నేను తొలిసారి కెమెరా ముందుకు వచ్చిన రోజు ఇది: చిరంజీవి ఎమోషనల్ పోస్ట్ వైరల్.. పునాదిరాళ్లు మూవీ సెట్స్ ఫొటోలు చూశారా?

మెగాస్టార్ చిరంజీవి చేసిన ఓ ఎమోషనల్ పోస్ట్ వైరల్ అవుతోంది. పునాదిరాళ్లు మూవీ కోసం తాను తొలిసారి కెమెరా ముందుకు వచ్చిన రోజు ఇదే అంటూ ఆనాటి ఫొటోలను చిరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

Published on: Feb 11, 2026, 21:11:05 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మెగాస్టార్ చిరంజీవి తన సినీ ప్రస్థానాన్ని గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. 47 ఏళ్ల కిందట సరిగ్గా ఇదే రోజున (ఫిబ్రవరి 11) తాను మొదటిసారిగా 'పునాదిరాళ్లు' సినిమా కోసం కెమెరా ముందుకు వచ్చానని చెబుతూ, నాటి బ్లాక్ అండ్ వైట్ ఫోటోలను పంచుకున్నాడు. ఈ ఫొటోలు అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాయి.

నేను తొలిసారి కెమెరా ముందుకు వచ్చిన రోజు ఇది: చిరంజీవి ఎమోషనల్ పోస్ట్ వైరల్.. పునాదిరాళ్లు మూవీ సెట్స్ ఫొటోలు చూశారా?
నేను తొలిసారి కెమెరా ముందుకు వచ్చిన రోజు ఇది: చిరంజీవి ఎమోషనల్ పోస్ట్ వైరల్.. పునాదిరాళ్లు మూవీ సెట్స్ ఫొటోలు చూశారా?

"ఆ అనుభూతి వర్ణనాతీతం.."

టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి బుధవారం (ఫిబ్రవరి 11) నోస్టాల్జియాలో మునిగిపోయాడు. తన సినీ కెరీర్ ఆరంభ రోజులను గుర్తుచేసుకుంటూ 'ఎక్స్' వేదికగా కొన్ని ఆసక్తికరమైన ఫోటోలను షేర్ చేశాడు. 47 ఏళ్ల కిందట సరిగ్గా ఈరోజే తాను తొలిసారిగా ముఖానికి రంగేసుకుని కెమెరాను ఫేస్ చేశానని అతడు తెలిపాడు.

తన మొదటి సినిమా 'పునాదిరాళ్లు' (Punadhirallu) షూటింగ్ స్పాట్ ఫోటోలను షేర్ చేస్తూ చిరంజీవి ఇలా రాసుకొచ్చాడు. "ఈ రోజు నా జీవితంలో తొలిసారిగా 'పునాదిరాళ్లు' సినిమా కోసం కెమెరా ముందు నిలబడ్డాను. ఆ రోజు నాలో కలిగిన ఉత్సాహం, ఆనందం, బాధ్యత, భావోద్వేగాలు మాటల్లో చెప్పలేనివి. ఆ క్షణం నిన్ననో, మొన్ననో జరిగినట్లు అనిపిస్తోంది. ఇదొక అందమైన పౌర్ణమి కథలాంటి అనుభవం" అని చిరు అన్నాడు.

తనకు తొలి అవకాశం ఇచ్చిన దర్శకుడికి, నిర్మాతకు చిరంజీవి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపాడు. వారి నమ్మకం, ప్రోత్సాహమే తన నట ప్రయాణానికి పునాది రాళ్లుగా నిలిచాయని అన్నాడు. ఆ రోజు నుంచి నేటి వరకు తనను ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు తెలిపాడు.

47 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం..

'పునాదిరాళ్లు'తో మొదలైన చిరంజీవి ప్రస్థానం 'ఖైదీ' (1983)తో మలుపు తిరిగింది. ఇంద్ర, ఠాగూర్, ఘరానా మొగుడు, జగదేకవీరుడు అతిలోకసుందరి వంటి ఎన్నో బ్లాక్ బస్టర్లను చిరంజీవి అందించాడు. ఇక ప్రస్తుతం చిరంజీవి అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన 'మన శంకర వర ప్రసాద్ గారు' (Mana Shankara Vara Prasad Garu) సినిమాతో మరో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.

జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ విజేతగా నిలిచింది. ఎన్‌ఎస్‌జీ (NSG) ఆఫీసర్‌గా చిరంజీవి, తన విడిపోయిన భార్య (నయనతార), కూతురును కాపాడుకునే క్రమంలో సాగే కథ ఇది. ఈ సినిమా విడుదలై 25 రోజులు పూర్తయ్యేసరికి ప్రపంచవ్యాప్తంగా రూ. 375 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. ప్రస్తుతం ఈ మూవీ జీ5 ఓటీటీలో ఏకంగా ఏడు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More