ద‌ళ‌ప‌తి విజ‌య్‌కు మ‌ళ్లీ షాక్‌-జ‌న నాయ‌గ‌న్ రిలీజ్ ఇప్ప‌ట్లో లేన‌ట్లే-సింగిల్ బెంచ్‌లో తేల్చుకోమన్న మ‌ద్రాస్ హైకోర్టు

దళపతి విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్ చిక్కుముడి కొనసాగుతోంది. సినిమాకు సర్టిఫికేట్ ఇవ్వాలని సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వును మద్రాస్ హై కోర్టు కొట్టేసింది. మళ్లీ సింగిల్ బెంచ్ లోనే తేల్చుకోవాలని ఇవాళ తీర్పు వెల్లడించింది. ఇప్పట్లో జన నాగయన్ రిలీజ్ కష్టమేనన్న టాక్ వినిపిస్తోంది. 

Published on: Jan 27, 2026, 11:34:50 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

పొలిటికల్ పార్టీ స్థాపించి, రాజకీయాల్లోకి అడుగుపెట్టిన దళపతి విజయ్ తన కెరీర్ లో చేసిన లాస్ట్ మూవీ ‘జన నాయగన్’. ఈ చిత్రం రిలీజ్ డేట్ పై మాత్రం సస్పెన్స్ కొనసాగుతోంది. జన నాయగన్ విషయంలో దళపతి విజయ్ కు మరోసారి కోర్టు షాకిచ్చింది. సింగిల్ బెంగ్ తీర్పును కొట్టేసిన హై కోర్టు డివిజన్ బెంచ్ మరోసారి సింగిల్ బెంచ్ లోనే సెన్సార్ బోర్డు ఇష్యూను తేల్చుకోవాలని స్పష్టం చేసింది.

దళపతి విజయ్
దళపతి విజయ్

జన నాయగన్ పై కోర్టు తీర్పు

జన నాయగన్, సెన్సార్ సర్టిఫికేట్ వివాదంపై ఇవాళ (జనవరి 27) మద్రాస్ హై కోర్టు తీర్పు వెల్లడించింది. చీఫ్ జస్టిస్ ఎంఎం శర్వాశ్రీ, జస్టిస్ జి. అరుణ్ మురుగన్ నేతృత్వంలోని మద్రాస్ హైకోర్టు ధర్మాసనం తీర్పు చెప్పింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC), 'జన నాయగన్' నిర్మాత కేవీఎన్ ప్రొడక్షన్స్ మధ్య కేసును సింగిల్ బెంచ్ లోనే తేల్చుకోవాలని స్పష్టం చేసింది.

మద్రాస్ హైకోర్టు ఆదేశాలు

మంగళవారం మద్రాస్ హై కోర్టులో జన నాయగన్, సెన్సార్ బోర్డు కేసు విచారణ జరిగింది. ఫిర్యాదులో లేవనెత్తిన అంశాలను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. జన నాయగన్ కు అనుకూలంగా సింగిల్ (ఏకసభ్య) బెంచ్ లో జరిగిన విచారణలో తమ వాదనలు వినిపించడానికి సెన్సార్ బోర్డుకు సమయం ఇవ్వాల్సిందని డివిజన్ బెంచ్ అభిప్రాయపడింది.

సింగిల్ బెంచ్ కు

సెన్సార్ బోర్డు ఛైర్మన్ ప్రసూన్ జోషి ఉత్తర్వులను సవాలు చేస్తూ నిర్మాతలు దాఖలు చేసిన పిటిషన్ లేదని కూడా కోర్టు గమనించింది. దానిని సవాలు చేయాలని నిర్మాతను కోరింది. జన నాయగన్ కు సర్టిఫికేట్ ఇవ్వాలని ఆదేశించిన సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ కొట్టేసింది. కొత్తగా పరిశీలించడానికి మళ్లీ సింగిల్ బెంచ్ కే కేసును రికమండ్ చేసింది.

ఏం జరిగిందంటే?

సెన్సార్ బోర్డు పరిశీలనా కమిటీ డిసెంబర్, 2025లో జన నాయగన్ సినిమా చూసింది. 14 కట్స్ తర్వాత UA 16+ సర్టిఫికేట్ ఇస్తామని చెప్పిందని నిర్మాతలు పేర్కొన్నారు. చిత్ర నిర్మాతలు కట్స్ తో అంగీకరించినప్పటికీ, జనవరి 5 వరకు సెన్సార్ బోర్డు నుండి వారికి ఎలాంటి సమాచారం రాలేదు. దీంతో వాళ్లు మద్రాస్ హై కోర్టును ఆశ్రయించారు. దీంతో సర్టిఫికేట్ ఇవ్వాలని సెన్సార్ బోర్డును సింగిల్ బెంచ్ డివిజన్ ఆదేశించింది.

దీనిపై సెన్సార్ బోర్డు మద్రాస్ హై కోర్టు డిజిటన్ బెంచ్ లో అప్పీల్ చేసింది. ఇప్పుడు సింగిల్ బెంచ్ ఉత్తర్వులను డివిజన్ బెంచ్ కొట్టేసింది. మళ్లీ సింగిల్ బెంచ్ లోనే తేల్చుకోవాలని చెప్పింది.

జన నాయగన్ గురించి

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ తన కెరీర్ లో చేసిన లాస్ట్ మూవీ జన నాయగన్. ఈ సినిమాను సంక్రాంతి సందర్భంగా జనవరి 9, 2026న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ సెన్సార్ సర్టిఫికేట్ రాకపోవడంతో రిలీజ్ వాయిదా పడింది. ఇప్పుడు కోర్టు కేసు ఇంకా కొనసాగుతోంది. హెచ్. వినోద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మమితా బైజు, బాబీ డియోల్, పూజా హెగ్డే తదితరులు కూడా నటించారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More