కూతురు దువా తినే ఐటమ్, వినే పాటల గురించి చెప్పిన దీపికా పదుకొణె- నటి కాకుంటే ఆ రెండు అయ్యేదాన్నంటూ!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె తన మాతృత్వాన్ని పూర్తిస్థాయిలో ఆస్వాదిస్తోంది. తన ప్రపంచమంతా ఇప్పుడు కూతురు 'దువా' చుట్టూనే తిరుగుతోందని చెబుతూ, తన బ్యాగులో ఉండే వింత వస్తువుల నుంచి తనకు ఇష్టమైన పాటల వరకు ఆసక్తికర విషయాలను తాజాగా పంచుకుంది దీపికా పదుకొణె.
బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొణె గతేడాది సెప్టెంబర్ 8న తమ జీవితంలోకి చిన్నారి 'దువా'ను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి దీపికా వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాజాగా ‘హార్పర్స్ బజార్ ఇండియా’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దీపికా తన కూతురు దువా గురించి చేసిన దీపికా పదుకొణె వ్యాఖ్యలు నెటిజన్ల మనసు గెలుచుకుంటున్నాయి.

నా కూతురే నా లోకం..
ప్రస్తుతం మీకు దేనిపై ఎక్కువగా మక్కువ (Obsession) ఉందని అడగ్గా.. "ప్రస్తుతం అని కాదు, నా జీవితకాలం నా కూతురే నాకు అతిపెద్ద మక్కువ" అని దీపికా బదులిచ్చింది. తల్లయ్యాక తనలో వచ్చిన మార్పులను వివరిస్తూ కొన్ని ఆసక్తికర విషయాలు బయటపెట్టింది.
మీ బ్యాగులో ఉండే వింత వస్తువు ఏదని అడగ్గా.. "దువా తింటూ నా బ్యాగులో పడేసిన ఒక 'థెప్లా' (గుజరాతీ వంటకం) ముక్క" అని నవ్వుతూ సమాధానమిచ్చింది దీపికా పదుకొణె. అంత పెద్ద హీరోయిన్ అయినా తన బిడ్డ కోసం తన బ్యాగులో తినుబండారాలు కూడా ఉంచుకోవడం చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.
అంతేకాదు, ప్రస్తుతం తనకు ఇష్టమైన కచేరీ (Karaoke) పాట ఏదని అడగ్గా.. చిన్నపిల్లలు పాడుకునే 'హెడ్, షోల్డర్స్, నీస్ అండ్ టోస్' రైమ్స్ అని చెప్పింది స్టార్ హీరోయిన్. దీపికా రోజూ ఎక్కువగా వాడే పదం 'ఐ లవ్ యు' అని, అది కూడా తన ముద్దుల కూతురికే అని చెప్పుకొచ్చారు.
నటి కాకపోతే లాయర్ అయ్యేదాన్ని!
ఒకవేళ నటి కాకపోతే ఏమయ్యేవారని ప్రశ్నించగా.. "నేను ఇంటీరియర్ డిజైనర్ అయ్యేదాన్ని అని నా నమ్మకం. కానీ నా భర్త రణ్‌వీర్ మాత్రం నేను మంచి లాయర్ అయ్యేదాన్ని అని ఎప్పుడూ అంటుంటాడు" అని దీపికా సరదాగా చెప్పుకొచ్చింది.
ఈ ఇంటర్వ్యూలో దీపికా కళ్లలో మెరుపు, ముఖంలోని ఆనందం చూసి.. "అమ్మగా తను చాలా సంతోషంగా కనిపిస్తోంది, మోస్ట్ బ్యూటిఫుల్ మమ్" అంటూ అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
దువా పదుకొణె సింగ్: ప్రార్థనల ఫలితం
కూతురికి 'దువా' అని పేరు పెట్టడం వెనుక ఉన్న అర్థాన్ని గతంలోనే ఈ దంపతులు వివరించారు. "మా ప్రార్థనలకు దేవుడు ఇచ్చిన సమాధానం ఈ చిన్నారి. అందుకే దువా (అంటే ప్రార్థన) అని పేరు పెట్టాం" అని రణ్‌వీర్, దీపికా తెలిపారు. ఇటీవల దువా మొదటి పుట్టినరోజు సందర్భంగా షేర్ చేసిన ఫోటోలు ఇంటర్నెట్‌లో సెన్సేషన్ సృష్టించిన సంగతి తెలిసిందే.
సినిమా కబుర్లు: షారుఖ్ ఖాన్‌తో 'కింగ్'
తల్లిగా విరామం తీసుకున్న దీపికా పదుకొణె మళ్లీ వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. షారుక్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘కింగ్’ (King) చిత్రంతో ఆమె కమ్‌బ్యాక్ ఇవ్వనుంది.
సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ డ్రామాలో సుహానా ఖాన్, అభిషేక్ బచ్చన్ వంటి తారలు కూడా నటిస్తున్నారు. ఈ భారీ చిత్రం కింగ్ డిసెంబర్ 24, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


