వామ్మో వాయ్యో సాంగ్ లిరిక్స్- అదిరిపోయిన భర్త మహాశయులకు విజ్ఞప్తి మాస్ రొమాంటిక్ పాట- ఇద్దరు భామలతో రవితేజ డ్యాన్స్
మాస్ మహారాజా రవితేజ ఇద్దరు భామలు డింపుల్ హయాతి, ఆషిక రంగనాథ్‌తో కలిసిన నటించిన రొమాంటిక్ ఫ్యామిలీ కామెడీ సినిమా భర్త మహాశయులకు విజ్ఞప్తి. కిశోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి మాస్ రొమాంటిక్‌గా వామ్మో వాయ్యో సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ క్రమంలో వామ్మో వాయ్యో సాంగ్ లిరిక్స్ ఏంటో చూద్దాం.
గత కొన్నేళ్లుగా వరుసగా ప్లాఫ్స్ చవిచూస్తున్నాడు మాస్ మహారాజా రవితేజ. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టేయాలన్న డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రవితేజ వస్తున్నాడు. ఆ సినిమానే భర్త మహాశయులకు విజ్ఞప్తి. ఎప్పుడు చూడని పాత్రలో రవితేజను చూపిస్తున్నారు డైరెక్టర్ కిశోర్ తిరుమల.

ఇద్దరు భామలతో రవితేజ
భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాలో రవితేజకు జోడీగా ఇద్దరు భామలు డింపుల్ హయాతి, ఆషిక రంగనాథ్ హీరోయిన్స్‌గా చేశారు. ఇప్పటికే ఈ సినిమా టీజర్ చాలా బాగా ఆకట్టుకుంది.
తాజాగా జనవరి 1న భర్త మహాశయులకు విజ్ఞప్తి నుంచి మాస్ అండ్ రొమాంటిక్‌గా సాగే వామ్మో వాయ్యో సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ మ్యూజిక్, బీట్స్, రచన అదిరిపోయిందని టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో వామ్మో వాయ్యో సాంగ్ లిరిక్స్ ఏంటో ఓ లుక్కేద్దాం.
వామ్మో వాయ్యో లిరిక్స్:
ఇల్లు పాయె ఒల్లు పాయె.. ఓ రామ రామ..
గా లచ్చుగాని ఎచ్చులు పాయె.. ఓ రామ రామ..
సెల్లు పాయె సిమ్ము పాయె.. ఓ రామ రామ..
గా సూరిగాని సొల్లు పాయె.. ఓ రామ రామ..
పువ్వు పాయె నవ్వు పాయె.. ఓ రామ రామ..
గీ పొట్టిదాని లవ్వు పాయె.. ఓ రామ రామ..
ముద్దు ముచ్చటంత పాయె.. మూతిపండ్లు రాలి పాయె..
వామ్మో వాయ్యో ఒల్లెంకలో.. నేనేంజేతు సల్లెంకలో..
వామ్మో వాయ్యో ఒల్లెంకలో.. నేనేంజేతు సల్లెంకలో..
గట్టు పాయె గెట్టు పాయె.. ఓ రామ రామ..
నెత్తి మీద జుట్టు పాయె.. ఓ రామ రామ..
సేను పాయె సెలక పాయె.. ఓ రామ రామ..
సేతిలోన పలక పాయె.. ఓ రామ రామ..
మన్ను పాయె మలక పాయె.. ఓ రామ రామ..
సిలకలొచ్చి ఎగిరి పాయె.. ఓ రామ రామ..
గిరక పాయె గిలక పాయె.. నులక మంచమిరిగి పాయె..
వామ్మో వాయ్యో ఒల్లెంకలో.. నేనేంజేతు సల్లెంకలో..
వామ్మో వాయ్యో ఒల్లెంకలో.. నేనేంజేతు సల్లెంకలో..
లంగ పాయె ఓణి పాయె.. ఓ రామ రామ..
కంచిపట్టు చీర పాయె.. ఓ రామ రామ..
పడుగు పాయె గొడుగు పాయె.. ఓ రామ రామ..
ఉన్నదంత ఊడ్సక పాయె.. ఓ రామ రామ..
వడ్లు పాయె ఎడ్లు పాయె.. ఓ రామ రామ..
కొంగుకున్న దుడ్లు పాయె.. ఓ రామ రామ..
బండ్లు పాయె గండ్లు పాయె.. తుపాకీల గుండ్లు పాయె..
వామ్మో వాయ్యో ఒల్లెంకలో.. నేనేంజేతు సల్లెంకలో..
వామ్మో వాయ్యో ఒల్లెంకలో.. నేనేంజేతు సల్లెంకలో..
రచన-గాత్రం
ఇలా సాగిన వామ్మో వాయ్యో పాటకు దేవ్ పవార్ సాహిత్యం అందించగా.. సింగర్ స్వాతిరెడ్డి యూకే ఆలపించారు. అలాగే, బ్యాక్‌గ్రౌండ్ (ఓ రామ రామ) వాయిస్‌ను సింధూజ శ్రీనివాసన్ ఇచ్చారు. ఊపొచ్చే బీట్‌తో మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్ సిసిరోలియో సాంగ్ కంపోజ్ చేశారు. కాగా, ఇద్దరు భామలతో రవితేజ డ్యాన్స్ చేసిన వామ్మో వాయ్యో యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతూ ఆకట్టుకుంటోంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


