తన అందంపైనే డౌట్ పడిన బ్యూటీ- హీరోయిన్ అయ్యే ఒక్క క్వాలిటీ లేదన్న తాప్సీ- నన్ను నేనే హింసించుకున్నా, నరకం చూశానంటూ!

సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బ్యూటిపుల్ హీరోయిన్ తాప్సీ పన్ను. అయితే తన కెరీర్ మొదట్లో ఎదుర్కొన్న మానసిక సంఘర్షణ గురించి మనసు విప్పి చెప్పింది తాప్సీ. తన అందంపైనే తాను డౌట్ పడినట్లు, హీరోయిన్ అయ్యేందుకు ఒక్క క్వాలిటీ కూడా లేదనే భావనకు గురైనట్లు చెప్పింది.

Published on: Jan 12, 2026, 18:50:25 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గ్లామర్ ప్రపంచంలో రాణించాలంటే కేవలం నటన వస్తే సరిపోదు, అద్భుతమైన అందం కూడా ఉండాలని చాలామంది నమ్ముతుంటారు. సరిగ్గా ఇదే ఆలోచన బ్యూటిపుల్ హీరోయిన్ తాప్సీ పన్నును కెరీర్ మొదట్లో తీవ్రంగా వేధించిందట. తనకంటే పెద్ద బ్యూటిఫుల్ స్టార్స్ ముందు తాను హీరోయిన్‌గా ఎలా రాణిస్తాననే సందేహంతో రోజులు గడిపానని తాప్సీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

తన అందంపైనే డౌట్ పడిన బ్యూటీ- హీరోయిన్ అయ్యే ఒక్క క్వాలిటీ లేదన్న తాప్సీ- నన్ను నేనే హింసించుకున్నా, నరకం చూశానంటూ!
తన అందంపైనే డౌట్ పడిన బ్యూటీ- హీరోయిన్ అయ్యే ఒక్క క్వాలిటీ లేదన్న తాప్సీ- నన్ను నేనే హింసించుకున్నా, నరకం చూశానంటూ!

అందం సరిపోదనే భయం..

తన కెరీర్ తొలినాళ్లలోని అభద్రతా భావం గురించి తాప్సీ మాట్లాడింది. "నా చుట్టూ ఉన్న గ్లామరస్ హీరోయిన్లలా నేను కనిపించను కదా, నన్ను హీరోయిన్‌గా ఎవరు తీసుకుంటారు? అని ఎప్పుడూ భయపడేదాన్ని. అసలు హీరోయిన్ కావాలంటే ఉండాల్సిన కనీస లక్షణాలు నాలో లేవనుకున్నా. అప్పట్లో నాకు బేసిక్ ఫ్యాషన్ సెన్స్ లేదు, మేకప్ ఎలా వేసుకోవాలో తెలియదు, కెమెరా ముందు నా బెస్ట్ యాంగిల్ ఏదో కూడా అవగాహన ఉండేది కాదు" అని తాప్సీ పేర్కొన్నారు.

మానసికంగా అలసిపోయాను!

అన్నీ త్వరగా నేర్చేసుకోవాలనే తాపత్రయంలో తనను తాను హింసించుకున్నానని తాప్సీ ఆవేదన వ్యక్తం చేశారు. "ఆ కొన్ని ఏళ్లలో ప్రతిదీ నేర్చుకోవడానికి నా మీద నేను విపరీతమైన ఒత్తిడి పెంచుకున్నాను. అది నన్ను మానసికగా చాలా అలసిపోయేలా చేసింది" అని తాప్సీ తెలిపారు.

ఎవరైనా చెప్పుంటే బాగుండేంది

"నిదానంగా నేర్చుకోవచ్చు అని ఎవరైనా నాకు అప్పుడు చెప్పి ఉంటే బాగుండేది. నేర్చుకునే ప్రక్రియను ఎంజాయ్ చేయకుండా, నన్ను నేనే విమర్శించుకుంటూ గడపడం వల్ల చాలా నరకం చూశాను" అని తాప్సీ పన్ను చెప్పుకొచ్చారు.

వైఫల్యానికి బాధ్యత నాదేనా?

సినిమా పరాజయాలను కూడా తనపైనే వేసుకునేదాన్ని అని తాప్సీ గుర్తు చేసుకున్నారు. "ప్రతిరోజూ నన్ను నేను తిట్టుకునేదాన్ని. సరిగ్గా నటించడం లేదేమో అని కుమిలిపోయేదాన్ని. కానీ, ఒక సినిమా ఫెయిల్ అయితే దానికి కేవలం నటులే కారణం కాదు, అది టీమ్ మొత్తం బాధ్యత. కానీ, ఆ రోజుల్లో అంతా నా వల్లే జరుగుతోందని నన్ను నేను బలి పశువును చేసుకున్నాను" అని తాప్సీ పన్ను ఆవేదన వ్యక్తం చేశారు.

అందంపై డౌట్

అలా తన అందంపై తానే డౌట్ పెంచుకుని, తీవ్రమైన ఆత్మనూన్యత భావానికి గురైన తాప్సీ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. కనికా ధిల్లాన్ కథ అందిస్తున్న 'గాంధారి' అనే రివేంజ్ డ్రామాలో తాప్సీ నటిస్తున్నారు.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో

దేవాశిష్ మఖీజా దర్శకత్వం వహిస్తున్న గాంధారి త్వరలోనే నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ రిలీజ్ కానుంది. ఇక తాప్సీ చివరిగా అక్షయ్ కుమార్‌తో కలిసి 'ఖేల్ ఖేల్ మే' చిత్రంలో మెరిశారు. మంచు మనోజ్ ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా పరిచయమైన తాప్సీ అగ్ర హీరోలతో నటించి మెప్పించింది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More