అల్లు అర్జున్ 42 నిబంధనల వివాదంపై మలయాళ నటుడి కామెంట్స్- వారి నుంచి మెసేజ్‌లు వస్తున్నాయన్న శివ హరిహరన్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 42 నిబంధనల ఆరోపణలు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తున్నాయి. ఈ విషయంపై అనేకమంది స్పందిస్తున్నారు. తాజాగా మలయాళ నటుడు శివ హరిహరన్ కూడా అల్లు అర్జున్ 42 రూల్స్ కాంట్రవర్సీపై కామెంట్స్ చేశారు. వారి నుంచి మెసేజ్‌లు వస్తున్నాయంటూ చెప్పుకొచ్చారు.
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు సంబంధించి గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ఒక వార్త తెగ హల్చల్ చేస్తోంది. బన్నీని కలవాలంటే దాదాపు '42 కఠిన నిబంధనలు' పాటించాలంటూ ఒక బ్రాండ్ స్ట్రాటజిస్ట్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి.

అయితే, ఈ ఆరోపణలను అల్లు అర్జున్ టీమ్ ఇప్పటికే ఖండించడమే కాకుండా, సదరు వ్యక్తిపై న్యాయపరమైన చర్యలు కూడా ప్రారంభించింది. ఈ క్రమంలో అల్లు అర్జున్‌తో కలిసి పనిచేసిన నటీనటులు కూడా ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు.
'ఆ నిబంధనలన్నీ కట్టుకథలే'
తాజాగా మలయాళ నటుడు శివ హరిహరన్ ఈ వివాదంపై స్పందిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ చేశారు. ఇటీవల ఒక శీతల పానీయం ప్రకటన షూటింగ్‌లో అల్లు అర్జున్‌తో కలిసి దిగిన ఫోటోను ఆయన పంచుకున్నారు.
42 నిబంధనల వార్తలపై
"బన్నీ గారికి సంబంధించిన ఆ 42 నిబంధనల వార్తలపై నాకు చాలా మంది అభిమానుల నుంచి మెసేజ్‌లు వస్తున్నాయి. అదంతా ఒక కట్టుకథ మాత్రమే" అని శివ హరిహరన్ స్పష్టం చేశారు.
దయగల నటుల్లో ఒకరు
షూటింగ్ సమయంలో అల్లు అర్జున్ ప్రవర్తన గురించి శివ హరిహరన్ వివరిస్తూ.. "ఆయన (అల్లు అర్జున్) నేను పనిచేసిన అత్యంత కూల్, దయగల నటులలో ఒకరు. మేము ఫోటో అడగడానికి సంకోచిస్తుంటే, ఆయనే స్వయంగా పిలిచి మరీ ఫోటోలు దిగారు" అని తెలిపారు.
"షూటింగ్ పూర్తయిన తర్వాత కూడా మా కోసం వేచి ఉండి, మాకు ఫోటోలు అందేలా తన మేనేజర్లను పంపారు. 'హ్యాపీ' సినిమా నుంచి నేను ఆయనకు పెద్ద అభిమానిని, ఇప్పుడు ఆ అభిమానం రెట్టింపు అయింది" అని అల్లు అర్జున్‌ను శివ హరిహరన్ కొనియాడారు.
అసలు వివాదం ఏమిటి?
కావేరీ బారువా అనే బ్రాండ్ స్ట్రాటజిస్ట్ ఒక పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ అల్లు అర్జున్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. "హైదరాబాద్‌లో అల్లు అర్జున్‌ను కలవడానికి ముందు మాకు 42 నిబంధనలతో కూడిన ఒక నోట్ ఇచ్చారు. సార్ (అల్లు అర్జున్) కళ్లలోకి నేరుగా చూడకూడదు, షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు వంటి వింత నిబంధనలు అందులో ఉన్నాయి" అని ఆమె పేర్కొన్నారు.
పూర్తిగా నిరాధారం
ఈ వ్యాఖ్యలు వైరల్ కావడంతో అల్లు అర్జున్ టీమ్ ఘాటుగా స్పందించింది. "అల్లు అర్జున్‌పై వస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారం. ఆయన ఎప్పుడూ ఎంతో హుందాగా, గౌరవంగా ప్రవర్తిస్తారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలను మేము తీవ్రంగా పరిగణిస్తున్నాం. బాధ్యులపై మా లీగల్ టీమ్ పరువు నష్ట దావా వేస్తోంది" అని ఒక ప్రకటన విడుదల చేశారు.
అల్లు అర్జున్ తదుపరి చిత్రాలు
ప్రస్తుతం అల్లు అర్జున్ తన తదుపరి ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో (AA22) ఒక భారీ పాన్-ఇండియా చిత్రంలో ఆయన నటించనున్నారు. ఇందులో దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తుండటం విశేషం. దీనితో పాటు, సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కూడా ఒక సినిమాకు బన్నీ పచ్చజెండా ఊపారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper












