం ఫిబ్రవరి 13న రిలీజ్ కానుంది. రీసెంట్ గా మూవీ హీరోహీరోయిన్లు, డైరెక్టర్ తో సుమ ప్రమోషనల్ ఇంటర్వ్యూ నిర్వహించింది. ఇందులో రొమాన్స్ గురించి, అనుదీప్ గురించి కాయదు లోహర్ చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.

అనుదీప్ అన్ కంఫర్ట్

ఫంకీ సినిమాలో రొమాంటిక్ సీన్ల గురించి సుమ ప్రశ్నించింది. దీనికి విష్వక్ సేన్ వెటకారంగా బదులిచ్చాడు. సినిమాలో రొమాన్స్ సీన్లు లేకపోవడంతో తన కెరీర్ లోనే పీక్స్ అంటూ జోక్ చేశాడు.

‘‘సినిమాలో రొమాన్స్ అయితే పీక్స్ ఉంటుంది. ఎక్స్ ట్రీమ్ అసలు. మా ఇద్దరి కెరీర్లో టాప్ మోస్ట్ రొమాంటిక్ సీన్లు ఉన్నాయి ఈ సినిమాలోనే. హీరో హీరోయిన్ కంటే ముందు ఆయన (అనుదీప్) మానిటర్ దగ్గర అన్ కంఫర్టబుల్ అయిపోతుంటాడు’’ అని విష్వక్ సేన్ నవ్వుతూ చెప్పాడు.

కట్ కట్

రొమాంటిక్ సీన్లు రాశాను కానీ హీరోయిన్ చేయనన్నదని అనుదీప్ సరదాగా చెప్పాడు. అప్పుడు కాయదు లోహర్.. ‘‘మేం రొమాంటిక్ సీన్ చేస్తుంటే చాలు వచ్చి కట్ కట్ చెప్తూనే ఉన్నాడు. కనీసం ఫినిష్ కూడా చేయనివ్వలేదు’’ అని వెల్లడించింది. మా కంటే ఆయనే ఎక్కువ ఇబ్బంది పడ్డాడని విష్వక్ సేన్ తెలిపాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ముఖ్యంగా అనుదీప్ రియాక్షన్స్ ఫన్నీగా ఉన్నాయి.

బాయ్స్‌తో ఫ్రెండ్‌షిప్

చిన్నప్పటి నుంచే బాయ్స్‌తో ఫ్రెండ్‌షిప్ వద్దని మమ్మీ చెప్పిందని, ఆ విషయాన్ని ఫాలో అవుతున్నానని ఈ ఇంటర్వ్యూలో కాయదు లోహర్ చెప్పింది. విష్వక్ సేన్, కాయదు లోహర్ జంటగా నటించిన ఫంకీ మూవీకి అనుదీప్ డైరెక్టర్. ఈ సినిమాను సితారా ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. అనుదీప్ స్టైల్లో ఫంకీ మూవీ మరోసారి థియేటర్లలో నవ్వులు పంచేందుకు ఫిబ్రవరి 13న రాబోతుంది. ఇప్పటికే వచ్చిన టీజర్ ఆకట్టుకుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More