జన నాయగన్ రిలీజ్ వాయిదా.. దళపతి విజయ్ చివరి మూవీకి ఊహించని షాక్.. కోర్టు తీర్పు రాకపోవడంతో..
దళపతి విజయ్ జన నాయగన్ మూవీ ఊహించినట్లే వాయిదా పడింది. సీబీఎఫ్‌సీ సర్టిఫికెట్ విషయంలో మద్రాస్ హైకోర్టు తీర్పును రిజర్వ్‌లో ఉంచిన నేపథ్యంలో సినిమాను వాయిదా వేయాలని మేకర్స్ నిర్ణయించారు.
దళపతి విజయ్ చివరి సినిమాకు ఊహించని షాక్ తగిలింది. జనవరి 9న థియేటర్లలో రిలీజ్ కావాల్సిన జన నాయగన్ మూవీ రిలీజ్ ను వాయిదా వేశారు. ఈ విషయాన్ని ఆ సినిమా మలేషియా డిస్ట్రిబ్యూటర్ అయిన మాలిక్ స్ట్రీమ్స్ కార్పొరేషన్ అధికారికంగా వెల్లడించింది. మద్రాస్ హైకోర్టు ఈ మూవీ సెన్సార్ సర్టిఫికెట్ పై తీర్పును రిజర్వ్ చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

వాయిదా పడిన జన నాయగన్
అనుకున్నదే జరిగింది. దళపతి విజయ్ అభిమానులకు నిరాశ తప్పలేదు. ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న అతని చివరి మూవీ 'జన నాయగన్' విడుదల వాయిదా పడింది. అనివార్య కారణాల వల్ల సినిమాను పోస్ట్‌పోన్ చేస్తున్నట్లు మలేషియా డిస్ట్రిబ్యూటర్ అధికారికంగా ప్రకటించారు. మద్రాస్ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేయడంతో ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు.
జనవరి 9న థియేటర్లలో పండగ చేసుకోవాలనుకున్న ఫ్యాన్స్‌కు ఇది నిజంగా చేదు వార్తే. బుధవారం (జనవరి 7) సాయంత్రం ఎక్స్ వేదికగా వచ్చిన ఈ ప్రకటనతో సస్పెన్స్‌కు తెరపడింది.
మలేషియా డిస్ట్రిబ్యూటర్ క్లారిటీ
ఈ సినిమా మలేషియా డిస్ట్రిబ్యూటర్ అయిన మాలిక్ స్ట్రీమ్స్ కార్పొరేషన్ సోషల్ మీడియాలో ఈ విషయాన్ని వెల్లడించింది. "అనివార్య కారణాల వల్ల సినిమా విడుదలను వాయిదా వేస్తున్నాం" అని ట్వీట్ చేశారు.
మద్రాస్ హైకోర్టులో సెన్సార్ సర్టిఫికెట్ జారీపై విచారణ జరగగా.. కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. తీర్పు రాకుండా, సెన్సార్ సర్టిఫికెట్ లేకుండా సినిమాను రిలీజ్ చేయడం కుదరదు కాబట్టి వాయిదా వేయక తప్పలేదు.
ఫ్యాన్స్ నిరాశ
నిన్నటి వరకు బుకింగ్స్ జోరుగా సాగాయి. మలేషియాలో రికార్డులు కూడా క్రియేట్ అయ్యాయి. కానీ చివరి నిమిషంలో ఇలా జరగడంతో అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడనేది ఇంకా నిర్మాణ సంస్థ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
అయితే మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ ఎప్పుడో ప్రారంభం కాగా.. ఇప్పటికే రూ.50 కోట్ల గ్రాస్ వసూలు చేయడం విశేషం. రాజకీయాల్లోకి వెళ్లే ముందు విజయ్ నటించిన చివరి సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలను ఆకాశాన్నంటుతున్నాయి. అదే స్థాయిలో బుకింగ్స్ కూడా జరుగుతున్నాయి. ఇందులో కేవలం మొదటి రోజు కోసమే రూ. 32 కోట్లు రావడం విశేషం.
ఇక మలేషియాలో బుకింగ్స్ ఓపెన్ అయిన గంటన్నరలోనే 90,000 టికెట్లు అమ్ముడయ్యాయి. విజయ్ గత చిత్రం 'లియో' (1.08 లక్షల టికెట్లు) రికార్డును ఇది దాటేలా ఉంది. అక్కడ ఈ సినిమాకు '16' రేటింగ్ ఇచ్చారు.
ఇండియా విషయానకి వస్తే.. కర్ణాటక, కేరళ వంటి పరిమిత ప్రాంతాల్లోనే బుకింగ్స్ ఓపెన్ అయినా.. ఇండియాలో 2.93 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి. సాక్నిల్క్ (Sacnilk) ప్రకారం.. ఇప్పటివరకు ఇండియాలో రూ. 7.7 కోట్లు వసూలు చేసింది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


