అదిరిపోనున్న 2027 సంక్రాంతి.. చిరంజీవి, వెంక‌టేష్‌, నాగార్జున‌, బాల‌కృష్ణ బాక్సాఫీస్ ఫైట్.. ఫ్యాన్స్‌కు కిక్‌

టాలీవుడ్ టాప్ సీనియర్ హీరోలు, తెలుగు సినీ పరిశ్రమ పిల్లర్లుగా భావించే చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాల‌కృష్ణ బాక్సాఫీస్ ఫైట్ కు రెడీ అవుతున్నారు. ఈ నలుగురు 2027 సంక్రాంతికి తమ సినిమాలు రిలీజ్ చేయబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. 

Published on: Feb 09, 2026 5:43 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

2026 సంక్రాంతి సినిమాల సందడి ముగిసింది. ఈ సారి బాక్సాఫీస్ దగ్గర క్రేజీ ఫైట్ చూశాం. కానీ 2027 సంక్రాంతికి బాక్సాఫీస్ మోత మోగిపోనుంది. ఎందుకంటే నలుగురు టాప్ సీనియర్ హీరోలు చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాల‌కృష్ణ సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయని టాక్. 2027 సంక్రాంతికి ఈ నలుగురు హీరోలు తమ మూవీస్ రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాల‌కృష్ణ
చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాల‌కృష్ణ

నాగార్జున అఫీషియల్

2027 సంక్రాంతిపై అక్కినేని నాగార్జున కన్నేశారు. అతని సినిమా 2027 జనవరి 15న రిలీజ్ కాబోతుందని అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. వాసివాడి తస్సాదియ్యా, 2027 జనవరి 15న సంక్రాంతికి సోగ్గాళ్లు రాబోతున్నారని అన్నపూర్ణ స్టూడియోస్ సోషల్ మీడియాలో అనౌన్స్ చేసింది. ఇది సోగ్గాడే చిన్నినాయనా ఫ్రాంఛైజీలో భాగంగా తెరకెక్కే సినిమా అని, క‌ళ్యాణ్ కృష్ణ‌ డైరెక్టర్ అనే టాక్ వస్తోంది.

చిరు మళ్లీ

మన శంకర వరప్రసాద్ గారుతో 2026 సంక్రాంతికి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పుడు వచ్చే ఏడాది సంక్రాంతిపై కూడా గురి పెట్టారు. బాబీ డైరెక్షన్ లో మెగాస్టార్ చేయబోతున్న మూవీని 2027 సంక్రాంతికి రిలీజ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2026లోనే విశ్వంభరతో మరోసారి ఆడియన్స్ ను థియేటర్లలో చిరంజీవి ఎంటర్ టైన్ చేయబోతున్నారు.

బ్లాక్ బస్టర్ కాంబో

అనిల్ రావిపూడి-వెంకటేష్.. ఇది బ్లాక్ బస్టర్ కాంబినేషన్. వీళ్లిద్దరి కాంబినేషన్లో ఎఫ్2, ఎఫ్3, సంక్రాంతికి వస్తున్నాం లాంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. 2025 సంక్రాంతికి ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఇప్పుడేమో 2027 సంక్రాంతికి మరో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే అనిల్ రావిపూడి-వెంకటేష్ మూవీ అనౌన్స్ మెంట్ రావొచ్చనే టాక్ వినిపిస్తోంది. సంక్రాంతికి వస్తున్నాం మూవీకి ఇది సీక్వెల్ అనే కామెంట్లు వస్తున్నాయి.

బాలయ్య కూడా

సంక్రాంతి అంటే బాల‌కృష్ణ‌కు కూడా సెంటిమెంట్ ఉంది. ఈ పండక్కి రిలీజ్ అయిన బాలయ్య సినిమాలు హిట్లుగా నిలిచాయి. మరోసారి సంక్రాంతికి ఈ నందమూరి హీరో వచ్చేస్తున్నారని తెలుస్తోంది. గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో బాల‌కృష్ణ‌ చేస్తున్న సినిమా రిలీజ్ ను 2027 సంక్రాంతికి ప్లాన్ చేశారని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.

స్పెషల్ సంక్రాంతి

మొత్తానికి టాలీవుడ్ పిల్లర్లుగా భావించే నలుగురు సీనియర్ హీరోలు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాల‌కృష్ణ‌ ఒకేసారి బాక్సాఫీస్ వేటకు సై అంటున్నారు. దీంతో 2027 సంక్రాంతి మామూలుగా ఉండదని, తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే ఇది స్పెషల్ సంక్రాంతిగా మిగిలిపోతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.