ఫ్యామిలీ డాక్టర్ కాస్త గ్యాప్ ఇవ్వమన్నాడు.. కడుపుబ్బా నవ్విస్తున్న రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి ట్రైలర్

రవితేజ నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ ట్రైలర్ బుధవారం (జనవరి 7) రిలీజైంది. సంక్రాంతి సందర్భంగా చాలా రోజుల తర్వాత రవితేజ ఓ పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో వస్తున్నాడు. ట్రైలర్ మొత్తం కడుపుబ్బా నవ్విస్తూ సాగిపోయింది.

Published on: Jan 7, 2026, 17:37:16 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మాస్ మహారాజా రవితేజ చాలా రోజుల తర్వాత ఓ పక్కా ఫ్యామిలీ మ్యాన్‌లా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సంక్రాంతికి భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీతో అతడు అలరించనున్న విషయం తెలిసిందే. మూవీ జనవరి 13న రిలీజ్ కానుండగా.. బుధవారం (జనవరి 7) ట్రైలర్ రిలీజ్ చేశారు.

ఫ్యామిలీ డాక్టర్ కాస్త గ్యాప్ ఇవ్వమన్నాడు.. కడుపుబ్బా నవ్విస్తున్న రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి ట్రైలర్
ఫ్యామిలీ డాక్టర్ కాస్త గ్యాప్ ఇవ్వమన్నాడు.. కడుపుబ్బా నవ్విస్తున్న రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి ట్రైలర్

భర్త మహాశయులకు విజ్ఞప్తి ట్రైలర్

రవితేజ తన మాస్ మహారాజా పేరుకు తగినట్లే కొన్నాళ్లుగా వరుసగా మాస్ సినిమాలతో వస్తున్నాడు. బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడుతున్నాడు. దీంతో ఈసారి రూటు మార్చి ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో సంక్రాంతి బరిలో నిలిచాడు. భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే వెరైటీ టైటిల్ కు తగినట్లుగానే.. ట్రైలర్ కూడా ఫన్నీగా సాగిపోయింది.

బ్యాక్ టు బ్యాక్ గన్లు, కత్తులు, భోజనాల ఫైట్లు, జాతర ఫైట్లు చేశానని, ఫ్యామిలీ డాక్టర్ కాస్త గ్యాప్ ఇవ్వమన్నాడంటూ ఈ ట్రైలర్ మొదలు పెడతాడు రవితేజ. ఆ తర్వాత అతడు ఫ్యామిలీ మ్యాన్ రూపంలోకి మారిపోతాడు. ఇద్దరు భామల మధ్య నలిగిపోయే వ్యక్తిగా మెప్పించాడు. ఈ సంక్రాంతికి నవ్వులు గ్యారెంటీ అనేలా ఈ భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ ట్రైలర్ సాగిపోయింది.

భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ విశేషాలు

కిశోర్ తిరుమల ఈ భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాను డైరెక్ట్ చేశాడు. ఇందులో రవితేజతోపాటు డింపుల్ హయతి, ఆశికా రంగనాథ్ నటించారు. జనవరి 13న సంక్రాంతి సందర్భంగా మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న రవితేజకు ఈ మూవీతోనూ హిట్టు కొట్టడం అంత సులువుగా కనిపించడం లేదు.

ఎందుకంటే ది రాజా సాబ్, మన శంకరవరప్రసాద్ గారు, అనగనగా ఒక రాజు, నారీ నారీ నడుమ మురారీలాంటి సినిమాల నుంచి దీనికి గట్టి పోటీ ఉంది. ఈ నేపథ్యంలో సినిమాలో ప్రేక్షకులు మెచ్చే ఏదైనా యూనిక్ పాయింట్ ఉంటే తప్ప బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ కావడం కష్టం. తన మాస్ రూటును పక్కన పెట్టి హిట్టు కోసం ఫ్యామిలీ బాట పట్టిన రవితేజను ఈ భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ ఎంత వరకూ ఆదుకుంటుందో చూడాలి.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More