2027 సంక్రాంతికి వచ్చేస్తున్న నాగార్జున.. రిలీజ్ డేట్ లాక్.. ఆ బ్లాక్ బస్టర్ పార్ట్ 3.. చైతన్యతో కలిసి!
టాలీవుడ్ మన్మథుడు నాగార్జున వచ్చే ఏడాది సంక్రాంతిపై గురి పెట్టాడు. 2027 సంక్రాంతికి నాగార్జున సినిమా రిలీజ్ కానుంది. ఈ మూవీ విడుదల తేదీని అన్నపూర్ణ స్టూడియోస్ ఇవాళ ప్రకటించి, బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చింది.
అక్కినేని ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. చాలా ముందుగానే అభిమానులకు అదిరిపోయే న్యూస్ ఇది. కింగ్ నాగార్జున 2027 సంక్రాంతి రేసులో నిలుస్తున్నాడు. అతని సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుందని అన్నపూర్ణ స్టూడియోస్ ఇవాళ (ఫిబ్రవరి 8) సోషల్ మీడియాలో అనౌన్స్ చేసింది.

వాసివాడి తస్సాదియ్యా
‘‘వాసివాడి తస్సాదియ్యా. వచ్చే జనవరి 15, 2027 సంక్రాంతికి సోగ్గాళ్లు వస్తే పండగ ఇంకా కలర్ ఫుల్ గా ఉంటాది కదా. డేట్ మార్క్ చేసుకోండి’’ అని ఎక్స్ లో అన్నపూర్ణ స్టూడియోస్ పోస్టు చేసింది. ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ మూవీ ఏంటీ? ఎవరు డైరెక్టర్ అనే విషయాలను మాత్రం ప్రకటించలేదు.
ఆ మూవీ పార్ట్ 3
అన్నపూర్ణ స్టూడియోస్ అనౌన్స్ మెంట్ బట్టి చూస్తే సూపర్ హిట్ మూవీ ‘సోగ్గాడే చిన్ని నాయనా’ మూవీ పార్ట్ 3 గా నాగార్జున రాబోయే మూవీ తెరకెక్కనుందనే కామెంట్లు వస్తున్నాయి. ఎందుకంటే ‘వాసివాడి తస్సాదియ్యా’ అనే పాపులర్ డైలాగ్ సోగ్గాడే చిన్నినాయనా సినిమాలోనిదే.
సంక్రాంతి హిట్
2016 సంక్రాంతికి వచ్చిన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇందులో నాగార్జున డ్యుయల్ రోల్ చేశాడు. తండ్రిగా బంగార్రాజుతో పాటు కొడుకుగా రాము పాత్రలు చేశాడు నాగార్జున. చనిపోయిన బంగార్రాజు తన కొడుకు, కోడలు విడాకులు తీసుకోకుండా ఆపడం కోసం స్వర్గం నుంచి దిగి వస్తాడు. ఆ తర్వాత అతనికి ఓ నిజం తెలుస్తుంది.
సీక్వెల్
సోగ్గాడే చిన్నినాయనా సినిమాకు సీక్వెల్ గా ‘బంగార్రాజు’ వచ్చింది. 2022 సంక్రాంతికి వచ్చిన ఈ సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది. ఇందులో నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించారు. సోగ్గాడే చిన్ని నాయనా, బంగార్రాజు సినిమాలకు కళ్యాణ్ కృష్ణ డైరెక్టర్. ఇప్పుడు అతనే ఈ సినిమాల సిరీస్ లో పార్ట్ 3 కథ రెడీ చేశాడనే టాక్ వినిపిస్తోంది.
మరోసారి కలిసి
సోగ్గాడే చిన్ని నాయనా మూవీ ఫ్రాంఛైజీలో మూడో పార్ట్ గా వచ్చే సినిమాలో తండ్రీకొడుకులు నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించే అవకాశముంది. అన్నపూర్ణ స్టూడియోస్ తన ప్రకటనలో సంక్రాంతి సోగ్గాళ్లు అని ప్రస్తావించింది. దీన్ని బట్టి చూస్తే సినిమాలో ఇద్దరు హీరోలు ఉంటారనేది ఖాయమనే కామెంట్లు వస్తున్నాయి. మరోసారి నాగార్జున, నాగ చైతన్య కలిసి నటిస్తారని అంటున్నారు.
ఒక్క పోస్టుతో అన్నపూర్ణ స్టూడియోస్ ఎన్నో ప్రశ్నలు కలిగించింది. మరి ఈ సినిమా ఏంటీ? ఇందులో ఎవరు నటిస్తున్నారు? ఎవరు డైరెక్ట్ చేయబోతున్నారు? అనే వివరాలను మూవీ టీమ్ త్వరలోనే ప్రకటిస్తుందేమో చూడాలి.

E-Paper












