దళపతి విజయ్ జన నాయగన్‌కు పెద్ద షాక్.. గంటల్లోనే సింగిల్ జడ్జి ఆర్డర్‌పై మద్రాస్ హైకోర్టు స్టే.. జనవరి 21 వరకు నో రిలీజ్

దళపతి విజయ్ జన నాయగన్‌కు పెద్ద షాకే తగిలింది. అతని చివరి సినిమా జనవరి 21 వరకు విడుదలయ్యే పరిస్థితి కనిపించడం లేదు. మద్రాస్ హైకోర్టు.. శుక్రవారం (జనవరి 9) సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై మరోసారి స్టే విధించడమే దీనికి కారణం.

Updated on: Jan 9, 2026, 17:31:26 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

దళపతి విజయ్ (Thalapathy Vijay) చివరి సినిమా 'జన నాయగన్' చిక్కుముళ్లు ఇప్పట్లో వీడేలా కనిపించడం లేదు. సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలపై మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ స్టే విధించింది. దీంతో సినిమా విడుదల మరింత సందిగ్ధంలో పడింది. శుక్రవారం (జనవరి 9) మద్రాస్ హైకోర్టులో జరిగిన విచారణలో విజయ్ సినిమాకు ప్రతికూల ఫలితం వచ్చింది. దీంతో జనవరి 21 వరకు మూవీ రిలీజయ్యే పరిస్థితి కనిపించడం లేదు.

దళపతి విజయ్ జన నాయగన్‌కు పెద్ద షాక్.. గంటల్లోనే తన ఆర్డర్‌పై తానే స్టే ఇచ్చిన మద్రాస్ హైకోర్టు.. జనవరి 21 వరకు నో రిలీజ్
దళపతి విజయ్ జన నాయగన్‌కు పెద్ద షాక్.. గంటల్లోనే తన ఆర్డర్‌పై తానే స్టే ఇచ్చిన మద్రాస్ హైకోర్టు.. జనవరి 21 వరకు నో రిలీజ్

హైకోర్టులో ఏం జరిగింది?

దళపతి విజయ్ జన నాయగన్ మేకర్స్ కు శుక్రవారం ఓ గుడ్ న్యూస్, ఆ వెంటనే ఓ బ్యాడ్ న్యూస్ అందింది. మొదట ఉదయం సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేయాలని సింగిల్ జడ్జి.. సెన్సార్ బోర్డు (CBFC)ను ఆదేశించారు. అయితే ఈ ఆదేశాలను సవాలు చేస్తూ సీబీఎఫ్‌సీ.. డివిజన్ బెంచ్ ను ఆశ్రయించింది.

దీనిపై విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ మణీంద్ర మోహన్ శ్రీవాస్తవ, జస్టిస్ జి. అరుల్ మురుగన్ నేతృత్వంలోని ధర్మాసనం.. సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలపై స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు దీనిపై జనవరి 21న తదుపరి విచారణ చేపడతామని చెప్పింది. దీంతో అప్పటి వరకూ మూవీ రిలీజ్ అయ్యే అవకాశాలు లేనట్లే.

ఎవరి వాదనలు ఎలా ఉన్నాయంటే?

సెన్సార్ బోర్డు తరపున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఏఆర్ఎల్ సుందరేశన్, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా (వీడియో కాన్ఫరెన్స్ ద్వారా) వాదనలు వినిపించారు. సినిమాలోని అభ్యంతరకర అంశాలు, రూల్స్ ను బేస్ చేసుకుని వారు చేసిన అప్పీల్ ను కోర్టు పరిగణనలోకి తీసుకుంది.

ఇప్పటికే జనవరి 9న జరగాల్సిన రిలీజ్ వాయిదా పడింది. ఇప్పుడు కోర్టు స్టే విధించడంతో.. న్యాయపరమైన చిక్కులు తేలేవరకు సినిమా థియేటర్లోకి రావడం కష్టంగా మారింది. ఇది విజయ్ అభిమానులకు పెద్ద దెబ్బే అని చెప్పాలి.

రిలీజ్ వాయిదాతో భారీ నష్టం

జనవరి 9న రిలీజ్ కావాల్సిన సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ రాకపోవడంతో.. అడ్వాన్స్ బుకింగ్స్ చేసుకున్న లక్షలాది మందికి డబ్బులు వెనక్కి ఇవ్వాల్సి వచ్చింది. ఇది భారతీయ సినిమా చరిత్రలోనే అతిపెద్ద రిఫండ్ అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

సినిమా వాయిదా పడటంతో టికెటింగ్ ప్లాట్‌ఫామ్ 'బుక్‌మైషో' (BookMyShow) భారీ ఎత్తున రిఫండ్ ప్రక్రియను చేపట్టింది. కేవలం ఇండియాలోనే దాదాపు రూ. 1 కోటి విలువైన టికెట్ల డబ్బును వెనక్కి ఇచ్చినట్లు అంచనా. విదేశాల్లో ఈ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండొచ్చు. దాదాపు 4,50,000 టికెట్లను రిఫండ్ చేశారట. ఇంత భారీ మొత్తంలో రిఫండ్స్ జరగడం ఇండియన్ సినిమా హిస్టరీలో ఇదే మొదటిసారి అని అంటున్నారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More