గ్రాండ్‌గా అల్లు శిరీష్, నయనిక ప్రీ వెడ్డింగ్ పార్టీ- రూ.లక్షా 39 వేల ఖరీదైన షర్ట్ వేసుకున్న అల్లు అర్జున్- వీడియో వైరల్
అల్లు వారింటా త్వరలోనే పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. అల్లు అరవింద్ కొడుకు అల్లు శిరీష్ వెడ్డింగ్ మార్చిలో జరుగుతుంది. ఈ నేపథ్యంలో శిరీష్, తనకు కాబోయే భార్య నయనిక కలిసి దుబాయ్ లో ప్రీ వెడ్డింగ్ పార్టీని గ్రాండ్ గా చేసుకున్నారు. ఈ పార్టీ కోసం అల్లు అర్జున్ రూ.లక్షా 39 వేల ఖరీదైన షర్ట్ వేసుకున్నాడు.
ప్రముఖ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ చిన్న కుమారుడు, హీరో అల్లు శిరీష్ త్వరలోనే ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. తన ప్రేయసి నయనికను ఈ ఏడాది మార్చిలో వివాహమాడనున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా దుబాయ్ లో తమ ప్రీ వెడ్డింగ్ పార్టీని శిరీష్, నయనిక గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ పార్టీ కోసం అల్లు శిరీష్ అన్న, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వేసుకున్న షర్ట్ రేటు వైరల్ గా మారింది.

అల్లు శిరీష్ పార్టీ
అల్లు శిరీష్, నయనిక మార్చిలో జరిగే తమ వివాహంతో ఒక్కటి కానున్నారు. ఈ పెళ్లి కంటే ముందు దుబాయ్‌లో ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కోసం ప్రీ వెడ్డింగ్ పార్టీని ఘనంగా నిర్వహిస్తున్నారు. అల్లు అర్జున్, అతని భార్య స్నేహారెడ్డితో సహా ఫ్యామిలీ అంతా కాబోయే దంపతులతో కలిసి సంబరాలు జరుపుకుంటున్న ఫొటోలు, వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి.
షాంపైన్ ఓపెన్
శిరీష్, నయనిక తో పాటు అందరూ బోటులో ఉన్న వీడియో ఆన్ లైన్ లో తెగ చక్కర్లు కొడుతోంది. శిరీష్ షాంపైన్ బాటిల్ తెరిచి స్ప్రే చేస్తున్నప్పుడు అతిథులంతా చప్పట్లు కొట్టారు. అల్లు అర్జున్ పక్కనే నిలబడి నవ్వుతూ కనిపించాడు. శిరీష్, నయనిక ఆ షాంపైన్ ను షేర్ చేసుకున్నారు.
అల్లు అర్జున్ షర్ట్
అల్లు శిరీష్, నయనిక ప్రీ వెడ్డింగ్ పార్టీ కోసం వెళ్లిన అల్లు అర్జున్ వేసుకున్న షర్ట్ రేటు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. జే1 బీచ్ లో తీసిన ఓ వీడియోలో అల్లు అర్జున్, స్నేహారెడ్డి జంటగా కనిపించారు. స్నేహారెడ్డి వైట్ కలర్ డ్రెస్ వేసుకుంది. అల్లు అర్జున్ ఏమో వెర్సాస్ ప్రింటెడ్ సిల్క్ ట్విల్ షర్ట్ ధరించాడు. ఆ బ్రాండ్ వెబ్ సైట్ ప్రకారం ఈ షర్ట్ రేటు రూ.1,39,600 కావడం విశేషం.
అల్లు శిరీష్, నయనిక పెళ్లి
తన తాత, దిగ్గజ నటుడు అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా నయనికను పెళ్లి చేసుకోబోతున్నట్లు అక్టోబర్ 1, 2025న అల్లు శిరీష్ ప్రకటించాడు. శిరీష్, నయనిక ఎంగేజ్మెంట్ అక్టోబర్ 31, 2025న జరిగింది. హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా జరిగిన ఈ వేడుకలో ఈ జంట ఉంగరాలు మార్చుకుంది.
అల్లు శిరీష్, నయనిక పెళ్లి మార్చి 6, 2026న జరగనుంది. అల్లు అర్జున్, స్నేహారెడ్డి మ్యారేజీ డే కూడా ఇదే కావడం విశేషం. రీసెంట్ గా ట్రెండింగ్ లో ఉన్న ఓ రీల్ ద్వారా తమ పెళ్లి జరిగే రోజును అల్లు శిరీష్ ప్రకటించాడు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


