ఇలాంటి సినిమా ఎప్పుడూ చూడలేదు.. క్లైమాక్స్ మైండ్ బ్లోయింగ్.. కొన్ని వారాల పాటు షూటింగ్ చేశాం: ది రాజా సాబ్‌పై నిధి

నిధి అగర్వాల్ త్వరలోనే ది రాజా సాబ్ మూవీతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా గురించి ఆమె ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇలాంటి మూవీ ఇప్పటి వరకూ చూడలేదని, క్లైమ్యాక్స్ చూస్తే మతి పోతుందని చెప్పింది.

Published on: Jan 7, 2026, 15:08:54 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ఒకటైన 'ది రాజా సాబ్' (The Raja Saab)లో హీరోయిన్‌గా నటిస్తున్న నిధి అగర్వాల్ సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. ప్రభాస్‌తో పనిచేయడం, సినిమాలోని హైలైట్స్, ముఖ్యంగా చివరి 30 నిమిషాల క్లైమాక్స్ గురించి ఆమె చెప్పిన విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

ఇలాంటి సినిమా ఎప్పుడూ చూడలేదు.. క్లైమాక్స్ మైండ్ బ్లోయింగ్.. కొన్ని వారాల పాటు షూటింగ్ చేశాం: ది రాజా సాబ్‌పై నిధి
ఇలాంటి సినిమా ఎప్పుడూ చూడలేదు.. క్లైమాక్స్ మైండ్ బ్లోయింగ్.. కొన్ని వారాల పాటు షూటింగ్ చేశాం: ది రాజా సాబ్‌పై నిధి

చివరి 30 నిమిషాలు మైండ్ బ్లోయింగ్

ది రాజా సాబ్ మూవీ చూశారా అని నిధిని అడిగినప్పుడు ఆమె ఇలా చెప్పింది. “డబ్బింగ్ చెప్పేటప్పుడు సినిమా చూశాను. ఇందులో కామెడీ, రొమాన్స్, హారర్, ఫ్యాంటసీ, ఫ్యామిలీ డ్రామా.. ఇలా అన్నీ ఉన్నాయి. మారుతి వీటిని చాలా బాగా బ్యాలెన్స్ చేశారు. అయితే.. సెకండాఫ్, ముఖ్యంగా చివరి 30 నిమిషాల క్లైమాక్స్ మాత్రం మైండ్ బ్లోయింగ్ అని చెప్పాలి. షూటింగ్ అప్పుడు మాకు పెద్దగా అర్థం కాలేదు కానీ, వీఎఫ్ఎక్స్ అన్నీ యాడ్ అయ్యాక అవుట్‌పుట్ చూసి షాక్ అయ్యాం. ఆడియెన్స్ కచ్చితంగా మంత్రముగ్ధులవుతారు” అని చెప్పింది.

అది నా అదృష్టం

ఇక ప్రభాస్ తో నటించడంపైనా నిధి స్పందించింది. “ప్రభాస్ తో నటించడం నా అదృష్టం. గతంలో పవన్ కళ్యాణ్ తో, ఇప్పుడు ప్రభాస్ తో.. ఇద్దరూ వేరే లెవెల్. ప్రభాస్ నిజంగానే అందరూ పిలిచేట్టు 'డార్లింగ్'. ఎలాంటి స్టార్ ఆటిట్యూడ్ చూపించరు. చాలా కాలం తర్వాత ఆయన ఇందులో ఫుల్ ఫన్ రోల్ చేస్తున్నారు. ఆయన కామెడీ టైమింగ్, సినిమాలో ఆయన కనిపించే రెండో అవతారం చూసి ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతారు. ఆ రెండో లుక్ మాత్రం సీక్రెట్” అని చెప్పింది.

క్లైమాక్స్ హైప్ గురించి..

ది రాజా సాబ్ మూవీ క్లైమాక్స్ గురించి మరీ ఎక్కువ హైప్ ఇవ్వడంపై నిధి అగర్వాల్ ఇలా చెప్పింది. “ఆ హైప్ వంద శాతం కరెక్ట్. నేను ఇప్పటివరకు అలాంటి సినిమా చూడలేదు. కేవలం క్లైమాక్స్ కోసమే మేము వారాల తరబడి షూటింగ్ చేశాం. అది దాదాపు అరగంట సేపు ఉంటుంది. అందులో వచ్చే ఫ్యాంటసీ ఎలిమెంట్స్, ప్రభాస్ పర్ఫార్మెన్స్, ట్విస్టులు చూసి ఆడియెన్స్ మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే” అని నిధి అనడం విశేషం.

ఆలస్యమవడంతో నిరాశ చెందా

ఇక పవన్ కల్యాణ్, ప్రభాస్ లాంటి స్టార్లతో చేసినా.. రెండు సినిమాలూ చాలా ఆలస్యం కావడంపైనా నిధి మాట్లాడింది. “పవన్ కళ్యాణ్, ప్రభాస్ లాంటి స్టార్లతో సినిమాలు ఒప్పుకున్నప్పుడు చాలా సంతోషపడ్డాను. డిలే అయినప్పుడు కాస్త నిరాశపడ్డా. మళ్ళీ షూటింగ్ మొదలయ్యాక అదంతా మర్చిపోయాను. నాకు షూటింగ్ సెట్ అంటే చాలా ఇష్టం. కొన్ని మన చేతిలో ఉండవు. కానీ ఇప్పుడు పండుగ టైంలో సినిమా వస్తోంది కాబట్టి ఆ వెయిటింగ్ కి తగ్గ ఫలితం ఉంటుంది” అని నిధి చెప్పింది.

ప్రభాస్, నిధి అగర్వాల్ తోపాటు మాళవికా మోహనన్, రిద్ధి నటించిన ది రాజా సాబ్ మూవీ ఈ శుక్రవారం (జనవరి 9) రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. కల్కి 2898 ఏడీ తర్వాత ప్రభాస్ నటించిన సినిమా కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More