ఓటీటీలోనూ రవితేజకు చిరంజీవి దెబ్బ.. భర్త మహాశయులకు విజ్ఞప్తి స్ట్రీమింగ్ వాయిదా.. ఎప్పుడు వస్తుందంటే?

ఈ ఏడాది సంక్రాంతి బరిలో నిలిచి రవితేజకు మరో నిరాశనే మిగిల్చిన భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా ఓటీటీ రిలీజ్ కూడా వాయిదా పడినట్లు వార్తలు వస్తున్నాయి. చిరంజీవి కోసం జీ5 ఓటీటీ ఈ మూవీ స్ట్రీమింగ్ ను వాయిదా వేసినట్లు సమాచారం.

Published on: Feb 10, 2026, 18:13:50 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మాస్ మహారాజా రవితేజ నటించిన సంక్రాంతి మూవీ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' ఓటీటీ రిలీజ్ లో మార్పు జరిగింది. ఈ శుక్రవారం అంటే ఫిబ్రవరి 13న రావాల్సిన ఈ సినిమా.. మెగాస్టార్ చిరంజీవి సినిమా కారణంగా వాయిదా పడినట్లు తెలుస్తోంది. జీ5 (ZEE5)లో ఈ సినిమా ఎప్పుడు రానుందో పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

ఓటీటీలోనూ రవితేజకు చిరంజీవి దెబ్బ.. భర్త మహాశయులకు విజ్ఞప్తి స్ట్రీమింగ్ వాయిదా.. ఎప్పుడు వస్తుందంటే?
ఓటీటీలోనూ రవితేజకు చిరంజీవి దెబ్బ.. భర్త మహాశయులకు విజ్ఞప్తి స్ట్రీమింగ్ వాయిదా.. ఎప్పుడు వస్తుందంటే?

డిజిటల్ ప్రీమియర్ వాయిదా

సంక్రాంతి 2026 కానుకగా జనవరి 13న విడుదలైన రవితేజ మూవీ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' (Bhartha Mahasayulaku Wignyapthi). కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ కామెడీ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించుకుంది. రవితేజ తన మాస్ ఇమేజ్ పక్కనపెట్టి చేసిన ఈ సినిమా ఓ రకంగా అతని డిజాస్టర్లకు బ్రేక్ వేసింది. కానీ ఆశించిన విజయం మాత్రం ఇవ్వలేకపోయింది. ఇప్పుడీ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఒక చిన్న బ్యాడ్ న్యూస్.

ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్న జీ5 ఓటీటీ.. ఈ శుక్రవారం అంటే ఫిబ్రవరి 13 నుంచి స్ట్రీమింగ్ చేయాలని భావించింది. అయితే చివరి నిమిషంలో ఈ నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఓటీటీ రిలీజ్ వాయిదా పడింది.

చిరంజీవి సినిమా ఎఫెక్ట్?

ఈ వాయిదాకు ప్రధాన కారణం మెగాస్టార్ చిరంజీవి నటించిన 'మన శంకర వర ప్రసాద్ గారు' సినిమానే అని టాక్. ఈ మెగా మూవీ బుధవారమే అంటే ఫిబ్రవరి 11 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. ఒకే ప్లాట్‌ఫామ్‌పై రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు బడా స్టార్ల సినిమాలు రిలీజ్ చేస్తే వ్యూయర్‌షిప్ చీలిపోతుందనే ఉద్దేశంతో రవితేజ సినిమాను వాయిదా వేసినట్లు సమాచారం. చిరంజీవి సినిమాకు సోలో రిలీజ్ దక్కేలా చూడటమే దీని వెనుక ఉన్న వ్యూహం.

తాజా అప్డేట్ ప్రకారం.. 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' సినిమా మార్చి మొదటి వారంలో జీ5లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. దీనిపై అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.

భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా కథేంటంటే..

ఒక బిజినెస్ మ్యాన్ (రవితేజ) తన భార్య, విదేశీ పర్యటనలో పరిచయమైన మరో మహిళ మధ్య నలిగిపోయే కథ ఇది. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటించారు. థియేటర్లో మిస్ అయిన వారు ఈ సినిమా కోసం మార్చి వరకు వేచి చూడాల్సిందే.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More