వాళ్ల అంచనాల కోసం కథలు రాయను.. కూలీపై చాలా విమర్శలు వచ్చాయి.. సరిదిద్దుకుంటాను.. రజనీకాంత్ కోసమే చూశారు: లోకేష్ కనగరాజ్
కూలీ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ మొత్తానికి తన సినిమాపై వచ్చిన విమర్శలపై స్పందించాడు. వాటిని తన తర్వాతి సినిమాకు సరిదిద్దుకుంటానని అన్నాడు. అయితే అభిమానుల భారీ అంచనాల కోసం తాను కథలు రాయనని స్పష్టం చేశాడు.
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన 'కూలీ' (Coolie) ఆగస్టు 14న విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకుంది. కథలో దమ్ము లేదని, రైటింగ్ వీక్‌గా ఉందని విమర్శలు వచ్చినా.. బాక్సాఫీస్ వద్ద మాత్రం ఈ సినిమా రూ. 500 కోట్లు కొల్లగొట్టింది. తాజాగా దీనిపై స్పందించిన లోకేష్.. విమర్శలను స్వీకరిస్తున్నానని, రజనీకాంత్ వల్లే సినిమా ఆడిందని నిజాయితీగా ఒప్పుకున్నాడు.

వెయ్యికిపైగా విమర్శలు వచ్చాయి
భారీ అంచనాల మధ్య విడుదలైన 'కూలీ' సినిమాపై వచ్చిన నెగటివ్ రివ్యూలపై దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఎట్టకేలకు మౌనం వీడాడు. శుక్రవారం (డిసెంబర్ 26) సాయంత్రం అతడు మీడియాతో మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
సినిమా స్క్రిప్ట్ గురించి వచ్చిన కామెంట్స్ పై లోకేష్ స్పందిస్తూ.. "'కూలీ' సినిమాపై వేలల్లో విమర్శలు వచ్చాయి. అవన్నీ గమనించాను. నా తర్వాతి సినిమాలో ఆ తప్పులు జరగకుండా చూసుకుంటా, సరిదిద్దుకుంటా. ఇన్ని విమర్శలు వచ్చినా జనాలు థియేటర్లకు వెళ్ళింది కేవలం రజనీకాంత్ సార్ కోసమే. ప్రొడ్యూసర్ ఈ సినిమా రూ. 500 కోట్లు కలెక్ట్ చేసిందని నాతో చెప్పారు. ఆదరించిన అందరికీ థాంక్స్," అని లోకేష్ చెప్పాడు.
వాళ్ల కోసం కథలు రాయను
అంతకుముందు కోయంబత్తూరులో జరిగిన ఒక ఈవెంట్‌లో కూడా లోకేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. "జనాల భారీ అంచనాలను దృష్టిలో పెట్టుకుని నేను కథలు రాయలేను. నేను రాసింది జనాలకు నచ్చితే సంతోషం.. నచ్చకపోతే మళ్ళీ ప్రయత్నిస్తా అంతే" అని క్లారిటీ ఇచ్చాడు.
'కూలీ' సినిమా విశేషాలు
హృతిక్ రోషన్, ఎన్టీఆర్ నటించిన 'వార్ 2' సినిమాతో పోటీపడి రిలీజ్ అయినప్పటికీ.. 'కూలీ' తన సత్తా చాటింది. ఈ సినిమాలో రజనీకాంత్, నాగార్జున, ఆమిర్ ఖాన్, శృతి హాసన్, సత్యరాజ్, ఉపేంద్ర, సౌబిన్ సాహిర్ లాంటి వాళ్లు నటించారు.
ఈ కూలీ మూవీ దేవా (రజనీకాంత్) అనే మాజీ కూలీ యూనియన్ లీడర్.. తన స్నేహితుడు రాజశేఖర్ (సత్యరాజ్) అనుమానాస్పద మృతి వెనుక ఉన్న మిస్టరీని ఛేదించే కథ చుట్టూ తిరుగుతుంది. ఇందులో సైమన్ అనే గ్యాంగ్‌స్టర్‌గా నాగార్జున, అతని రైట్ హ్యాండ్‌గా సౌబిన్ సాహిర్ నటించారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


