జియోహాట్‌స్టార్ టాప్ 10 ట్రెండింగ్ సినిమాలు ఇవే.. నంబర్ వన్‌గా నితిన్ డిజాస్టర్ మూవీ.. అతనిదే మరో సినిమా కూడా..

జియోహాట్‌స్టార్ లో టాప్ 10 ట్రెండింగ్ సినిమాల విషయానికి వస్తే.. హిందీలో ఆశ్చర్యకరంగా నితిన్ నటించిన ఓ డిజాస్టర్ మూవీ తొలి స్థానంలో ఉండటం విశేషం. అంతేకాదు టాప్ 10లో అతడు నటించిన మరో సినిమా కూడా ఉంది.

Published on: Jan 9, 2026, 16:07:13 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

జియో హాట్‌స్టార్ (JioHotstar) కంటెంట్ విషయంలో దూసుకుపోతోంది. అయితే ఈ ఓటీటీలోని హిందీ టాప్ 10 ట్రెండింగ్ సినిమాలు మాత్రం కాస్త ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఎందుకంటే వీటిలో తెలుగు డబ్బింగ్ సినిమాల హవా చూడొచ్చు. తొలి స్థానంలో నితిన్ రాబిన్‌హుడ్ మూవీతోపాటు ఎప్పుడో 30 ఏళ్ల కిందట వచ్చిన అందాజ్ అప్నా అప్నాలాంటి సినిమాలు ఉన్నాయి. హాట్‌స్టార్‌లో ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న ఆ టాప్ 10 సినిమాలు, వాటి ఐఎండీబీ రేటింగ్స్ వివరాలు ఇవే.

జియోహాట్‌స్టార్ టాప్ 10 ట్రెండింగ్ సినిమాలు ఇవే.. నంబర్ వన్‌గా నితిన్ డిజాస్టర్ మూవీ.. అతనిదే మరో సినిమా కూడా.. (IMDb)
జియోహాట్‌స్టార్ టాప్ 10 ట్రెండింగ్ సినిమాలు ఇవే.. నంబర్ వన్‌గా నితిన్ డిజాస్టర్ మూవీ.. అతనిదే మరో సినిమా కూడా.. (IMDb)

టాప్ 10 సినిమాల లిస్ట్

రాబిన్‌హుడ్ (Robinhood): లిస్ట్‌లో మొదటి స్థానంలో నిలిచింది తెలుగు యాక్షన్ డ్రామా 'రాబిన్‌హుడ్'. నితిన్ లీడ్ రోల్లో నటించి, వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమా హిందీ వెర్షన్ జియోహాట్‌స్టార్‌లో ఉంది. దీనికి ఐఎండీబీ రేటింగ్ కేవలం 4.5 మాత్రమే.

మర్డర్‌బాద్ (Murderbad): ఇదొక హిందీ రొమాంటిక్-థ్రిల్లర్. అర్నబ్ ఛటర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమా గతేడాది జులైలో విడుదలైంది. దీనికి కూడా ఐఎండీబీ రేటింగ్ కేవలం 4.4 మాత్రమే కావడం గమనార్హం.

పక్కా కమర్షియల్: గోపీచంద్ నటించిన ఈ తెలుగు కోర్ట్‌రూమ్ యాక్షన్ కామెడీ సినిమా కూడా హిందీలో అందుబాటులో ఉంది. దీనికి 4.2 రేటింగ్ ఉంది.

హౌ టు హావ్ సెక్స్: ఇదొక టీనేజ్ డ్రామా సినిమా. ఈ ఇంగ్లిష్ మూవీ హిందీ డబ్బింగ్ వెర్షన్ నాలుగో స్థానంలో ఉంది. దీనికి 6.4 రేటింగ్.

జాలీ ఎల్‌ఎల్‌బీ 2: అక్షయ్ కుమార్ నటించిన సూపర్ హిట్ కోర్ట్‌రూమ్ డ్రామా (2017) ఇది. ఇటీవల దీనికి మూడో పార్ట్ కూడా వచ్చింది. ఈ మూవీకి ఐఎండీబీలో 7.2 రేటింగ్ ఉండటం విశేషం.

తమ్ముడు: నితిన్ నటించిన మరో మూవీ ఇది. 2025లో వచ్చిన ఈ తెలుగు యాక్షన్ డ్రామా టాప్ 10లో ఉంది. దీనికైతే మరీ దారుణంగా ఐఎండీబీ రేటింగ్ 3.7 మాత్రమే.

సలార్: రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన మాస్ యాక్షన్ సినిమా కూడా టాప్ 10 లిస్ట్‌లో ఉంది. ది రాజా సాబ్ రిలీజైన వేళ అతని ఈ యాక్షన్ మూవీ ట్రెండింగ్ లో ఉంది. దీనికి ఐఎండీబీ రేటింగ్ 6.6గా ఉంది.

జాలీ ఎల్‌ఎల్‌బీ: అర్షద్ వార్సీ నటించిన ఈ ఫ్రాంచైజీ మొదటి పార్ట్. ఇది కూడా కామెడీ లీగల్ డ్రామా. దీనికి ఐఎండీబీ రేటింగ్ 7.5గా ఉంది.

హృదయపూర్వం: మలయాళ రొమాంటిక్ కామెడీ-డ్రామా మూవీ. మోహన్‌లాల్ నటించిన ఈ సినిమా హిందీ వెర్షన్ టాప్ 10లో చోటు దక్కించుకుంది. దీనికి 6.7 రేటింగ్ నమోదైంది.

అందాజ్ అప్నా అప్నా: బాలీవుడ్ కల్ట్ క్లాసిక్. సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్ కలిసి నటించిన ఈ సినిమా 1994లో వచ్చింది. ఇప్పటికీ ఇది హాట్‌స్టార్‌లో ట్రెండింగ్‌లో ఉంది. దీనికి 8 రేటింగ్ ఉండటం విశేషం.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More