భర్త మహాశయులకు విజ్ఞప్తి రివ్యూ- భార్య, ప్రియురాలి మధ్య నలిగిపోయే రవితేజ- ఫ్యామిలీ రొమాంటిక్ కామెడీ మూవీ నవ్వించిందా?
మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ రొమాంటిక్ కామెడీ డ్రామా మూవీ భర్త మహాశయులకు విజ్ఞప్తి. డింపుల్ హయాతి, ఆషిక రంగనాథ్ హీరోయిన్స్‌గా కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇవాళ విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో నేటి భర్త మహాశయులకు విజ్ఞప్తి రివ్యూలో తెలుసుకుందాం.
టైటిల్: భర్త మహాశయులకు విజ్ఞప్తి

నటీనటులు: రవితేజ, డింపుల్ హయాతి, ఆషిక రంగనాథ్, సునీల్, వెన్నెల కిశోర్, సత్య, గెటప్ శ్రీను, మురళిధర్ గౌడ్, అజయ్ ఘోష్, రోహన్ తిదితరులు
దర్శకత్వం: కిషోర్ తిరుమల
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
సినిమాటోగ్రఫీ: ప్రసాద్ మూరేళ్ల
ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
విడుదల తేది: జనవరి 13, 2026
మాస్ మహారాజ రవితేజ ఎనర్జీకి, సినిమాలకు సూపర్ క్రేజ్ ఉంటుంది. అలాంటి రవితేజ గత కొంతకాలంగా వరుసగా ఫ్లాప్స్ అందుకుంటున్న విషయం తెలిసిందే. ఈసారి రూట్ మార్చి ఫ్యామిలీ ఆడియెన్స్‌ను అలరించేందుకు రవితేజ నటించిన లేటెస్ట్ సినిమా భర్త మహాశయులకు విజ్ఞప్తి.
ఇద్దరు హీరోయిన్స్
రొమాంటిక్ ఫ్యామిలీ కామెడీ డ్రామా చిత్రంగా తెరకెక్కిన భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాకు కిషోర్ తిరుమల దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రవితేజకు జోడీగా డింపుల్ హయాతి, ఆషిక రంగనాథ్ ఇద్దరు హీరోయిన్స్‌గా చేశారు.
భర్త మహాశయులకు విజ్ఞప్తి రివ్యూ
టీజర్, ట్రైలర్, సాంగ్స్‌తో ఆకట్టుకున్న భర్త మహాశయులకు మూవీ ఇవాళ (జనవరి 13) థియేటర్లలో విడుదలైంది. మరి చాలా కాలం తర్వాత రవితేజకు హిట్ పడిందా?, ప్రేక్షకులను ఈ సినిమా నవ్వించిందా? అనేది నేటి భర్త మహాశయులకు విజ్ఞప్తి రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
రామ్ సత్యనారాయణ (రవితేజ), బాలమణి (డింపుల్ హయాతి) ఇద్దరు భార్యాభర్తలు. చాలా అన్యోన్యంగా ఉంటారు. వీరికి అనార్కలి అనే వైన్ బ్రాండ్ కంపెనీ ఉంటుంది. వ్యాపార నిమిత్తం స్పెయిన్‌కు వెళ్తాడు రామ్. అక్కడ పరిచయం అయిన మానస శెట్టి (ఆషిక రంగనాథ్)తో ఫిజికల్ రిలేషన్‌షిప్‌లోకి వెళ్తాడు రామ్.
తనకు పెళ్లయిన విషయాన్ని మానస దగ్గర, ఎఫైర్ గురించి భార్య బాలమణి దగ్గర దాస్తాడు రామ్. ఆ తర్వాత ఏమైంది? భార్యకు, ప్రియురాలికి నిజం తెలియకుండా రామ్ ఎలాంటి తంటాలు పడ్డాడు? పరాయి స్త్రీతో తన భర్త శారీరక సంబంధం పెట్టుకున్నాడని తెలిసిన బాలామణి ఏం చేసింది? చివరికి ఏమైంది? అనేది తెలియాలంటే? భర్త మహాశయులకు విజ్ఞప్తి చూడాల్సిందే.
విశ్లేషణ:
భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాపై మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. అందుకు కారణం యాక్షన్ పాత్రలు వదిలేసి ఫ్యామిలీ ఒరియెంటెడ్ సబ్జెక్ట్‌తో రవితేజ రావడం ఒకటి అయితే, మరోటి డైరెక్టర్ కిషోర్ తిరుమల. నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ, చిత్రలహరి వంటి బ్యూటిపుల్ లవ్ స్టోరీలతో పాటు ఆడవాళ్లు మీకు జోహార్లు లాంటి కుటుంబ కథా నేపథ్యం సినిమాలతో మెప్పించారు కిశోర్ తిరుమల.
దానికితోడు భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా టీజర్, ట్రైలర్ బాగా ఆకట్టుకున్నాయి. అవి చూస్తే దాదాపుగా కథ మొత్తం అర్థమైపోతుంది. పెళ్లయిన హీరో ఫారెన్‌కు వెళ్లి మరో అమ్మాయితో రిలేషన్‌షిప్‌లో ఉండటం, అది తెలియకుండా కవర్ చేయడం, చివరికి తెలిసాక ఏం జరిగింది అనేదే మూవీ కథ.
ఇది ఒక రెగ్యులర్ స్టోరీనే. వెంకటేష్ ఇంట్లో ఇల్లాలు వంట్లింట్లో ప్రియురాలు మూవీలాగా అనిపిస్తుంది. ఇప్పటి జెనరేషన్‌కు తగినట్లుగా భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాను మలిచారు కిషోర్ తిరుమల. ఒకరికొకరి నిజం తెలియనివ్వకుండా రవితేజ చేసే పనులు కామెడీ తెప్పిస్తాయి.
నిరాశపరిచే క్లైమాక్స్
ఈ క్రమంలో వచ్చే సత్య, వెన్నెల కిశోర్ కామెడీ ట్రాక్ హాయిగా నవ్విస్తుంది. డైలాగ్స్ చాలా బాగా పేలి నవ్విస్తాయి. అయితే, కథనం మాత్రం నెమ్మదిస్తుంది. టేకింగ్‌లో డైరెక్టర్ తడబడిన ఫీలింగ్ కలుగుతుంది. ఇక ఆకట్టుకోవాల్సిన క్లైమాక్స్ మాత్రం కాస్తా నిరాశపరుస్తుంది.
సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. విజువల్స్ అందంగా ఉన్నాయి. ఎడిటింగ్ బాగుంది. సాంగ్స్ చాలా బాగున్నాయి. బీజీఎమ్ ఓకే. గుర్తుండిపోయేలా పాటలు అలరిస్తాయి. హీరో హీరోయిన్ల డ్యాన్స్ అదిరిపోయింది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ఆడియెన్స్‌ను నవ్వించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు.
పాత రవితేజ కనిపిస్తాడు. సీరియస్ పాత్రలతో వచ్చిన రవితేజ ఈసారి తన ఎనర్జీతో అలరిస్తాడు. కామెడీ టైమింగ్, డీజే మిక్స్ సాంగ్‌లో స్టేప్పులు అదిరిపోతాయి. ఇద్దరు హీరోయిన్స్‌కు ప్రాధాన్యత ఉంది. భార్యగా డింపుల్ సెటిల్డ్ పర్ఫామెన్స్ ఇచ్చింది.
మెప్పించిందా అంటే?
ప్రియురాలిగా ఆషిక రంగనాథ్ గ్లామర్‌తో అట్రాక్ట్ చేస్తుంది. నటిగా కూడా ఆకట్టుకుంటుంది. మిగతా పాత్రలు అంతా బాగా చేశారు. ఫైనల్‌గా చెప్పాలంటే రొటీన్ స్టోరీ అయిన ప్రేక్షకులను నవ్వించే భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీపై లుక్కేయవచ్చు.
రేటింగ్: 3/5
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


