కొత్త దర్శకులకు ప్రభాస్ గుడ్ న్యూస్- షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభించిన హీరో- అనుదీప్ అలాగే వచ్చాడన్న నాగ్ అశ్విన్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ న్యూ డైరెక్టర్స్ గుడ్ న్యూస్ చెబుతూ బంపర్ ఆఫర్ ప్రకటించారు. సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చిన ప్రభాస్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులైన డైరెక్టర్స్‌ను ప్రోత్సహించేందుకు ‘ది స్క్రిప్ట్ క్రాఫ్ట్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిలిం ఫెస్టివల్’ను ప్రారంభించారు.
సినిమా ఇండస్ట్రీలోకి రావాలని, వెండితెరపై తమ కథను చెప్పాలని కోట్లాది మంది కలలు కంటుంటారు. కానీ, సరైన వేదిక దొరక్క ఎంతోమంది ప్రతిభావంతులు వెనకబడిపోతున్నారు. అలాంటి వారి కోసం ‘బాహుబలి’ ప్రభాస్ ఒక అద్భుతమైన మార్గాన్ని సుగమం చేశారు.

ప్రభాస్‌తో ప్రారంభం
కథకులకు, యువ దర్శకులకు గ్లోబల్ ప్లాట్‌ఫామ్ కల్పించే ఉద్దేశంతో ‘ది స్క్రిప్ట్ క్రాఫ్ట్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిలిం ఫెస్టివల్’ను ప్రభాస్ తాజాగా ప్రారంభించారు. దీంతో కొత్త దర్శకులకు గుడ్ న్యూస్ అందడమే కాకుండా ఇది ఒక బంపర్ ఆఫర్ అని కూడా అనుకోవచ్చు.
కథలే మీ కెరీర్‌ను మారుస్తాయి!
షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభం సందర్భంగా విడుదల చేసిన ప్రత్యేక వీడియోలో ప్రభాస్ మాట్లాడుతూ.. "ది స్క్రిప్ట్ క్రాఫ్ట్ అనేది కేవలం ఒక ఫెస్టివల్ మాత్రమే కాదు. ఇది మీ కథలను కెరీర్‌లుగా మార్చే వేదిక. ప్రతి గొంతుకు ఒక ఆరంభం ఉండాలి. ప్రతి కలకూ ఒక అవకాశం దక్కాలి" అని ఎంకరేజింగ్‌గా మాట్లాడారు.
అగ్ర దర్శకుల మద్దతు
థాళ్ల వైష్ణవ్, ప్రమోద్ ఉప్పలపాటి స్థాపించిన ఈ సంస్థ రచయితలు, దర్శకులకు ఒక వారధిలా నిలవబోతోందని తెలుస్తోంది. ఈ వినూత్న ప్రయత్నానికి టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్లు సందీప్ రెడ్డి వంగా, నాగ్ అశ్విన్, హను రాఘవపూడి కూడా మద్దతు పలుకుతూ భాగస్వాములయ్యారు.
సందీప్ రెడ్డి కామెంట్స్
"కాగితం మీద రాసుకున్న కథకు, తెరపై చూసే బొమ్మకు చాలా తేడా ఉంటుంది. కొత్తవారు తమ ప్రతిభను నిరూపించుకోవడానికి షార్ట్ ఫిలిం మేకింగ్ అనేది అత్యంత కీలకమైన అడుగు" అని సందీప్ రెడ్డి వంగా పేర్కొన్నారు.
అనుదీప్ అలాగే వచ్చాడు
నాగ్ అశ్విన్ తన అనుభవాన్ని గుర్తుచేసుకుంటూ.. "నేను అనుదీప్‌ను ఒక షార్ట్ ఫిలిం ద్వారానే గుర్తించాను. అలా ‘జాతిరత్నాలు’ సాధ్యమైంది. ఫిలిం స్కూల్ కంటే మీ పనితీరే మీకు గుర్తింపు తెస్తుంది" అని ఆశాభావం వ్యక్తం చేశారు.
పోటీ ఎలా ఉంటుంది?
ఈ ఫెస్టివల్‌లో పాల్గొనాలనుకునే వారు 2 నిమిషాలకు పైగా నిడివితో ఏ జోనర్‌లో అయినా షార్ట్ ఫిల్మ్ తీసి పంపాలి. ఈ పోటీ సుమారు 90 రోజుల పాటు సాగుతుంది. ప్రేక్షకుల ఓట్లు, లైకులు, రేటింగ్స్ ఆధారంగా ఈ పోటీలో విజేతలను నిర్ణయిస్తారు. టాప్-3 సినిమాలకు ప్రత్యేక బహుమతులతో పాటు, ఇందులోని ఎంట్రీలన్నీ ప్రముఖ నిర్మాణ సంస్థల దృష్టికి వెళ్లే అవకాశం ఉంటుంది.
15 మంది ఫిల్మ్ మేకర్స్‌కు
అంతేకాకుండా, ఈ ఫెస్టివల్ భాగస్వామి అయిన ‘క్విక్ టీవీ’ (Quick TV) ఒక అడుగు ముందుకేసి, ఎంపికైన 15 మంది ఫిల్మ్ మేకర్స్‌కు గంటన్నర నిడివి గల సినిమాలను నిర్మించే అవకాశాన్ని కూడా కల్పిస్తోంది. దీనికి కావలసిన పూర్తి నిర్మాణ సహకారాన్ని వారే అందిస్తారు.
సినిమా కలను కంటున్న యువతకు ఇంతకంటే మంచి అవకాశం మరొకటి ఉండదు. ఇంకెందుకు ఆలస్యం? మీలోని సృజనాత్మకతకు పదును పెట్టండి! అంటూ స్క్రిప్ట్ క్రాఫ్ట్ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ పోటీను ప్రకటించారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


