Pakistan OTT: పాకిస్థాన్‌లో ఓటీటీలో నెంబర్ 1గా ధురంధర్ ట్రెండింగ్-వర్కౌట్ కానీ నిషేధం- అగ్రస్థానంలో భారత్ మూవీ సత్తా!
Dhurandhar OTT Trending In Pakistan: పాకిస్థాన్‌లోని ఓటీటీలో ఇండియన్ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ ధురంధర్ టాప్ 1లో ట్రెండింగ్ అవడం విశేషంగా మారంది. భారతీయ సినిమాలపై అక్కడ ఆంక్షలు ఉన్నప్పటికీ ఆదిత్య ధర్, రణ్‌వీర్ సింగ్ మూవీ సాధిస్తున్న ఆదరణ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ప్రస్తుతం ఒకే ఒక పేరు మార్మోగిపోతోంది.. అదే 'ధురంధర్' (Dhurandhar). థియేటర్లలో సుమారు రూ. 1300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కొల్లగొట్టిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ వేదికగా అంతర్జాతీయ స్థాయిలో సంచలనాలు సృష్టిస్తోంది. ముఖ్యంగా మన పొరుగు దేశం పాకిస్థాన్‌లో కూడా ధురంధర్ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ట్రెండింగ్‌లో నంబర్ వన్ స్థానంలో నిలవడం విశేషంగా మారింది.

నిషేధాన్ని కాదని.. పాకిస్థాన్ ప్రేక్షకుల పట్టాభిషేకం
పాకిస్థాన్, మధ్య ప్రాచ్య (Middle East) దేశాల్లో ధురంధర్ సినిమా థియేటర్లలో విడుదల కాలేదని తెలిసిందే. దీంతో ఈ మార్కెట్ల ద్వారా దాదాపు 10 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని కోల్పోయినట్లు చిత్ర పంపిణీదారులు గతంలోనే తెలిపారు.
అయితే, జనవరి 30న నెట్‌ఫ్లిక్స్‌లో ధురంధర్ ఓటీటీ రిలీజ్ అయన అతి కొద్ది రోజుల్లోనే పాకిస్థానీయులు ఈ సినిమాను చూసేందుకు ఎగబడుతున్నారు. అక్కడి సోషల్ మీడియాలో 'ధురంధర్' టాప్-1లో ఉన్న స్క్రీన్ షాట్లు వైరల్ అవుతున్నాయి. వివాదాస్పదంగా భావించే అంశాలు ఉన్నప్పటికీ, అక్కడి ప్రేక్షకులు ఈ సినిమాకు నీరాజనాలు పలుకుతున్నారు.
'బెస్ట్ బాలీవుడ్ మూవీ' అంటూ ప్రశంసలు
పాకిస్థానీ ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు అద్భుతమైన స్పందన లభిస్తోంది. "నేను చూసిన అత్యుత్తమ బాలీవుడ్ సినిమాల్లో ఇది ఒకటి. పాకిస్థానీయులంటే కేవలం 'ఆదాబ్, జనాబ్, టోపీలు' అన్నట్లుగా చూపించకుండా, లోతైన పరిశోధన చేసి మరీ సినిమా తీశారు. మా దేశంలోని నేరపూరిత రాజకీయ వ్యవస్థను ఎండగట్టినందుకు ధన్యవాదాలు. రెండో భాగం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను" అని ఒక పాకిస్థానీ నెటిజన్ తన సమీక్షలో పేర్కొన్నారు.
మరికొందరు నెటిజన్లు కూడా ధురంధర్‌పై "ఈ సినిమా పాకిస్థాన్ ప్రజలకు వ్యతిరేకం కాదు, అక్కడి నేర ముఠాలకు వ్యతిరేకంగా తీసినది" అని అభిప్రాయపడుతున్నారు. ఇలా పాకిస్థాన్‌లోని నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ 1 వంటి అగ్రస్థానంలో ధురంధర్ ఓటీటీ ట్రెండింగ్ అవడం, పాకిస్థానీయులు సైతం సినిమాను ప్రశంసించడం థియేటర్లలో బ్యాన్ చేసిన ప్లాన్ వర్కౌట్ కాలేదని తెలుస్తోంది.
రికార్డుల వేటలో 'ధురంధర్'
ఇదిలా ఉంటే, పాకిస్థాన్‌లోని ల్యారీ (Lyari) ప్రాంతంలో భారత ఏజెంట్ చేసే ఆపరేషన్ కథాంశంగా ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్ రూపొందింది. రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో అక్షయ్ ఖన్నా, ఆర్. మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ వంటి దిగ్గజ నటులు నటించారు.

ప్రపంచవ్యాప్తంగా రూ. 1300 కోట్లు వసూలు చేయడం ద్వారా బాలీవుడ్ చరిత్రలోనే రెండో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ధురంధర్ రికార్డు సృష్టించింది. సారా అర్జున్ హీరోయిన్‌గా పరిచయం అయిన ధురంధర్ రెండో పార్ట్ కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మార్చి 19న ధురంధర్ 2 విడుదల కానుందని తెలిసిందే.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


