దుబాయ్‌లో అల్లు శిరీష్ ప్రీవెడ్డింగ్ పార్టీ.. షాంపేన్ ఓపెన్ చేయబోయి అల్లు అర్జున్ ఇలా.. ఇన్‌సైడ్ ఫొటోలు షేర్ చేసిన నటి

అల్లు వారింట పెళ్లి సందడి మొదలైంది. అల్లు శిరీష్, నయనికల ప్రీ-వెడ్డింగ్ వేడుకలు దుబాయ్‌లో ఘనంగా జరుగుతున్నాయి. ఓ లగ్జరీ యాట్ లో జరిగిన పార్టీలో అల్లు అర్జున్, స్నేహారెడ్డి, నితిన్ సతీమణి షాలిని తదితరులు కూడా ఉన్నారు. అల్లు అర్జున్ షాంపేన్ బాటిల్ ఓపెన్ చేసే ఫన్నీ వీడియో చూడండి.

Published on: Feb 4, 2026, 20:09:19 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చిన్న కుమారుడు, యువ హీరో అల్లు శిరీష్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. నయనికతో అతని పెళ్లి జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దుబాయ్ వేదికగా వీరి ప్రీ-వెడ్డింగ్ వేడుకలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. దుబాయ్ తీరంలో ఓ లగ్జరీ యాట్ (Yacht)లో జరిగిన ఈ పార్టీకి సంబంధించిన ఫొటోలు, వీడియోలను నటి, సింగర్ సోఫీ చౌదరి సోషల్ మీడియాలో పంచుకుంది.

దుబాయ్‌లో అల్లు శిరీష్ ప్రీవెడ్డింగ్ పార్టీ.. అల్లు అర్జున్ స్పెషల్ అట్రాక్షన్.. ఇన్‌సైడ్ ఫొటోలు షేర్ చేసిన నటి
దుబాయ్‌లో అల్లు శిరీష్ ప్రీవెడ్డింగ్ పార్టీ.. అల్లు అర్జున్ స్పెషల్ అట్రాక్షన్.. ఇన్‌సైడ్ ఫొటోలు షేర్ చేసిన నటి

అల్లు అర్జున్ 'షాంపేన్' కష్టాలు.. నవ్వులే నవ్వులు

ఈ పార్టీలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హైలైట్‌గా నిలిచాడు. వేడుకలో భాగంగా బన్నీ స్టైలిష్‌గా షాంపేన్ బాటిల్ ఓపెన్ చేయడానికి ప్రయత్నించాడు. అందరూ ఆసక్తిగా చూస్తుండగా.. బాటిల్ మూత తెరుచుకుంది కానీ, షాంపైన్ మాత్రం పొంగలేదు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా నవ్వేశారు.

వెంటనే పక్కనే ఉన్న వరుడు శిరీష్ బాటిల్ అందుకుని, దాన్ని షేక్ చేసి ఆ సిచువేషన్ 'కవర్' చేశాడు. ఈ తతంగం చూసి అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి, సోదరుడు అల్లు బాబీ పడిపడి నవ్వడం వీడియోలో కనిపించింది.

వైరల్ అవుతున్న ఫోటోలు

సోఫీ చౌదరి షేర్ చేసిన ఫోటోల్లో.. సన్ సెట్ అవుతున్న వేళ శిరీష్, నయనికలతో దిగిన ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి. అలాగే అల్లు అర్జున్, శిరీష్‌లతో సోఫీ దిగిన సెల్ఫీ, అల్లు బాబీతో దిగిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఈ పార్టీలో హీరో నితిన్ భార్య షాలిని కందుకూరి కూడా సందడి చేసింది.

"మీ జంట చూడముచ్చటగా ఉంది"

ఈ ఫోటోలను షేర్ చేస్తూ సోఫీ ఒక ఎమోషనల్ నోట్ రాసుకొచ్చింది. "నా బెస్ట్ ఫ్రెండ్, ఎంతో స్వీట్ అయిన శిరీష్.. అతనికి కాబోయే అందమైన భార్య నయనిక.. మీ జంట చూడముచ్చటగా ఉంది. మీరిద్దరూ ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలి. అలాగే అర్జున్.. నువ్వు నువ్వులా ఉన్నందుకు థాంక్యూ" అంటూ అల్లు అర్జున్‌ను కూడా ట్యాగ్ చేసింది.

మార్చి 6న ముహూర్తం

గతేడాది అక్టోబర్ 31న హైదరాబాద్‌లో శిరీష్, నయనికల నిశ్చితార్థం కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది. నితిన్, షాలిని కలిసి వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి కోసం ఇచ్చిన విందులో శిరీష్, నయనికలు తొలిసారి కలుసుకున్నారు. రెండేళ్ల ప్రేమాయణం తర్వాత వీరు పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. మార్చి 6న వీరి వివాహం జరగనుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More