మామయ్య చిరంజీవికి తొలి శుభలేఖ ఇచ్చిన అల్లు శిరీష్.. ఫొటో వైరల్.. చేతికి కట్టుతో మెగాస్టార్.. ఫ్యాన్స్ లో ఆందోళన
అల్లు వారి ఇంట పెళ్లి సందడి జోరందుకుంది. అల్లు శిరీష్ వివాహానికి టైమ్ దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో తమ మేనత్త, మామ అయిన సురేఖ-చిరంజీవికి అల్లు శిరీష్ తొలి శుభలేఖ ఇచ్చాడు. అయితే ఈ ఫొటోలో చిరంజీవి చేతికి కట్టు ఉండటం ఫ్యాన్స్ కు ఆందోళన కలిగిస్తోంది.
అల్లు వారి ఇంట త్వరలోనే పెళ్లి బాజా మోగబోతుంది. అల్లు అరవింద్ చిన్న కొడుకు అల్లు శిరీష్ వివాహం త్వరలోనే జరగబోతోంది. ఈ నేపథ్యంలో పెళ్లి కార్యక్రమాలు ఊపందుకున్నాయి. శుభలేఖలతో పెళ్లికి ఆహ్వానం పలుకుతున్నారు. సంప్రదాయం ప్రకారం ముందుగా చిరంజీవి కుటుంబానికి వెడ్డింగ్ కార్డు ఇచ్చారు.

అల్లు శిరీష్ శుభలేఖ
అల్లు అర్జున్ తమ్ముడైన అల్లు శిరీష్ పెళ్లికి ముందు కార్యక్రమాలు సందడిగా కొనసాగుతున్నాయి. రీసెంట్ గా పసుపు దంచుడు కార్యక్రమం నిర్వహించారు. ఇప్పుడు శుభలేఖలు పంచుతున్నారు. తెలుగు సంప్రదాయం ప్రకారం మొదటి శుభలేఖ మేనత్తకు ఇవ్వాలి. ఈ నేపథ్యంలోనే సురేఖ-చిరంజీవి దంపతులకు అల్లు అరవింద్ దంపతులు, అల్లు శిరీష్ కలిసి వెడ్డింగ్ కార్డు ఇచ్చారు. ఈ ఫొటోను అల్లు శిరీష్ తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో పోస్టు చేశాడు.
తెలుగు సంప్రదాయం ప్రకారం
‘‘తెలుగు సంప్రదాయం ప్రకారం తొలి శుభలేఖ మా మామయ్య చిరంజీవి, అత్త సురేఖకు ఇచ్చాం’’ అనే క్యాప్షన్ తో అల్లు శిరీష్ ఫొటో పోస్టు చేశాడు. తన ప్రేయసి నయనికను అల్లు శిరీష్ పెళ్లి చేసుకోబోతున్నాడు. వీళ్ల వెడ్డింగ్ మార్చి 6, 2026న జరగబోతుంది. అదే తేదీ అల్లు అర్జున్-స్నేహారెడ్డి పెళ్లి రోజు కూడా కావడం విశేషం.
చిరంజీవి చేతికి కట్టు
అల్లు అరవింద్ దంపతులు, అల్లు శిరీష్ కలిసి చిరంజీవి దంపతులకు శుభలేఖ, పట్టు వస్త్రాలు అందించారు. అయితే ఈ ఫొటోలో చిరంజీవి ఎడమ చేతికి కట్టుతో కనిపించాడు. దీంతో మెగాస్టార్ కు ఏమైందోనని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. అయితే రీసెంట్ గా మెగాస్టార్ చేతికి సర్జరీ అయిందని తెలిసింది. అందుకే ఆయన కట్టుతో కనిపించారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
బ్లాక్ బస్టర్
మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ గా మన శంకర వరప్రసాద్ గారు మూవీ బ్లాక్ బస్టర్ హిట్ తో ఫుల్ జోష్ లో ఉన్నారు. సంక్రాంతి 2026కు రిలీజైన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. అంతేకాకుండా ఇటీవల రామ్ చరణ్-ఉపాసన దంపతులకు ట్విన్స్ జన్మించారు. దీంతో మెగాస్టార్ ఆనందం రెట్టింపైంది.
ఇలా వరుసగా సంతోషంలో మునిగి తేలుతున్న చిరంజీవి చేతికి గాయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు చిరు అప్ కమింగ్ మూవీ విశ్వంభర రిలీజ్ కు రెడీ అవుతుంది. 2026 సమ్మర్ లో ఈ సినిమాను రిలీజ్ చేసే అవకాశముంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


