అల్లు అర్జున్ తగ్గేదేలే-బ్లాక్ బస్టర్ లైనప్ ప్లాన్ చేసిన ఐకాన్ స్టార్-వరుసగా నాలుగు క్రేజీ సినిమాలు- ఈ డైరెక్టర్లతోనే!

పుష్ప సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్న అల్లు అర్జున్ తన ఫ్యూచర్ సినిమాలకు అదిరే ప్లాన్ వేశాడు. బ్లాక్ బస్టర్ లైనప్ ను సెట్ చేశాడు ఐకాన్ స్టార్. వరుసగా నాలుగు సినిమాలకు స్టార్ డైరెక్టర్లతో పనిచేయబోతున్నాడు. 

Published on: Jan 25, 2026, 21:46:13 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

పుష్ప సినిమాలో వచ్చిన స్టార్ డమ్ ను కొనసాగించే ప్లాన్ లో ఉన్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. పుష్ప 2 మూవీతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ దక్కించుకున్న ఈ హీరో.. ఇప్పుడు రాబోయే సినిమాల విషయంలోనూ ఎంతో ప్లాన్ గా సాగిపోతున్నాడు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్లను లైన్ లో పెట్టాడు అల్లు అర్జున్. వరుసగా నాలుగు సినిమాలను టాప్ డైరెక్టర్లతో చేస్తున్నాడు.

అల్లు అర్జున్ (x/alluarjun)
అల్లు అర్జున్ (x/alluarjun)

అల్లు అర్జున్ సినిమాలు

పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ మరో సినిమా థియేటర్లలో రిలీజ్ కాలేదు. ఇప్పుడు తమిళ టాప్ డైరెక్టర్లలో ఒకరైన అట్లీతో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ చేస్తున్నాడు అల్లు అర్జున్. ఇదో సూపర్ హీరో సినిమా అనే టాక్ ఉంది. ఈ మూవీకి ఏఏ22 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతోంది. ఇందులో దీపికా పదుకొణే హీరోయిన్. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. త్వరలోనే రిలీజ్ డేట్ పై ఓ క్లారిటీ రానుంది.

లోకేష్ కనగరాజ్

అట్లీతో సినిమా తర్వాత అల్లు అర్జుణ్ మరో తమిళ టాప్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తో సినిమా చేయబోతున్నాడు. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇటీవల వచ్చింది. రీసెంట్ గా అనౌన్స్ మెంట్ వీడియోలో అడవిలో జంతువులు పరుగెత్తడం, గుర్రంపై హీరో క్యారెక్టర్ తో ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. లోకేష్ కనగరాజ్ చివరగా రజినీకాంత్ తో కూలీ మూవీ చేశాడు. అల్లు అర్జున్-లోకేష్ కాంబినేషన్లో ఏఏ23 తెరకెక్కనుంది.

పుష్ప 3

పుష్ప సినిమాలతో అల్లు అర్జున్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. అతని స్థాయి ఎక్కడికో వెళ్లిపోయింది. ఇందుకు పుష్ప సినిమాల డైరెక్టర్ సుకుమార్ ప్రధాన కారణం. అందుకే సుకుమార్ కు ఎప్పటికీ రుణపడి ఉంటానని అల్లు అర్జున్ చెబుతూనే ఉంటాడు. అలాగే పుష్ప 3 కూడా ఉందని సుకుమార్ గతంలో పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ తో సుకుమార్ పుష్ప 3 తీయడం ఖాయం. ఇది లోకేష్ కనగరాజ్ సినిమా తర్వాత సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ఇది ఏఏ24గా రెడీ కానుంది.

సందీప్ రెడ్డి వంగా

ఇక అల్లు అర్జున్ తన రాబోయే సినిమాల్లో ఒకదాన్ని సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో చేయబోతున్నాడు. ప్రొడ్యూసర్ భూషణ్ కుమార్ (టీ సిరీస్) దీనిపై క్లారిటీ ఇచ్చేశాడు. ఇది అల్లు అర్జున్ కెరీర్ లో 25వ సినిమా కానుంది. ప్రతిష్ఠాత్మకంగా దీన్ని తెరకెక్కించనున్నారు. మరి ఈ ఏఏ25లో అల్లు అర్జున్ ను సందీప్ ఎలా చూపిస్తాడోనన్న ఉత్కంఠ ఇప్పటి నుంచే మొదలైంది. మొత్తానికి అల్లు అర్జున్ తన ఫ్యూచర్ ప్లాన్స్ పక్కాగా సెట్ చేసుకున్నాడనే టాక్ వినిపిస్తోంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More