ఎలాంటి ఒత్తిళ్లకు తలవంచను.. కప్ ముఖ్యం బిగిల్.. జన నాయగన్ సెన్సార్ వివాదంపై దళపతి విజయ్ సంచలన వ్యాఖ్యలు
రాజకీయ పార్టీ పెట్టిన దళపతి విజయ్ నటించిన చివరి సినిమా జన నాయగన్. ఈ మూవీ రిలీజ్ పై ఉత్కంఠ నెలకొంది. సెన్సార్ వివాదం కోర్టులో సాగుతోంది. ఈ నేపథ్యంలో సెన్సార్ వివాదంపై దళపతి విజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎలాంటి ఒత్తిళ్లకు తల వంచనని అన్నారు.
తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన చివరి సినిమా జన నాయగన్ సెన్సార్ వివాదం గురించి ప్రస్తావిస్తూ ఒత్తిళ్లకు తల వంచనని అన్నారు. ఆదివారం (జనవరి 25) తమిళనాడులోని మహాబలిపురంలో రాష్ట్ర, జిల్లా స్థాయి కార్యనిర్వాహక కమిటీ సమావేశాన్ని నిర్వహించారు తమిళగా వెట్రి కజగం (TVK) పార్టీ అధ్యక్షుడు విజయ్.

విజయ్ పార్టీ గుర్తు
విజయ్ దళపతి తన పార్టీ గుర్తును ఇవాళ ఆవిష్కరించారు. ఎన్నికల సంఘం కేటాయించిన విజిల్ గుర్తును ఈ మీటింగ్ లో ఆవిష్కరించారు విజయ్. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) వల్ల తన చివరి చిత్రం 'జన నాయగన్’ విడుదల ఆలస్యం కావడం, కరూర్ తొక్కిసలాట ఘటనపై సీబీఐ విచారణ నేపథ్యంలో కూడా విజయ్ తన కార్యకర్తలతో సంభాషిస్తూ, పార్టీ గుర్తును ఆవిష్కరిస్తూ ఉత్సాహంగా కనిపించారు.
కప్ ముఖ్యం బిగిల్
ఎన్నికల సంఘం కేటాయించిన 'విజిల్' గుర్తును విజయ్ ఆవిష్కరించారు. టీవీకే కార్యకర్తలు బిగ్గరగా విజిల్స్ వేస్తూ నటుడిని స్వాగతించారు. నటుడు చెవులు మూసుకుంటూ పెద్దగా నవ్వారు. పార్టీ గుర్తును ఆవిష్కరించిన తర్వాత విజయ్ కూడా పెద్దగా కేకలు వేస్తూ విజిల్ వేశారు. అప్పుడు అతను 2019లో రిలీజైన తన మూవీ ‘బిగిల్’ నుంచి పాపులర్ డైలాగ్ 'కప్ ముఖ్యం బిగిల్' అని అన్నారు. అంటే తన దృష్టి ఎన్నికల్లో గెలవాలనే లక్ష్యంపై ఉందని సూచిస్తున్నాడు.
ఒత్తిళ్లకు తలవంచను
1992లో 'నాలైయ తీర్పు' చిత్రంతో ప్రధాన నటుడిగా రంగప్రవేశం చేసిన విజయ్, అంతకు ముందు కొన్ని తమిళ చిత్రాలలో బాలనటుడిగా నటించారు. అతని చివరి చిత్రం 'జన నాయగన్’ సెన్సార్ సర్టిఫికేషన్ ఆలస్యం కావడంతో విడుదల నిలిచిపోయింది. మరోవైపు 2025 సెప్టెంబర్ లో తన ర్యాలీలో జరిగిన కరూర్ తొక్కిసలాట ఘటనలో 41 మంది మరణించారు. దీనిపై న్యూఢిల్లీలో సీబీఐ అతన్ని రెండుసార్లు ప్రశ్నించింది.
ఈ ఘటనల నేపథ్యంలో ఎలాంటి ఒత్తిళ్లకు తలవంచను అని విజయ్ ఈ మీటింగ్ లో పేర్కొనడం గమనార్హం. జన నాయగన్-సెన్సార్ వివాదంపై జనవరి 27న మద్రాస్ హైకోర్టు తీర్పు వెల్లడించే అవకాశముంది. నిజానికి ఈ మూవీ జనవరి 9న రిలీజ్ కావాల్సింది. కానీ సెన్సార్ సర్టిఫికేట్ రాకపోవడంతో వాయిదా పడింది.
మీకు అనిపిస్తుందా?
30 ఏళ్లుగా ఈ పార్టీలు మమ్మల్ని తక్కువ అంచనా వేశాయి, కానీ నా వృత్తి జీవితంలో అత్యున్నత దశలో ప్రజలు నాకు ఈ స్థానాన్ని ఇచ్చారని విజయ్ అన్నారు. చిత్ర పరిశ్రమ నుండి రాజకీయాల్లోకి మారడం గురించి మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికలను 'ప్రజాస్వామ్య యుద్ధం' అని పిలిచిన విజయ్.. తాను ఎటువంటి ఒత్తిళ్లకు తల వంచనని అన్నారు. ఈ ముఖం ఒత్తిళ్లకు లొంగుతుందని మీకు అనిపిస్తుందా? అని అడిగారు. ఇది కూటమి లేకుండా ఒంటరిగా పోటీ చేయాలనే తన ప్రణాళికలను సూచిస్తోంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


