మరికొన్ని గంటల్లోనే రాజాసాబ్ స్ట్రీమింగ్.. అదిరే న్యూస్ చెప్పిన ఓటీటీ ప్లాట్‌ఫామ్‌.. థియేట‌ర్లో చూడ‌ని ఎక్సెటెండెడ్ క‌ట్

ప్రభాస్ ఫ్యాన్స్, ఓటీటీ లవర్స్ ఎంతో ఎగ్జైటింగ్ గా వెయిట్ చేస్తున్న టైమ్ వచ్చేస్తోంది. హారర్ ఫాంటసీ థ్రిల్లర్ ది రాజాసాబ్ మరికొన్ని గంటల్లోనే ఓటీటీలోకి రాబోతుంది. ఈ నేపథ్యంలో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అదిరే న్యూస్ చెప్పింది. 

Published on: Feb 5, 2026, 13:50:22 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారీ అంచనాలతో థియేటర్లకు వచ్చి నిరాశపర్చిన హారర్ ఫాంటసీ మూవీ ‘ది రాజాసాబ్’. ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. ఇప్పుడీ మూవీ థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోపే ఓటీటీలోకి రానుంది. మరికొన్ని గంటల్లోనే స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో ఓటీటీ ప్లాట్ ఫామ్ ఓ అదిరిపోయే న్యూస్ చెప్పింది.

ఓటీటీలోకి రాజాసాబ్ (x/JioHotstarTel_)
ఓటీటీలోకి రాజాసాబ్ (x/JioHotstarTel_)

రాజాసాబ్ ఓటీటీ

ప్రభాస్ హీరోగా నటించిన హారర్ ఫాంటసీ థ్రిల్లర్ ది రాజాసాబ్. ఈ మూవీ మరికొన్ని గంటల్లోనే ఓటీటీలో అడుగుపెట్టనుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. రాజాసాబ్ ఈ రోజు రాత్రి 12 గంటల నుంచి జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో ఓటీటీ వ్యూయర్స్ కు ఈ మూవీ అందుబాటులోకి రానుంది.

ఎక్సెటెండెడ్ క‌ట్

రాజాసాబ్ ఓటీటీ రిలీజ్ నేపథ్యంలో సినీ లవర్స్ కు జియోహాట్‌స్టార్ ఓ అదిరిపోయే న్యూస్ చెప్పింది. ఈ మూవీని ఎక్సెటెండెడ్ క‌ట్ తో స్ట్రీమింగ్ చేయనుంది. అంటే థియేటర్లలో ప్రీమియర్ అయిన సినిమాలో లేని సీన్లు ఇప్పుడు ఓటీటీలోకి రాబోతున్న రాజాసాబ్ మూవీలో ఉండబోతున్నాయి. ఈ వార్తతో ఫ్యాన్స్ ఫుల్ ఎగ్జైట్ అవుతున్నారు. ఏ సీన్లు యాడ్ చేశారోనని థ్రిల్ ఫీల్ అవుతున్నారు.

సంక్రాంతి రిలీజ్

సంక్రాంతి 2026 సందర్భంగా రాజాసాబ్ మూవీ జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. దీనికి మారుతి డైరెక్టర్. ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్లు. భారీ అంచనాలతో రిలీజైన హారర్ ఫాంటసీ థ్రిల్లర్ రాజాసాబ్ బాక్సాఫీస్ దగ్గర తన సక్సెస్ ఫుల్ రన్ కొనసాగించలేకపోయింది. అదిరే ఓపెనింగ్స్ తర్వాత మూవీ ఒక్కసారిగా పడిపోయింది.

నెల రోజుల్లోపే

థియేటర్లలో డిజాస్టర్ గా నిలిచిన రాజాసాబ్ మూవీ ఇప్పుడు నెల రోజుల్లోపే ఓటీటీలోకి రానుంది. ఇవాళ అర్ధరాత్రి 12 గంటల నుంచి అంటే డేట్ ప్రకారం చూసుకుంటే ఫిబ్రవరి 6 నుంచి ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాలో సంజయ్ దత్ కీలక పాత్ర పోషించాడు.

తన నానమ్మ కోరిక మేరకు తాతయ్యను వెతుక్కుంటూ హీరో ఓ రాజ మహల్ కు వెళ్తాడు. అక్కడి వెళ్లిన తర్వాత అన్ని వింత సంఘటనలు జరుగుతాయి. అందరూ రివర్స్ లో వేలాడుతారు. హీరో ప్రాణాలు ప్రమాదంలో పడతాయి. మరి ఆ తర్వాత ఏం జరిగింది? రాజ మహల్ లో విచిత్రాలకు కారణం ఎవరు? అన్నది రాజాసాబ్ మూవీలో చూడాల్సిందే.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More