ఆమె నా ఫ్రెండ్ కాదు.. తన బయోపిక్ చేసిన హీరోయిన్ ఇన్‌స్టాలో తనను ఫాలో కాకపోవడంపై సైనా నెహ్వాల్ కామెంట్స్ వైరల్
ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ బయోపిక్‌లో నటి పరిణీతి చోప్రా నటించినప్పటికీ, ఆమె సైనాను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవ్వడం లేదనే విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. దీనిపై సైనా నెహ్వాల్ తాజాగా స్పందిస్తూ.. తమ మధ్య స్నేహం లేదని, వారి బంధం కేవలం వృత్తిపరమైనదేనని స్పష్టం చేసింది.
బ్యాడ్మింటన్‌లో ఒలింపిక్స్ లో తొలి మెడల్ అందించి భారతీయులంతా గర్వపడేలా చేసిన ప్లేయర్ సైనా నెహ్వాల్. ఆమె ఈ మధ్యే ఆటకు గుడ్ బై చెప్పింది. అయితే ఐదేళ్ల కిందటే సైనా బయోపిక్ తెరకెక్కిన విషయం తెలిసిందే. అందులో లీడ్ రోల్లో నటించిన పరిణీతి చోప్రా తనను ఇన్‌స్టాగ్రామ్ లో ఎందుకు ఫాలో కావడం లేదో తాజాగా సైనా వివరించింది.

అసలు గమనించలేదు..
2021లో వచ్చిన ‘సైనా’ బయోపిక్ సినిమాలో సైనా నెహ్వాల్ పాత్రలో పరిణీతి చోప్రా మెప్పించింది. అయితే సైనా నెహ్వాల్ ఇన్‌స్టాగ్రామ్‌లో పరిణీతిని ఫాలో అవుతున్నప్పటికీ.. పరిణీతి మాత్రం సైనాను తిరిగి ఫాలో అవ్వడం లేదని నెటిజన్లు గుర్తించారు. నిజానికి సైనా కూడా పరిణీతిని ఫాలో కావడం లేదు. దీనిపై ఒక యూట్యూబ్ ఛానెల్‌తో మాట్లాడుతూ సైనా స్పందించింది.
ఈ విషయంపై సైనా మాట్లాడుతూ.. "నిజానికి నేను ఈ విషయాన్ని ఎప్పుడూ గమనించలేదు. నా ట్రైనింగ్, టోర్నమెంట్లు, ఈవెంట్లతో బిజీగా ఉండటం వల్ల దీనిపై దృష్టి పెట్టలేదు. మా మధ్య జరిగిన సంభాషణలు కూడా కేవలం సినిమాకు సంబంధించినవే తప్ప, మేం స్నేహితులుగా మారేలా ఏమీ జరగలేదు" అని చెప్పింది.
కేవలం పని కోసమే కలిసేవాళ్లం..
"నేను నా జీవిత విశేషాలు చెప్పడానికి ఒక ప్రొఫెషనల్‌గా ఆమెను కలిసేదాన్ని. అంతేకానీ మేం ఎప్పుడూ కలిసి లంచ్ లేదా డిన్నర్లకు వెళ్లలేదు. రెండు, మూడు వారాలకు ఒకసారి డైరెక్టర్‌తో కలిసి ఒకటి రెండు గంటలు మాత్రమే కలిసేవాళ్ళం. ఆ సమయంలో నా ప్రయాణం గురించి ఆమెకు వివరించేదాన్ని. స్నేహితులుగా మారేంత సమయం మేం గడపలేదు. మా బంధం కేవలం ఆ సినిమా పని వరకే పరిమితం. అందుకే ఫాలో అవ్వడం లేదా అన్‌ఫాలో చేయడం అనే విషయాల గురించి నేను పెద్దగా పట్టించుకోలేదు" అని సైనా వివరించింది.
ఈరోజు వరకూ చూస్తే ఇటు సైనా గానీ, అటు పరిణీతి గానీ ఒకరినొకరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవ్వడం లేదు. ‘సైనా’ మూవీ 2021లో విడుదలైంది. పరిణీతి నటనకు ప్రశంసలు దక్కాయి. ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


