ఓటీటీలో ఈవారం తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో మిస్ కాకుండా చూడాల్సిన సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే

ఈవారం ఓటీటీలోకి తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలకు చెందిన ఇంట్రెస్టింగ్ సినిమాలు స్ట్రీమింగ్ కు వచ్చాయి. వీటిలో అఖండ 2 లాంటి హిట్ మూవీ కూడా ఉంది. మరి ఆ సినిమాలేంటి? ఎక్కడ చూడాలో తెలుసుకోండి.

Published on: Jan 7, 2026, 14:09:33 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఈ వారం ఓటీటీ ప్రియులకు పండగే. ముఖ్యంగా బాలకృష్ణ ఫ్యాన్స్‌కి ఇది పెద్ద గుడ్ న్యూస్. బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపిన 'అఖండ 2: తాండవం' ఈ వారమే ఓటీటీలోకి వచ్చేస్తోంది. నెట్‌ఫ్లిక్స్, జీ5, అమెజాన్ ప్రైమ్, సన్ నెక్స్ట్ వంటి ప్లాట్‌ఫామ్స్‌లో ఈ శుక్రవారం (జనవరి 9) నుండి స్ట్రీమింగ్ కానున్న తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల పూర్తి లిస్ట్ ఇదే.

ఓటీటీలో ఈవారం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో మిస్ కాకుండా చూడాల్సిన సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే
ఓటీటీలో ఈవారం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో మిస్ కాకుండా చూడాల్సిన సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి హడావిడి మొదలవ్వక ముందే ఓటీటీలో సందడి మొదలైంది. బాలయ్య 'అఖండ 2' నుంచి కవిన్ నటించిన థ్రిల్లర్ 'మాస్క్' వరకు.. ఈ వారం స్ట్రీమింగ్ కానున్న సినిమాల వివరాలు ఇక్కడ చూడండి.

అఖండ 2: తాండవం - నెట్‌ఫ్లిక్స్

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన ఈ సీక్వెల్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ అఖండ 2 మూవీ శుక్రవారం (జనవరి 9) నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. దీనిని అధికారికంగా ఆ ఓటీటీ వెల్లడించింది. బయో వార్‌ఫేర్ (జీవాయుధాల) ముప్పు నుంచి భారతదేశాన్ని కాపాడటానికి అఖండ మళ్ళీ వస్తాడు. దేవుడిపై నమ్మకాన్ని పునరుద్ధరించే ఈ పోరాటంలో బాలయ్య విశ్వరూపం చూడొచ్చు.

జిగ్రీస్ - సన్ నెక్ట్స్

ఇక గతేడాది నవంబర్ లో రిలీజైన జిగ్రీస్ అనే తెలుగు కామెడీ మూవీ కూడా సన్ నెక్ట్స్ ఓటీటీలోకి వచ్చేసింది. ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా నలుగురు ఫ్రెండ్స్ చేతిలో ఒక్క రూపాయి లేకుండా గోవా ట్రిప్ కు వెళ్లి ఎలాంటి తంటాలు పడతారు అన్నది చూపించింది. నవ్వులు పంచడంతోపాటు ఎమోషనల్ గానూ ఆకట్టుకుంది.

మాస్క్ - జీ5 ఓటీటీ

'డాడా', 'స్టార్' సినిమాలతో ఆకట్టుకున్న కవిన్ నటించిన లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ ఈ మాస్క్. ఈ సినిమా శుక్రవారం (జనవరి 9) జీ5 ఓటీటీలోకి వస్తోంది. రూ. 440 కోట్ల భారీ దొంగతనం చుట్టూ తిరిగే కథ ఇది. కేవలం ఏడు రోజుల్లో ఆ డబ్బును తిరిగి రాబట్టడానికి చేసే సాహసం, అందులో ఉండే ట్విస్టులే ఈ సినిమా.

బాల్టి - ప్రైమ్ వీడియో

కేరళ-తమిళనాడు బోర్డర్‌లో జరిగే క్రైమ్ డ్రామా ఈ బాల్టీ. ఇదో మలయాళం మూవీ. శుక్రవారమే ప్రైమ్ వీడియోలోకి వస్తోంది. నలుగురు టాలెంటెడ్ కబడ్డీ ప్లేయర్స్ స్థానిక గూండాల గొడవలో ఇరుక్కుంటారు. స్నేహం, ప్రేమ, విధేయతలకు పరీక్ష పెట్టే క్రైమ్ వరల్డ్ కథ ఇది. షేన్ నిగమ్, శాంతను భాగ్యరాజ్, ప్రీతి అస్రాని, సెల్వరాఘవన్ నటించారు.

అంగమ్మల్ - సన్ నెక్ట్స్

విమర్శకుల ప్రశంసలు పొందిన తమిళ సినిమా ఈ అంగమ్మల్. ఇది శుక్రవారం సన్ నెక్ట్స్ ఓటీటీలోకి అడుగుపెట్టనుంది. తమిళనాడులోని ఒక గ్రామీణ వితంతువు బ్లౌజ్ (రవికె) వేసుకోవడానికి నిరాకరిస్తుంది. తన కొడుకు ఒక ధనవంతుల ఇంటి అమ్మాయిని పరిచయం చేయాలనుకున్నప్పుడు.. తల్లి వ్యక్తిగత నిర్ణయం ఎలాంటి గొడవలకు దారితీసింది అనేదే ఈ ఎమోషనల్ డ్రామా.

ఫ్రీడం ఎట్ మిడ్‌నైట్ సీజన్ 2 - సోనీ లివ్

భారత స్వాతంత్య్ర పోరాట చరిత్రను కళ్లకు కట్టే వెబ్ సిరీస్ ఇది. సోనీ లివ్ లో జనవరి 9 నుంచి స్ట్రీమింగ్ కానుంది. గతేడాది వచ్చిన తొలి సీజన్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దేశ విభజన నాటి పరిస్థితులను ఈ రెండో సీజన్ కళ్లకు కట్టనుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More