ఓటీటీలోకి మోహన్‌లాల్ సూపర్ హిట్ మలయాళం యాక్షన్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

మలయాళం సినిమా ఇండస్ట్రీ నుంచి గతేడాది వచ్చిన మరో సూపర్ హిట్ మూవీ భ భ బ. మోహన్‌లాల్, దిలీప్ కలిసి నటించిన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ కానుంది. మరి ఈ మూవీని ఎప్పుడు, ఎక్కడ చూడాలో తెలుసుకోండి.

Published on: Jan 9, 2026, 14:34:01 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మలయాళ సూపర్ స్టార్స్ మోహన్‌లాల్, దిలీప్ కలిసి నటించిన క్రేజీ యాక్షన్ కామెడీ మూవీ 'భ భ బ' (భయం భక్తి బహుమానం). భారీ అంచనాల మధ్య డిసెంబర్ 18న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా.. ఇప్పుడు ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా కథాకమామీషు, బాక్సాఫీస్ రిపోర్ట్.. ఓటీటీ వివరాలు ఇక్కడ చూడండి.

ఓటీటీలోకి మోహన్‌లాల్ సూపర్ హిట్ మలయాళం యాక్షన్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే
ఓటీటీలోకి మోహన్‌లాల్ సూపర్ హిట్ మలయాళం యాక్షన్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

భ భ బ ఓటీటీ రిలీజ్ డేట్

ఈ మధ్య మలయాళం సినిమాల జోరు పెంచుతున్న జీ5 ఓటీటీయే భ భ బ మూవీ హక్కులను కూడా సొంతం చేసుకుంది. తాజాగా మూవీ స్ట్రీమింగ్ డేట్ ను అనౌన్స్ చేసింది. జనవరి 16న అంటే కనుమ నుంచి ఈ సినిమా జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. బాక్సాఫీస్ దగ్గర రూ.50 కోట్లు వసూలు చేసిన ఈ మూవీకి ఓటీటీలో మరింత మంచి రెస్పాన్స్ వస్తుందని భావిస్తున్నారు.

ప్రస్తుతం మలయాళం వెర్షన్ (ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో) కన్ఫర్మ్ అయ్యింది. తెలుగు డబ్బింగ్ వెర్షన్ పై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అయితే పాన్-ఇండియా అప్పీల్ కోసం ఇతర భాషల్లోనూ అందుబాటులోకి తెచ్చే ఛాన్స్ ఉంది.

భ భ బ మూవీ గురించి..

‘భయం, భక్తి, బహుమానం’ అనే టైటిల్ ను షార్ట్ గా భ భ బ అంటూ ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టైటిల్ తోపాటు మోహన్‌లాల్, దిలీప్ లాంటి స్టార్ హీరోలతో మూవీ రిలీజ్ కు ముందే ఎంతో హైప్ క్రియేట్ చేసింది. యాక్షన్ కామెడీ జానర్లో తెరకెక్కిన ఈ సినిమాలో మోహన్‌లాల్ గెస్ట్ రోల్ చాలా ఇంపాక్ట్ చూపించింది. ఈ ఇద్దరితోపాటు వినీత్ శ్రీనివాస్, ధ్యాన్ శ్రీనివాస్ ముఖ్య పాత్రలు పోషించారు.

ధనంజయ్ శంకర్ డైరెక్ట్ చేశాడు. ముగ్గురు వ్యక్తుల జీవితాలు ఎలా ఒకచోట కలిశాయి? అందులో గిల్లి బాల (మోహన్‌లాల్) చేసిన రచ్చ ఏంటి? అనేదే ఈ సినిమా స్టోరీ లైన్. థియేటర్లలో ఈ సినిమాకి మిశ్రమ స్పందన వచ్చింది.

మోహన్‌లాల్ స్క్రీన్ ప్రెజన్స్, కామెడీ సీన్స్ బాగున్నాయని ఫ్యాన్స్ సంబరపడినా, కథలో పట్టు లేకపోవడంతో సాధారణ ఆడియన్స్‌కి అంతగా కనెక్ట్ కాలేదు. బాక్సాఫీస్ పరంగా చూస్తే.. డిసెంబర్ 18న రిలీజైన ఈ మూవీ ఓ మోస్తరు వసూళ్లు సాధించింది. దాదాపు రూ. 40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం.. సుమారు రూ. 50 కోట్లు (గ్రాస్) రాబట్టింది.

బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేయలేకపోయిన 'భ భ బ'.. ఓటీటీలో కామెడీ ప్రియులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. మోహన్‌లాల్ మాస్ అవతార్ చూడాలనుకునే వారికి ఇది ఓటీటీలో మంచి ఆప్షన్.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More