బుల్లితెరపై మెగా కోడలు లావణ్య త్రిపాఠి, మెగా డాటర్ నిహారిక కొణిదెల సందడి- అదనపు అట్రాక్షన్‌గా రంభ- ఓటీటీలోనూ చూడొచ్చు!

బుల్లితెర వేదికపై మెగా కోడలు లావణ్య త్రిపాఠి, మెగా డాటర్ నిహారిక కొణిదెల కలిసి సందడి చేయనున్నారు. వీరికి మరింత అట్రాక్షన్‌గా సీనియర్ హీరోయిన్ రంభ నిలవనుంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్ స్పెషల్ జడ్డ్‌గా వ్యవహరించనున్న ఆట డ్యాన్స్ రియాలిటీ షో కొత్త సీజన్‌ను ఈ ఓటీటీలో చూసేయొచ్చు.

Feb 21, 2026, 15:20:21 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలుగు వినోద రంగంలో అగ్రగామి ఛానెల్‌గా జీ తెలుగు ఎప్పుడూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. వినూత్న, ఉత్కంఠభరితమైన కార్యక్రమాలు, సీరియల్స్‌తో ప్రేక్షకులను అలరిస్తున్న జీ తెలుగు ఇటీవలే ఆట డ్యాన్స్​ రియాలిటీ షో సరికొత్త సీజన్​‌ను ఘనంగా ప్రారంభించింది.

బుల్లితెరపై మెగా కోడలు లావణ్య త్రిపాఠి, మెగా డాటర్ నిహారిక కొణిదెల సందడి- అదనపు అట్రాక్షన్‌గా రంభ- ఓటీటీలోనూ చూడొచ్చు!
బుల్లితెరపై మెగా కోడలు లావణ్య త్రిపాఠి, మెగా డాటర్ నిహారిక కొణిదెల సందడి- అదనపు అట్రాక్షన్‌గా రంభ- ఓటీటీలోనూ చూడొచ్చు!

అద్భుత ప్రదర్శనలతో

కొత్త మలుపులు, స్టార్ గెస్ట్‌లు, అద్భుత ప్రదర్శనలతో ఆట డ్యాన్స్ రియాలిటీ షో న్యూ సీజన్‌ ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంటోంది. ఈ వారం మరిన్ని ట్విస్ట్‌​లు, సర్‌ప్రైజ్‌లతో వచ్చేస్తున్న ఆట డ్యాన్స్​ షో ప్రతి శని, ఆదివారాలు రాత్రి 9 గంటలకు జీ తెలుగులో ప్రసారం కానున్నాయి.

48 గంటలకు ముందు జీ5లో

అయితే, టీవీ ప్రసారానికి 48 గంటల ముందే గురు, శుక్రవారాల్లో జీ5 ఓటీటీలో కొత్త ఎపిసోడ్‌లు అందుబాటులో ఉంటాయని మేకర్స్ తెలిపారు. అంటే టీవీతోపాటు ఓటీటీలోనూ ఆట డ్యాన్స్ రియాలిటీ షోను ఎంచక్కా చూసేయొచ్చు. ఇకపోతే ఆట సరికొత్త సీజన్‌​కి ఎనర్జిటిక్ యాంకర్ సుధీర్ వాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.

నలుగురు మెంటార్స్, 16 మంది పోటీదారులు

ఆట టైటిల్ కోసం నలుగురు మెంటార్స్ సీరియల్ హీరోయిన్ కావ్య, బిగ్ బాస్ బ్యూటీ విష్ణుప్రియ, నటుడు వంశీ, సింగర్ సమీరా భరద్వాజ్ మార్గదర్శకత్వంలో 16 మంది ప్రతిభావంతులు పోటీపడుతున్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటి రాధికా శరత్​ కుమార్, మెగా డాటర్ నిహారిక కొణిదెల న్యాయ నిర్ణేతలుగా ఉన్నారు.

జడ్జ్‌గా రఘు మాస్టర్

అయితే, వీరితో కూడిన జడ్జ్​ ప్యానల్‌​లో ఈ వారం నుంచి ప్రముఖ కొరియోగ్రాఫర్​ రఘు మాస్టర్ కూడా చేరుతున్నారు. అంతేకాదు, ఈ వారం ప్రేక్షకులకు మరిన్ని సర్‌ప్రైజ్‌లు ఉండనున్నాయి.

మెగా కోడలు సందడి

మెగా కోడలు లావణ్య త్రిపాఠి ఆట షోలో సందడి చేయనున్నారు. సీనియర్​ హీరోయిన్​ రంభ ఈ వారం స్పెషల్​ జడ్జిగా వ్యవహరించనున్నారు. హిట్​ మెషిన్​ డైరెక్టర్ అనిల్​ రావిపూడి కూడా ఈ వారం షోకి స్పెషల్ గెస్టులుగా హాజరై ప్రేక్షకులను అలరించనున్నారు.

ఈ వారం ఎపిసోడ్స్

ఈ వారం ఎపిసోడ్​‌లో ఉత్కంఠభరితమైన పోటీ, అద్భుతమైన ప్రదర్శనలతోపాటు కామెడీ పంచ్‌​లు, సరదా సంభాషణలు కూడా బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకోనున్నాయి. ఈ వారాంతం ఎపిసోడ్స్‌ను ​ని మీరూ మిస్ కాకుండా చూసేయండి అంటూ జీ తెలుగు తాజాగా ప్రకటించింది.

అదనపు అట్రాక్షన్

ఇదిలా ఉంటే, ఆట డ్యాన్స్ రియాలిటీ షో సరికొత్త సీజన్‌లో మెగా డాటర్, మెగా కోడలు ఇద్దరు ఒకే వేదికపై సందడి చేయనున్నారు. వదినమరదలు అయిన లావణ్య త్రిపాఠి, నిహారిక కొణిదెల బుల్లితెర వైదికపై కలిసి కనిపించడం మెగా ఫ్యాన్స్‌తోపాటు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు మంచి ట్రీట్ కానుంది. వీరితోపాటు సీనియర్ గ్లామర్ హీరోయిన్ రంభ కూడా చేరడం అదనపు అట్రాక్షన్ అని చెప్పుకోవచ్చు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More