ధురంధర్ 2 చరిత్రలోనే అతిపెద్ద మల్టీస్టారర్ అవుతుంది.. రామ్ గోపాల్ వర్మ సంచలన కామెంట్స్.. ఎందుకంటే?
బాక్సాఫీస్ వద్ద రణ్‌వీర్ సింగ్ ‘ధురంధర్’ సృష్టిస్తున్న ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఈ నేపథ్యంలో ధురంధర్ సీక్వెల్‌పై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా పార్ట్ 2 భారతీయ సినీ చరిత్రలోనే బిగ్గెస్ట్ మల్టీస్టారర్ అవుతుందని ఆయన జోస్యం చెప్పారు.
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్, సెన్సేషనల్ డైరెక్టర్ ఆదిత్య ధర్ కాంబినేషన్‌లో వచ్చిన ‘ధురంధర్’ (Dhurandhar) బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేటను కొనసాగిస్తోంది. గతేడాది డిసెంబర్ 5న విడుదలైన ఈ యాక్షన్ థ్రిల్లర్, నెల రోజులు గడిచినా క్రేజ్ తగ్గకుండా అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది.

రామ్ గోపాల్ వర్మ కామెంట్స్
ఈ నేపథ్యంలో సెకండ్ పార్ట్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమా సీక్వెల్‌పై అంటే దురంధర్ 2 మూవీపై టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రతి పాత్ర ఒక సూపర్ స్టార్
శనివారం (జనవరి 17) తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా స్పందించిన ఆర్జీవీ, ‘ధురంధర్ 2’ గురించి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. "సినిమా చరిత్రలోనే ‘ధురంధర్ 2’ అతిపెద్ద మల్టీస్టారర్ అవుతుంది. ఎందుకంటే మొదటి భాగంలోని ప్రతి పాత్ర ప్రేక్షకుల మనసులో చాలా బలంగా ముద్ర వేసుకుంది. విలువ పరంగా, ప్రభావం పరంగా అవన్నీ ఇప్పుడు భారీ స్థాయికి చేరుకున్నాయి. నిజమైన స్టార్‌డమ్ అంటే ఇదే" అని రామ్ గోపాల్ వర్మ పేర్కొన్నారు.
చిన్నవిగానో, పెద్దవిగానో
అంతేకాకుండా, "మొదటి భాగంలో ఆ పాత్రలు చిన్నవిగానో లేదా పెద్దవిగానో అనిపించి ఉండవచ్చు. కానీ, ఇప్పుడు అవన్నీ ‘జెయింట్ (అతిపెద్ద) సూపర్ స్టార్స్’ అయిపోయాయి. అందుకే పార్ట్ 2 అత్యంత భారీ మల్టీస్టారర్ మూవీగా నిలుస్తుంది" అని ఆర్జీవీ విశ్లేషించారు.
గతంలో ప్రశంసలు
గతంలో కూడా ఈ సినిమాపై ప్రశంసలు కురిపించిన ఆయన, ‘ధురంధర్’ కేవలం ఒక సినిమా మాత్రమే కాదని, భారతీయ చిత్ర పరిశ్రమ సాధించిన భారీ ముందడుగు అని రామ్ గోపాల్ వర్మ కొనియాడిన విషయం తెలిసిందే.
అసలు ‘ధురంధర్ 2’లో ఏముండబోతోంది?
ఆదిత్య ధర్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్.. 1999 నాటి IC-814 హైజాక్, 2001 పార్లమెంట్ దాడి , 2008 ముంబై ఉగ్రదాడుల వంటి యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోంది. సీక్వెల్‌లో రణ్‌వీర్ సింగ్ పోషించిన 'హంజా' పాత్ర గతాన్ని చూపించబోతున్నారు. లియారీలో అతని ఎదుగుదల, సీక్రెట్ ఆపరేషన్లను ఎలా పూర్తి చేశారనే అంశాల చుట్టూ ఈ కథ నడుస్తుంది.
మార్చి 19న థియేటర్లలోకి
ఈ భారీ చిత్రంలో రణ్‌వీర్ సింగ్‌తో పాటు సంజయ్ దత్, ఆర్ మాధవన్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, రాకేష్ బేడి వంటి దిగ్గజ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘ధురంధర్ 2’ వచ్చే మార్చి 19న థియేటర్లలోకి రానుంది.
సంక్రాంతి తర్వాత మరో బిగ్ ఫైట్!
విశేషమేమిటంటే, అదే రోజు కన్నడ స్టార్ యశ్ నటించిన ‘టాక్సిక్’ (Toxic: A Fairytale for GrownUps) కూడా విడుదల కానుంది. బాక్సాఫీస్ వద్ద ఈ రెండు భారీ చిత్రాల మధ్య గట్టి పోటీ నెలకొనబోతోందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. ఇది సంక్రాంతి తర్వాత మరో బిగ్ బాక్సాఫీస్ ఫైట్‌గా నిలవనుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

E-Paper












