అల్లు అర్జున్ ఫ్యాన్స్ కీలక నిర్ణయం.. ఆ నినాదంతో ముందుకు వెళ్లేలా ప్లాన్!
అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ సమావేశమైంది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు బన్నీ ఫ్యాన్స్. కిందిస్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయాలని చర్చించారు.
అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్(AAFA) రెండు తెలుగు రాష్ట్రాల కమిటీ సభ్యులతో హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున సమావేశం జరిగింది. దాదాపు నాలుగు నుండి ఐదు గంటలు జరిగిన ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు శివ శంకర్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు అంజి యాదవ్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంతటా జిల్లా మండల, పట్టణ స్థాయి కమిటీల ఏర్పాటు చేసేందుకు ప్లానింగ్ చేస్తున్నారు.

హైదరాబాద్ సమావేశంలో ఎంపిక చేసిన ప్రతినిధులకు వారి పాత్రలు, బాధ్యతల గురించి స్పష్టంగా వివరించారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ కార్యకలాపాలు మరింత వ్యవస్థీకృతంగా, ప్రభావవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, పట్టణ స్థాయి కమిటీల ఏర్పాటుపై వివరణాత్మక చర్చలు జరిగాయి.
రాబోయే రోజుల్లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ కార్యకలాపాలను సమన్వయం చేయడంలో, బలోపేతం చేయడంలో ఈ కమిటీలు కీలక పాత్ర పోషిస్తాయని అసోసియేషన్ నాయకులు పేర్కొన్నారు. ఫ్యాన్స్ చేసే సేవా కార్యకలాపాలను మరింత కిందిస్థాయికి తీసుకెళ్లేందుకు బన్నీ ఫ్యాన్స్ ప్లాన్ చేస్తున్నారు. కింది స్థాయిలో ఫ్యాన్స్ చేసే పనులపై దృష్టి సారిస్తామని తెలిపారు.
ఈ సమావేశంలో అభిమానుల మధ్య ఐక్యతను పెంపొందించేలా సామాజిక సేవా కార్యక్రమాలు, ఇతర కార్యక్రమాలతో అసోసియేషన్ ప్రాధాన్యతను పెంచేలా చూడాలని నిర్ణయించారు. అసోసియేషన్ చేపట్టే అన్ని కార్యకలాపాలు అల్లు అర్జున్ విలువలు, క్రమశిక్షణ, సానుకూల మార్పునకు నిబద్ధతను ప్రతిబింబించేలా ఉండాలని అనుకున్నారు. 'ప్రతి సంవత్సరం ఒక మంచి పని' అనే నినాదాన్ని అసోసియేషన్‌ను మరింత బలోపేతం చేయాలని బన్నీ ఫ్యాన్స్ చెప్పారు.
ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో వస్తున్న సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి దీపికా పదుకొనే కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్ర షూటింగ్‌లో ఎక్కువ భాగం ముంబైలో జరుగుతోందని తెలుస్తోంది. VFX స్టూడియోస్‌లో భారీ సెట్‌లు నిర్మించారని, అక్కడ అనేక కీలక సన్నివేశాలు తీస్తున్నారట. అక్కడే పాటలను చిత్రీకరించనున్నామని కూడా సమాచారం.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


