పాపం మోహన్‌లాల్.. రూ.70 కోట్ల సినిమాకు రూ.24 లక్షలు.. హ్యాట్రిక్ బ్లాక్‌బస్టర్లు ఇచ్చి చివరికి దారుణమైన డిజాస్టర్
మలయాళం స్టార్ హీరో మోహన్‌లాల్ కు చేదు అనుభవం మిగిల్చింది వృషభ మూవీ. రూ.70 కోట్లతో తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దారుణమైన డిజాస్టర్ గా మిగిలిపోతోంది. మూడో రోజు ఈ మూవీకి కేవలం రూ.24 లక్షలే రావడం గమనార్హం.
మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ (Mohanlal) పరిస్థితి ఇప్పుడు దారుణంగా ఉంది. కొన్ని నెలల క్రితమే 'ఎల్2: ఎంపురాన్' (లూసిఫర్ 2)తో ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసిన అతడు.. ఇప్పుడు 'వృషభ' (Vrusshabha) సినిమాతో తన కెరీర్‌లోనే అత్యంత దారుణమైన ఫలితాన్ని చవిచూశాడు. రూ. 70 కోట్ల భారీ బడ్జెట్‌తో తీసిన ఈ సినిమాకు కనీస ఓపెనింగ్స్ కూడా రాలేదు.

వృషభ కలెక్షన్స్ మరీ ఇంత దారుణమా?
కొన్ని నెలల కిందట 'ఎంపురాన్' సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన మోహన్‌లాల్.. క్రిస్మస్ కానుకగా వచ్చిన 'వృషభ'తో గట్టి దెబ్బ తిన్నాడు. ఈ సినిమా కలెక్షన్స్ చూస్తే ట్రేడ్ పండితులు కూడా నోరెళ్లబెడుతున్నారు. ఈ మూవీ క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న రిలీజైంది. ఆరోజు హాలిడే అయినా కూడా ఇండియాలో కేవలం రూ. 60 లక్షలు మాత్రమే వసూలు చేసింది. ఇక రెండో రోజు రూ. 22 లక్షలు, మూడో రోజు (శనివారం) రూ. 24 లక్షలు మాత్రమే వచ్చాయి.
మూడు రోజులు కలిపితే ఇండియాలో ఈ సినిమా కలెక్షన్స్ జస్ట్ రూ. కోటి దాటాయి అంతే. ఓవర్సీస్ లో అయితే మరీ దారుణంగా కేవలం రూ. 20 లక్షలు మాత్రమే వచ్చాయి. 'ఎంపురాన్' సినిమా మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ. 65 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. కానీ 'వృషభ' 3 రోజుల్లో కనీసం కోటిన్నర కూడా రాబట్టలేకపోయింది.
నిర్మాతకు కోలుకోలేని దెబ్బ
మోహన్‌లాల్ లీడ్ రోల్లో నటించిన వృషభ సినిమా కోసం దాదాపు రూ. 70 కోట్లు ఖర్చు పెట్టారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఈ సినిమా ఫుల్ రన్‌లో కనీసం రూ. 5 కోట్లు కూడా రాబట్టేలా లేదు. చాలా థియేటర్ల నుంచి సినిమాను తీసేసే పరిస్థితి ఉంది. దీంతో నిర్మాతకు 90% పైగా నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. మోహన్‌లాల్ కెరీర్‌లో ఇదే బిగ్గెస్ట్ డిజాస్టర్ అంటున్నారు.
వృషభ సినిమా గురించి..
నంద కిషోర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మోహన్‌లాల్ ద్విపాత్రాభినయం (ఒకటి రాజు పాత్ర, మరొకటి మోడరన్ బిజినెస్ మ్యాన్) చేశాడు. దీనిని తెలుగు, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో రిలీజ్ చేశారు. కానీ డబ్బింగ్ వెర్షన్లన్నీ కలిపి 3 రోజుల్లో కేవలం రూ. 34 లక్షలే తెచ్చాయి.
మోహన్‌లాల్ తోపాటు సమర్జిత్ లంకేష్, నయన్ సారిక, రాగిణి ద్వివేది ఇందులో నటించారు. క్రిటిక్స్ నుంచి నెగటివ్ రివ్యూలు రావడంతో జనాలు థియేటర్ల వైపు చూడలేదు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


