నాగ చైతన్య, శోభిత తొలి పెళ్లి రోజు.. మిసెస్‌గా మారి ఏడాది అంటూ పెళ్లి వీడియో షేర్ చేసిన నటి.. చైతూ రియాక్షన్ ఇదీ
నాగ చైతన్య, శోభితా ధూళిపాళ గురువారం (డిసెంబర్ 4) తొలి పెళ్లి రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తమ పెళ్లి రోజు వీడియో షేర్ చేస్తూ.. మిసెస్‌గా మారి ఏడాది అయిందంటూ శోభిత ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.
అక్కినేని వారి ఇంటి కోడలిగా అడుగుపెట్టి నటి శోభిత ధూళిపాళ్ల ఏడాది పూర్తి చేసుకుంది. సరిగ్గా ఏడాది కిందట అంటే డిసెంబర్ 4, 2024న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో సంప్రదాయబద్ధంగా వీరి వివాహం జరిగింది. తమ మొదటి వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా శోభిత.. చైతన్యతో గడిపిన ఏడాది ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ ఒక కవితాత్మక క్యాప్షన్ తో వీడియోను అభిమానులతో పంచుకుంది.

శోభిత ఎమోషనల్ పోస్ట్
నాగ చైతన్య, శోభిత ధూళిపాళ గతేడాది డిసెంబర్ 4న పెళ్లితో ఒక్కటైన విషయం తెలుసు కదా. తొలి పెళ్లి రోజు సందర్భంగా తమ పెళ్లి వేడుకకు సంబంధించిన అందమైన వీడియోను షేర్ చేస్తూ శోభిత ఇలా రాసుకొచ్చింది. "గాలి ఎప్పుడూ ఇంటి వైపే వీస్తుంది. నా భర్తతో కలిసి సూర్యుని చుట్టూ ఒక అద్భుతమైన ప్రదక్షిణ (ఏడాది కాలం) పూర్తి చేశాను. అగ్నితో పునీతమైనట్లుగా.. ఇప్పుడు కొత్తగా అనిపిస్తోంది. మిసెస్ అక్కినేనిగా ఏడాది పూర్తయింది" అని చెప్పింది.
హల్దీ వేడుకల నుంచి చైతన్య తాళి కట్టే వరకు.. శోభిత సిగ్గుపడే సీన్లన్నీ ఆ వీడియోలో చూడొచ్చు. ఈ పోస్టుపై చైతన్య స్పందించాడు. “నీ ప్రయాణంలో భాగమైనందుకు చాలా ఆనందంగా ఉంది మై లవ్.. హ్యాపీ యానివర్సరీ” అని చైతూ కామెంట్ చేశాడు.
ఒకరి గురించి ఒకరు..
ఆ వీడియోలో శోభిత తన భర్త గురించి మాట్లాడుతూ.. "ఒక మనిషి అసంపూర్ణంగా ఉంటారని, వేరొకరు వచ్చి ఆ లోటును భర్తీ చేస్తారని నేను నమ్మను. మనం ఎవరికి వారు పరిపూర్ణులమే. కానీ.. అతను లేకపోతే మాత్రం నేను నిండుగా ఉండలేను అని అనిపిస్తుంది" అని మనసులో మాట చెప్పింది.
మరోవైపు చైతన్య కూడా నవ్వుతూ శోభితపై తన ప్రేమను వ్యక్తం చేశాడు. "నిద్ర లేచినప్పుడు, నిద్రపోయేటప్పుడు.. తన ఆలోచనే ఉంటుంది. తను నా జీవితంలో ఉందనే భావన ఎంతో ఓదార్పునిస్తుంది. తను నా పక్కన ఉంటే ఏదైనా సాధించగలను అనే ధైర్యం వస్తుంది" అని చైతన్య చెప్పుకొచ్చాడు.
వీళ్ల ప్రేమ, పెళ్లి ఇలా..
సమంతతో 2021లో విడిపోయిన ఏడాది తర్వాత శోభిత ప్రేమలో పడ్డాడు నాగ చైతన్య. రెండేళ్ల పాటు ప్రేమించుకున్న ఈ ఇద్దరూ 2024 డిసెంబర్ 4న కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత చైతన్య మాట్లాడుతూ.. శోభితకు భిన్నమైన దృక్పథం ఉందని, తను ఆర్ట్ హౌస్ సినిమాల వైపు మొగ్గు చూపుతుందని, ఆ వైవిధ్యం తనకు ఇష్టమని గతంలో తెలిపాడు.
ఇక చైతన్య మాజీ భార్య, నటి సమంత రూత్ ప్రభు.. మూడు రోజుల క్రితమే (డిసెంబర్ 1, 2025) కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్‌లో దర్శకుడు రాజ్ నిడిమోరును యోగ పద్ధతిలో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


