ఆయన ఎనర్జీ మ్యాచ్ చేయడానికి ఏ డ్రింక్ లేదు, ఆయనే నాకు స్ఫూర్తి: డైరెక్టర్ పవన్- హీరోయిన్ డింపుల్ హయాతి ఏం చెప్పిందంటే?
రవితేజ, డింపుల్ హయాతి, ఆషిక రంగనాథ్ హీరో హీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ కామెడీ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా చిత్రం భర్త మహాశయులకు విజ్ఞప్తి. జనవరి 13న అంటే రేపు థియేటర్లలో ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో డైరెక్టర్ పవన్ బాసంసెట్టి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
డైరెక్టర్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ కామెడీ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా సినిమా భర్త మహాశయులకు విజ్ఞప్తి. ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకూరి ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మించారు.

భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాలో బ్యూటిపుల్ డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్ కథానాయికలుగా నటించారు. ఇప్పటికే విడుదలైన భర్త మహాశయులకు విజ్ఞప్తి టీజర్, ట్రైలర్, పాటలతో హ్యుజ్ బజ్‌ను సృష్టించింది. ఈ సినిమా జనవరి 13న సంక్రాంతి సందర్భంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
డైరెక్టర్ పవన్ కామెంట్స్
ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్‌గా భర్త మహాశయలకు విజ్ఞప్తి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ పవన్ బాసంసెట్టి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
డైరెక్టర్ పవన్ మాట్లాడుతూ.. "నేను రవితేజ గారికి పెద్ద ఫ్యాన్. ఆయన నాకు ఇన్సిపిరేషన్ (స్ఫూర్తి). రవితేజ గారి ఎనర్జీని మ్యాచ్ చేయడానికి ఏ డ్రింక్ లేదు. ఈ సినిమా చాలా మంచి ఫన్ రైడ్" అని అన్నారు.
ఆ తపనతో చేశారు
"నిర్మాత సుధాకర్ గారు రాజీ పడకుండా సినిమాని నిర్మించే ప్రొడ్యూసర్. కచ్చితంగా కిషోర్ గారు బ్లాక్ బస్టర్ కొట్టాలని తపనతో పని చేశారు. కచ్చితంగా బ్లాక్ బస్టర్ కొడుతున్నారు. భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ యూనిట్ అందరూ పాల్గొన్న ఈ ఈవెంట్ చాలా గ్రాండ్‌గా జరిగింది" అని దర్శకుడు పవన్ బాసంసెట్టి పేర్కొన్నారు.
ఇదే ఈవెంట్‌లో హీరోయిన్ డింపుల్ హయాతి మాట్లాడుతూ.. "అందరికి నమస్కారం. డైరెక్టర్ హరీశ్ శంకర్ గారిని ఇక్కడ చూడడం చాలా ఆనందంగా ఉంది ఈ సినిమా కూడా బొమ్మ బ్లాక్ బస్టర్ అవుతుంది. ఈ సినిమాలో నేను చేసిన బాలమణి క్యారెక్టర్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. చాలా కొత్తదనం ఆడియన్స్ ఫీల్ అవుతారు" అని తెలిపింది.
రవితేజతో రెండో సినిమా
"మా నిర్మాత సుధాకర్ గారు సినిమాని అద్భుతంగా నిర్మించారు. ఈ సినిమాలోని పాటలన్నీ చాలా బాగా హిట్ అయ్యాయి. రవితేజ గారితో ఇది నాకు రెండో సినిమా. ఆయనతో నటించడం చాలా ఆనందాన్నిచ్చింది డైరెక్టర్ గారు సినిమాని అద్భుతంగా తీశారు. ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది" అని ధీమా వ్యక్తం చేసింది హీరోయిన్ డింపుల్ హయాతి.
మూవీ డైరెక్టర్ కిషోర్ తిరుమల మాట్లాడుతూ.. "అందరికి నమస్కారం. ఈ వేడుకకు విచ్చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఈ సినిమా చాలా ఎంజాయ్ చేస్తూ వర్క్ చేశాను" అని చెప్పారు.
కెమిస్ట్రీ అద్భుతం
"భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాలో పనిచేస్తున్న ప్రతి యాక్టర్ వాళ్ల మధ్య కెమిస్ట్రీ చాలా అద్భుతంగా వర్కౌట్ అయింది. జనవరి 13న తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది. అందరూ సినిమాని ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను" అని కోరారు డైరెక్టర్ కిషోర్ తిరుమల.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


