భర్త మహాశయులకు విజ్ఞ‌ప్తి హీరోయిన్ బ్యాక్‌గ్రౌండ్ తెలిస్తే షాక్ అవాల్సిందే-దాసరి నారాయణరావుకు డింపుల్ హయాతి ఏమవుతుందంటే?

భర్త మహాశయులకు విజ్ఞ‌ప్తి అంటూ థియేటర్లో తన అందం, యాక్టింగ్ తో మెస్మరైజ్ చేయడానికి మళ్లీ వచ్చేస్తోంది హీరోయిన్ డింపుల్ హయాతి. అయితే ఈ భామ బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే కచ్చితంగా షాక్ అవుతారనే చెప్పాలి. లెజండరీ దాసరి నారాయణరావుకు డింపుల్ కు మధ్య బంధం ఏంటో చూద్దాం. 

Published on: Jan 13, 2026, 06:17:50 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సంక్రాంతి 2026 రేసులో నిలిచిన మరో మూవీ భర్త మహాశయులకు విజ్ఞ‌ప్తి. రవితేజ హీరోగా నటించిన ఈ సినిమాలో డింపుల్ హయాతి, ఆషికా రంగనాథన్ హీరోయిన్లు. ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఈ రోజు (జనవరి 13) థియేటర్లో రిలీజవుతోంది. ఈ నేపథ్యంలో డింపుల్ హయాతి బ్యాక్ గ్రౌండ్ హాట్ టాపిక్ గా మారింది. లెజెండరీ దాసరి నారాయణ రావుకు, డింపుల్ కు దగ్గరి సంబంధం ఉంది.

డింపుల్ హయాతి (instagram-Dimple Hyati)
డింపుల్ హయాతి (instagram-Dimple Hyati)

డింపుల్ హయాతి బ్యాక్ గ్రౌండ్

భర్త మహాశయులకు విజ్ఞ‌ప్తి హీరోయిన్ డింపుల్ హయాతి బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే కచ్చితంగా షాక్ అవుతారు. ఈ హాట్ భామ గురించి ఇన్ని రోజుల వరకూ పెద్దగా బయటకు తెలియదు. కానీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు బయటపెట్టింది డింపుల్. దాసరి నారాయణ రావు డింపుల్ కు వరుసకు తాతయ్య అవుతారు. అలాగే డింపుల్ నానమ్మ కూడా ఒకప్పుడు హీరోయిన్.

దాసరి నారాయణ రావు తాతయ్య

హాట్ బ్యూటీ డింపుల్ హయాతికి దివంగత లెజండరీ డైరెక్టర్, నటుడు దాసరి నారాయణ రావు తాతయ్య అవుతారు. డింపుల్ సొంత తాతయ్యకు దాసరి నారాయణ రావు కజిన్. ఈ విషయాన్ని స్వయంగా డింపుల్ హయాతి బయటపెట్టింది. దాసరి నారాయణ రావు పేరు తెలుగు చిత్రసీమలో ఎప్పటికీ పదిలంగా ఉండిపోతుంది. డైరెక్టర్ గా ఎన్నో అద్భుతమైన సినిమాలు అందించిన ఆయన, నటుడిగానూ అబ్బురపరిచారు.

నానమ్మ హీరోయిన్

డింపుల్ హయాతి నానమ్మ ప్రభ ఒకప్పుడు తెలుగులో హీరోయిన్ గా చాలా సినిమాలు చేశారు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేశారు. హీరోలు, హీరోయిన్లకు అమ్మగా నటించారు. కిక్ సినిమాలో రవితేజకు అమ్మగా చేసింది ప్రభనే. ఆమె సీనియర్ ఎన్టీఆర్ తో కూడా కలిసి నటించారు. ఇక డింపుల్ హయాతి పెద్దమ్మ, చిన్నమ్మలు కూడా సినీ ఇండస్ట్రీలో ఉన్నారు. తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో సినిమాలు చేస్తున్నారని డింపుల్ పేర్కొంది.

హిట్ కోసం

2017లోనే హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన డింపుల్ హయాతి ఓ సాలిడ్ హిట్ కోసం వెయిట్ చేస్తూనే ఉంది. తెలుగులో వచ్చిన గల్ఫ్ మూవీతో ఆమె హీరోయిన్ జర్నీ మొదలైంది. ఆ తర్వాత తమిళం, హిందీ, కన్నడ సినిమాల్లోనూ అడుగుపెట్టింది. తెలుగులో అభినేత్రి 2, యురేక, ఖిలాడీ, రామబాణం సినిమాలు చేసింది. కానీ ఇవన్నీ ప్లాఫ్ అయ్యాయి.

తెలుగులో హిట్ కోసం ఇప్పుడు భర్త మహాశయులకు విజ్ఞ‌ప్తి సినిమాపైనే బోలెడు ఆశలు పెట్టుకుంది డింపుల్ హయాతి.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More