ఈ విషయం సినిమా తీసిన డైరెక్టర్‌కు కూడా తెలియదేమో.. ధురంధర్ మూవీలోని ఆ సీన్‌పై సోషల్ మీడియాలో కొత్త చర్చ
రణ్‌వీర్ సింగ్, ఆదిత్య ధర్ కాంబినేషన్‌లో వచ్చిన స్పై థ్రిల్లర్ 'ధురంధర్' ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది. థియేటర్లలో భారీ విజయం సాధించిన ఈ సినిమా.. ఓటీటీలో విడుదలైన తర్వాత ఓ కొత్త ఫ్యాన్ థియరీతో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
ప్రముఖ దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన స్పై యాక్షన్ మూవీ 'ధురంధర్' డిసెంబర్‌లో థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఓటీటీ రిలీజ్ తర్వాత ఈ సినిమాలోని ఒక సీన్ గురించి సోషల్ మీడియాలో ఓ కొత్త చర్చ మొదలైంది. ముఖ్యంగా రణ్‌వీర్ సింగ్ పోషించిన 'హమ్జా అలీ మజారీ' పాత్రకు సంబంధించిన ఈ కొత్త థియరీ ఇంటర్నెట్‌ను రెండుగా డివైడ్ చేసింది.

అసలేం జరిగింది? ఆ వెడ్డింగ్ సీన్ వెనుక ఉన్న కథేంటి?
ధురంధర్ సినిమాలో అంత్యంత కీలకమైన పెళ్లి సీన్ గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. పాకిస్థాన్‌లోని లియారీలో హమ్జా (రణ్‌వీర్) ఏడాదికి పైగా గడిపినప్పటికీ, అతను పూర్తిస్థాయి యాక్షన్‌లోకి దిగడం ఇదే తొలిసారి. ప్రముఖ గాయని ఉషా ఉతుప్ పాడిన 'రంభా హో' పాట బ్యాక్‌గ్రౌండ్‌లో హుషారుగా వినిపిస్తుండగా, తెరపై మాత్రం రక్తపాతం జరుగుతుంటుంది. రెహ్మాన్ డెకాయిట్ (అక్షయ్ ఖన్నా) పెద్ద కుమారుడిని హత్యాయత్నం నుంచి కాపాడటానికి హమ్జా తీవ్రంగా ప్రయత్నిస్తుంటాడు.
చివరికి రెహ్మాన్ కుమారుడిని రక్షించడంలో హమ్జా విఫలమయ్యాడని, ఆ క్లిష్ట పరిస్థితుల్లో పరిస్థితిని తనకనుకూలంగా మార్చుకునేందుకు హమ్జా తక్షణమే మరో నిర్ణయం తీసుకున్నాడని ఆ సీన్ చూసిన ప్రేక్షకులకు అర్థమవుతుంది.
హమ్జానే ఆ పని చేశాడా?
ఆ గందరగోళంలో రెహ్మాన్ కొడుకును ఎవరు కాల్చారనేది సినిమాలో స్పష్టంగా చూపించలేదు. ప్రత్యర్థుల చేతిలో అతను చనిపోయాడని, హమ్జా అతన్ని కాపాడలేకపోయాడని సినిమా చూసిన వారంతా ఇన్నాళ్లూ భావించారు. అయితే ఎక్స్ వేదికగా ఓ యూజర్ లేవనెత్తిన కొత్త సందేహం ఇప్పుడు అందరినీ ఆలోచనలో పడేసింది. రెహ్మాన్ కొడుకును చంపింది వేెరెవరో కాదని, స్వయంగా హమ్జానే అని సదరు యూజర్ పేర్కొన్నాడు.
"ధురంధర్ సినిమాను రెండోసారి చూసినప్పుడు గానీ నాకు అసలు విషయం అర్థం కాలేదు. రెహ్మాన్ డెకాయిట్ పెద్ద కొడుకును చంపింది హమ్జానే. థియేటర్‌లో చూసినప్పుడే నాకు ఈ డౌట్ వచ్చింది, ఇప్పుడు క్లారిటీ వచ్చింది" అని ఆ యూజర్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు సినీ ప్రియుల మధ్య పెద్ద చర్చకు దారితీసింది.
సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు
ఈ కొత్త థియరీతో సోషల్ మీడియా రెండుగా చీలిపోయింది. కొంతమంది నెటిజన్లు ఈ వాదనతో ఏకీభవిస్తుంటే, మరికొందరు దీన్ని పూర్తిగా కొట్టిపారేస్తున్నారు. "బహుశా దర్శకుడు ఆదిత్య ధర్‌కు కూడా ఈ విషయం తెలియదేమో" అంటూ ఓ రెడిట్ (Reddit) యూజర్ సెటైరికల్ గా స్పందించారు. మరొకరు స్పందిస్తూ.. "హమ్జా మిషన్ రెహ్మాన్ కొడుకును కాపాడటమే కానీ, చంపడం కాదు. హమ్జా అతన్ని చంపేందుకు కుట్ర పన్నాడనడానికి సినిమాలో కనీస సంకేతాలు కూడా లేవు" అని విశ్లేషించారు. మరొక యూజర్ లాజిక్‌తో స్పందిస్తూ.. "ఏది ఏమైనా మన ఇండియన్ ఏజెంట్.. తమతో ప్రత్యక్ష యుద్ధంలో లేని ఒక పిల్లాడిని లేదా టీనేజర్‌ని చంపినట్టు మన సినిమాల్లో చూపించరు" అని అభిప్రాయపడ్డారు.
అతిగా ఆలోచిస్తున్నారా? లేక నిజమేనా?
'ధురంధర్' సినిమాలోని లోతులను విశ్లేషించే క్రమంలో జనాలు అతిగా ఆలోచిస్తున్నారని, దర్శకుడు కూడా ఇంత లోతుగా ఆలోచించి ఉండరని కొందరు కామెంట్ చేస్తున్నారు. అయితే ఈ థియరీని బలంగా నమ్మేవాళ్ళు కూడా ఉన్నారు. "నేను ఇప్పుడే సినిమా చూస్తున్నా.. సరిగ్గా అదే సీన్ వచ్చింది. నేను కూడా ఇదే అనుమానం వ్యక్తం చేశాను. కానీ మా ఆయన ఒప్పుకోలేదు" అని ఓ ఇన్‌స్టాగ్రామ్ యూజర్ రాసుకొచ్చారు.
మరొకరు స్పందిస్తూ.. "నాకు కూడా అలాగే అనిపించింది. ఇప్పటికీ నేను అదే నమ్ముతున్నాను. ఎందుకంటే రెహ్మాన్ చనిపోయిన తర్వాత హమ్జా ప్రవర్తించిన తీరు, ఆ చివరి అంకంలో అతని హావభావాలు దానికి బలాన్ని చేకూరుస్తున్నాయి" అని విశ్లేషించారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


