తమ్ముడి కోసం అల్లు అర్జున్ గ్రాండ్ పార్టీ.. రామ్ చరణ్ స్పెషల్ అట్రాక్షన్.. అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ పార్టీ ఫొటోలు

తమ్ముడు అల్లు శిరీష్ పెళ్లికి ముందు అల్లు అర్జున్ ఓ గ్రాండ్ ప్రీవెడ్డింగ్ పార్టీ ఇచ్చాడు. దీనికి రామ్ చరణ్, ఉపాసన రావడంతో ఈ ఫొటో ఇప్పుడు వైరల్ అవుతోంది. మార్చి 6న అల్లు శిరీష్, నయనికా పెళ్లి చేసుకోనున్న విషయం తెలిసిందే.

Published on: Feb 21, 2026, 09:53:30 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మెగా-అల్లు కుటుంబాల్లో పెళ్లి సందడి మొదలైంది. అల్లు శిరీష్-నయనికా రెడ్డి వివాహ వేడుకల్లో భాగంగా అల్లు అర్జున్ ఏర్పాటు చేసిన ప్రీ-వెడ్డింగ్ పార్టీకి మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు హాజరయ్యారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫోటోలు చూసి అభిమానులు తెగ మురిసిపోతున్నారు.

తమ్ముడి కోసం అల్లు అర్జున్ గ్రాండ్ పార్టీ.. రామ్ చరణ్ స్పెషల్ అట్రాక్షన్.. అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ పార్టీ ఫొటోలు
తమ్ముడి కోసం అల్లు అర్జున్ గ్రాండ్ పార్టీ.. రామ్ చరణ్ స్పెషల్ అట్రాక్షన్.. అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ పార్టీ ఫొటోలు

మెగా, అల్లు ఫ్యామిలీస్ ఆల్ ఇన్ బ్లాక్

మెగా, అల్లు కుటుంబాల్లో పెళ్లి బాజాలు మోగుతున్నాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోదరుడు, టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ త్వరలోనే ఒక ఇంటివాడు కాబోతున్నాడు. మార్చి 6వ తేదీన నయనికా రెడ్డితో అతని పెళ్లి ఘనంగా జరగనుంది. ఈ క్రమంలోనే అల్లు కుటుంబంలో వేడుకలు అప్పుడే అంబరాన్నంటాయి.

కొద్దిరోజుల కిందట దుబాయ్‌లో నిర్వహించిన ‘యాట్ పార్టీ’ ఫోటోలు ఇంటర్నెట్‌ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా హైదరాబాద్‌లో అల్లు కుటుంబం ఒక ప్రైవేట్ ప్రీ-వెడ్డింగ్ పార్టీని నిర్వహించింది. ఈ వేడుకకు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరైనప్పటికీ, ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది మాత్రం మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్.

తన సతీమణి ఉపాసన కామినేని కొణిదెలతో కలిసి చరణ్ ఈ వేడుకకు వచ్చాడు. కాబోయే జంట శిరీష్ - నయనికలతో కలిసి అల్లు అర్జున్ - స్నేహారెడ్డి, రామ్ చరణ్ - ఉపాసన దిగిన గ్రూప్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అందరూ బ్లాక్ డ్రెస్సుల్లోనే ఫొటోలకు పోజులివ్వడం విశేషం.

టాలీవుడ్‌కు చెందిన ఇద్దరు బిగ్గెస్ట్ స్టార్స్ ఇలా ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో అటు మెగా అభిమానులు, ఇటు అల్లు అభిమానులు పండగ చేసుకుంటున్నారు. వారి మధ్య ఉన్న సాన్నిహిత్యం, అనుబంధం చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

అల్లు అర్జున్, రామ్ చరణ్ కెరీర్ ఇలా..

అల్లు అర్జున్ తన చివరి మూవీ పుష్ప 2తో సంచలన విజయం అందుకున్నాడు. ఇక ఇప్పుడు అల్లు అర్జున్.. అట్లీ దర్శకత్వంలో ఒక భారీ సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నాడు.

ఇటు రామ్ చరణ్ మాత్రం గేమ్ ఛేంజర్ తో ఓ డిజార్టర్ మూటగట్టుకున్నాడు. ప్రస్తుతం అతడు ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ‘పెద్ది’ అనే స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ మధ్యే అతనికి కవల పిల్లలు జన్మించిన విషయం తెలిసిందే. గ్రాండ్ గా బారసాల కార్యక్రమం కూడా నిర్వహించాడు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More