ఈ ఓటీటీలోకే నిన్న రిలీజైన భర్త మహాశయులకు విజ్ఞప్తి-భార్య, లవర్ మధ్యలో భర్త-రవితేజ మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే?
వరుస ఫ్లాప్ లకు బ్రేక్ వేయడానికి మాస్ మహారాజ్ రవితేజ రూట్ మార్చాడు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీతో సంక్రాంతి 2026 బరిలో దిగాడు. మరి నిన్న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ఏ ఓటీటీలోకి వస్తుందో చూసేద్దాం.
సంక్రాంతి 2026కు బాక్సాఫీస్ దగ్గర పోటీపడుతున్న తెలుగు సినిమాల్లో భర్త మహాశయులకు విజ్ఞప్తి ఒకటి. ఎలాగైనా హిట్ కొట్టాలనే లక్ష్యంతో రూట్ మార్చి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో వచ్చేశాడు మాస్ మహారాజ్. ఈ సినిమాకు మిక్స్ డ్ టాక్ వినిపిస్తోంది. జనవరి 13న రిలీజైన ఈ చిత్రం ఏ ఓటీటీలోకి వస్తుందో ఇక్కడ చూసేయండి.

భర్త మహాశయులకు విజ్ఞప్తి ఓటీటీ
రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ భర్త మహాశయులకు విజ్ఞప్తి. నిన్న (జనవరి 13) న ఈ సినిమా థియేటర్లలో రిలీజైంది. ఇందులో డింపుల్ హయాతి, ఆషికా రంగనాథ్ హీరోయిన్లు. ఈ చిత్రానికి కిశోర్ తిరుమల డైరెక్టర్. ఈ మూవీ డిజిటల్, శాటిలైట్ స్ట్రీమింగ్ రైట్స్ ను జీ నెట్ వర్క్ సొంతం చేసుకుంది. దీన్ని బట్టి చూస్తే భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ జీ5 ఓటీటీలోకి వస్తుంది.
స్ట్రీమింగ్ ఎప్పుడు?
భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ ఓటీటీలోనేమో జీ5లో, టీవీలోనే జీ తెలుగు ఛానెల్ లో స్ట్రీమింగ్ కానుంది. సాధారణంగా తెలుగు సినిమాలు థియేటర్లో రిలీజైన నాలుగు నుంచి ఆరు వారాల తర్వాత ఓటీటీలోకి వస్తున్నాయి. ఈ ప్రకారం చూసుకుంటే భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ ఫిబ్రవరి రెండో వారంలో డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చే అవకాశముంది. ఆ తర్వాత టీవీలోకి వస్తుంది.
భర్త మహాశయులకు విజ్ఞప్తి స్టోరీ
భార్య, లవర్ మధ్య నలిగే భర్తగా రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాలో నటించాడు. ఇందులో రామ్ క్యారెక్టర్ చేశాడు. రామ్ కు ఓ వైన్ కంపెనీ ఉంటుంది. అతని భార్య బాలమణి (డింపుల్ హయాతి). రామ్, బాలమణి కలిసి హ్యాపీగా ఉంటారు. అయితే ఒకసారి కంపెనీ పని కోసం స్పెయిన్ కు వెళ్తాడు రామ్.
స్పెయిన్ లో రామ్ కు మానస శెట్టి (ఆషికా రంగనాథ్) పరిచయమవుతుంది. మానసకు సత్యగా ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు రామ్. మానస, సత్య స్పెయిన్ లో ఒక్కటవుతారు. అటు భార్య గురించి లవర్ కు చెప్పలేక, ఇటు లవర్ గురించి భార్యకు తెలియకుండా జాగ్రత్త పడుతూ సతమతమవుతాడు రామ్. చివరకు ఏం జరిగిందో తెలియాలంటే భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ చూడాల్సిందే.
మిక్స్ డ్ టాక్
వరుసగా మాస్ మసాలా సినిమాలతో దెబ్బతిన్నాడు రవితేజ. సరైన హిట్ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నాడు. ఈ క్రమంలోనే ఫ్యామిలీ ఎంటర్ టైనర్ భర్త మహాశయులకు విజ్ఞప్తితో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. కానీ ఈ సినిమాకు మిక్స్ డ్ టాక్ వస్తోంది. కామెడీ బాగున్నా రొటీన్ స్టోరీ మైనస్ గా మారిందని అంటున్నారు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


