ధురంధర్ డైరెక్ట‌ర్‌తో అల్లు అర్జున్ మూవీ-పెద్ద ప్లానే వేసిన మేకర్స్‌-కానీ ప్రాజెక్ట్ క్యాన్సిల్‌-రీజ‌న్ ఇదే!

ఐకానిక్ స్టార్ క్రేజీ డైరెక్టర్లను లైన్లో పెట్టాడు. వరుసగా సినిమాలు చేయబోతున్నాడు. మరోవైపు ధురంధర్ తో సెన్సేషన్ క్రియేట్ చేశాడు డైరెక్టర్ ఆదిత్య ధర్. అయితే ఆదిత్య, అల్లు అర్జున్ కాంబినేషన్లో ఓ సినిమా రావాల్సింది. కానీ ఆగిపోయింది. అందుకు కారణం ఇదేనంటూ  ఓ వార్త వైరల్ గా మారింది. 

Published on: Feb 3, 2026, 06:18:18 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లైనప్ లో క్రేజీ సినిమాలున్నాయి. పుష్ప సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన క్రేజ్ ను కొనసాగించేలా అతను మూవీస్ చేస్తున్నాడు. అయితే ధురంధర్ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఆదిత్య ధర్ తో అల్లు అర్జున్ ఓ సినిమా చేయాల్సింది. కానీ ఆగిపోయిందనే టాక్ వినిపిస్తోంది. రీజన్ ఏంటో చూద్దాం.

అల్లు అర్జున్ (x/alluarjun)
అల్లు అర్జున్ (x/alluarjun)

అల్లు అర్జున్- ఆదిత్య మూవీ

పుష్ప సినిమాలతో అల్లు అర్జున్ కెరీర్ గ్రాఫ్ వేరే లెవల్ కు వెళ్లింది. అయితే ధురంధర్ సినిమా డైరెక్టర్ ఆదిత్య ధర్ డైరెక్షన్ లో సినిమా చేసే ఛాన్స్ అల్లు అర్జున్ కు మిస్ అయిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో పురాణాల్లోని మరణం లేని అశ్వత్థామ క్యారెక్టర్ ఆధారంగా ఓ సినిమా చేయాలని మేకర్స్ ప్లాన్ వేశారనే వార్త వైరల్ గా మారింది.

మూవీ క్యాన్సిల్

అల్లు అర్జున్-ఆదిత్య ధర్ కాంబినేషన్లో సినిమా కోసం విశ్వ ప్రయత్నాలే జరిగాయని టాక్. కథ కూడా సెట్ అయిందని అంటున్నారు. కానీ ఈ సినిమా మాత్రం క్యాన్సిల్ అయింది. దీంతో ధురంధర్ మూవీపై ఫోకస్ పెట్టాడు ఆదిత్య. అల్లు అర్జున్ ఏమో తన ఇతర సినిమాలతో బిజీ అయిపోయాడు.

కారణం ఇదే

ఆదిత్య ధర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ప్రాజెక్ట్ పట్టాలెక్కకపోవడానికి కారణం కల్కి 2898 ఏడీ సినిమా అని చెబుతున్నారు. ఎందుకంటే ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్రంలో అశ్వత్థామ రిఫరెన్స్ ఉంది. కల్కిలో అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్ నటించారు. కథను మలుపు తిప్పే క్యారెక్టర్ ఇది. అప్పుడే కల్కి రావడంతో మళ్లీ అశ్వత్థామ స్టోరీతో సినిమా అంటే బాగోదని అల్లు అర్జున్-ఆదిత్య ప్రాజెక్ట్ పక్కనపెట్టారని టాక్.

అల్లు అర్జున్ సినిమాలు

పుష్ప సినిమాల తర్వాత అల్లు అర్జున్ సినిమా మరొకటి థియేటర్లలోకి రాలేదు. ఇప్పుడు తమిళ డైరెక్టర్ అట్లీతో ఓ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ చేస్తున్నాడు అల్లు అర్జున్. ఇది వచ్చే ఏడాది రిలీజ్ అయ్యే అవకాశముంది. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇందులో అల్లు అర్జున్ సూపర్ హీరోలా కనిపిస్తారనే టాక్ ఉంది. ఈ మూవీలో దీపికా పదుకొనే హీరోయిన్.

ఇక అల్లు అర్జున్ వరుసగా అట్లీ, లోకేష్ కనగరాజ్, సుకుమార్, సందీప్ రెడ్డి వంగాలతో సినిమాలు చేయబోతున్నాడు. లోకేష్ కనగరాజ్ తో అల్లు అర్జున్ మూవీకి సంబంధించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. మరోవైపు సుకుమార్ పుష్ప 3 కథ రెడీ చేసుకుంటున్నారు. ఇక సందీప్ రెడ్డి- అల్లు అర్జున్ కాంబినేషన్లో తమ బ్యానర్ లో సినిమా ఉంటుందని టీ సిరీస్ ప్రొడ్యూసర్ భూషణ్ కుమార్ స్పష్టం చేశాడు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More