డైరెక్టర్లకు అతడో అవతార్.. మేమంతా కేవలం మనషులం.. కళ్లలో నీళ్లు తిరిగాయి: అవతార్ 3పై సుకుమార్ రివ్యూ వైరల్
జేమ్స్ కామెరాన్ అవతార్: ఫైర్ అండ్ యాష్ సినిమాకు రివ్యూ ఇచ్చాడు ప్రముఖ డైరెక్టర్ సుకుమార్. ఈ సందర్భంగా కామెరాన్ ను ఆకాశానికెత్తడంతోపాటు అవతార్ 3 ఓ అద్భుతమైన సినిమా అని కొనియాడాడు.
జేమ్స్ కామెరాన్ అద్భుత సృష్టి 'అవతార్: ఫైర్ అండ్ యాష్' (Avatar: Fire and Ash) శుక్రవారం (డిసెంబర్ 19) విడుదల కానుంది. ఈ సందర్భంగా స్పెషల్ ప్రీమియర్ చూసిన స్టార్ డైరెక్టర్ సుకుమార్.. సినిమాపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ సినిమా చూస్తున్నంతసేపు తెలుగు సినిమాల్లో ఉండే బలమైన ఎమోషన్స్ కనిపించాయని, కొన్ని సీన్లు చూసి తన కళ్లలో నీళ్లు తిరిగాయని సుకుమార్ రివ్యూ ఇవ్వడం విశేషం.

అవతార్ 3పై సుకుమార్ రివ్యూ
ప్రపంచం మొత్తం ఎదురుచూస్తున్న విజువల్ వండర్ 'అవతార్ 3' విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే రాజమౌళి ఈ సినిమాను చూసి మెచ్చుకోగా.. తాజాగా 'పుష్ప' డైరెక్టర్ సుకుమార్ కూడా తన రివ్యూను పంచుకున్నాడు. జేమ్స్ కామెరాన్ పనితనాన్ని చూసి తాను ఆశ్చర్యపోయానని చెప్పాడు.
కామెరాన్ గురించి సుకుమార్ మాట్లాడుతూ.. "జేమ్స్ కామెరాన్.. ఆయన ఈ లోకంలో మనిషి కాదు.. పండోరా (Pandora) నుంచి వచ్చారు. డైరెక్టర్లకు ఆయనే ఒక 'అవతార్'. ఆయన ముందు మనమంతా సామాన్య మనుషులం" అని ఆకాశానికెత్తేశాడు.
తెలుగు సినిమాల్లో ఉండే ఎమోషన్..
హాలీవుడ్ సినిమా అయినప్పటికీ, ఇందులో మన నేటివిటీకి దగ్గరగా ఉండే ఎమోషన్స్ ఉన్నాయని సుకుమార్ అభిప్రాయపడ్డాడు. "మన తెలుగు సినిమాల్లో ఎంత ఎమోషన్ ఉంటుందో.. ఈ సినిమాలోనూ అంతే ఉంది. ప్రతి ఫ్రేమ్ గుండెకు హత్తుకుంటుంది. జేక్, నేతిరి, వరాంగ్, స్పైడర్ పాత్రల్లో లీనమైపోయాను. కొన్ని సన్నివేశాలు చూస్తున్నప్పుడు నా కళ్లలో నీళ్లు తిరిగాయి. ఫ్యామిలీ మొత్తం కలిసి చూడాల్సిన సినిమా ఇది" అని సుకుమార్ ఎమోషనల్ అయ్యాడు.
3 గంటలు తెలియలేదు..
అవతార్ 3 సినిమా నిడివి 3 గంటల 17 నిమిషాలు ఉన్నప్పటికీ.. సమయం అస్సలు తెలియలేదని సుకుమార్ అన్నాడు. "నేను థియేటర్లో ఒంటరిగా సినిమా చూసినా.. లోన్లీగా అనిపించలేదు. నేరుగా పండోరా లోకంలోకి వెళ్ళిపోయినట్లు అనిపించింది. నా పక్కన ఎవరున్నారో కూడా గమనించలేదు" అని తన అనుభవాన్ని వివరించాడు.
జేమ్స్ కామెరాన్ సినిమాలు టీవీల్లో చూసేవి కాదని, ఆ విజువల్స్ ఇచ్చే అనుభవం థియేటర్లోనే దొరుకుతుందని సుకుమార్ ప్రేక్షకులకు సూచించాడు. ఇలాంటి అనుభవం ఇచ్చినందుకు కామెరాన్ కు అతడు థ్యాంక్స్ చెప్పాడు.
అటు దర్శక ధీరుడు రాజమౌళి కూడా అవతార్ 3 మూవీపై తన రివ్యూ ఇచ్చిన విషయం తెలిసిందే. జేమ్స్ కామెరాన్ తో నేరుగా వీడియో కాల్ లో మాట్లాడుతూ.. సినిమా ఓ అద్భుతమని కొనియాడాడు. అవతార్ ఫ్రాంఛైజీ నుంచి వస్తున్న మూడో మూవీ అయిన అవతార్: ఫైర్ అండ్ యాష్ శుక్రవారం (డిసెంబర్ 19) ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


