కారులో శృంగారం, బయట విలన్స్‌‌కు బ్లాస్ట్- బోల్డ్ అండ్ వైల్డ్‌గా యశ్ టాక్సిక్ టీజర్- డాడీ ఈజ్ హోమ్ అంటూ!

కన్నడ స్టార్ యశ్ 40వ పుట్టినరోజు సందర్భంగా ‘టాక్సిక్’ మూవీ టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రక్తపాతం, వయోలెన్స్‌తో నిండిన ఈ గ్యాంగ్‌స్టర్ వరల్డ్ హాలీవుడ్ రేంజ్‌లో ఉందంటూ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. కారులో శృంగారం చేస్తూ విలన్స్‌ను బ్లాస్ట్ చేయడం నెక్ట్స్ లెవెల్‌లో ఉంది.

Published on: Jan 8, 2026, 12:45:47 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాకింగ్ స్టార్ యశ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. యశ్ 40వ పుట్టినరోజు సందర్భంగా ‘టాక్సిక్’ (Toxic) మూవీ మేకర్స్ ఒక పవర్ ప్యాక్డ్ టీజర్‌ను కానుకగా అందించారు. చీకటి సామ్రాజ్యం, రక్తపాతం, గన్స్‌తో నిండిన ఈ గ్యాంగ్‌స్టర్ ప్రపంచాన్ని పరిచయం చేస్తూ యశ్ తన ఊరమాస్ లుక్‌తో అలరించారు.

కారులో శృంగారం, బయట విలన్స్‌‌కు బ్లాస్ట్- బోల్డ్ అండ్ వైల్డ్‌గా యశ్ టాక్సిక్ టీజర్- డాడీ ఈజ్ హోమ్ అంటూ!
కారులో శృంగారం, బయట విలన్స్‌‌కు బ్లాస్ట్- బోల్డ్ అండ్ వైల్డ్‌గా యశ్ టాక్సిక్ టీజర్- డాడీ ఈజ్ హోమ్ అంటూ!

ఎవరీ ‘రాయ’?

"మీ ముందుకు వస్తున్న డేంజర్‌ను ఒకసారి జాగ్రత్తగా చూడండి.. పరిచయం చేస్తున్నాం ‘రాయ’ను" అనే క్యాప్షన్‌తో చిత్రబృందం సోషల్ మీడియాలో ఈ వీడియోను షేర్ చేసింది మూవీ టీమ్. యశ్ టాక్సిక్ టీజర్ బోల్డ్ అండ్ వైల్డ్‌గా అదిరిపోయింది.

టాక్సిక్ టీజర్ ఒక స్మశానవాటికలో జరుగుతున్న అంత్యక్రియల సీన్‌తో మొదలవుతుంది. అక్కడి నుంచి కుటుంబ సభ్యులు హడావిడిగా వెళ్లిపోతుండగా, ఒక కారు ఎంట్రీ ఇస్తుంది. ఆ కారులో నటితో యశ్ శృంగారం చేసే సీన్స్ చూపిస్తారు. కారులో శృంగారం చేస్తూ బయట విలన్స్‌కు బాంబ్ బ్లాస్ట్ చేసేలా ఉంది.

అది నెక్ట్స్ లెవెల్‌లో ఉంది. ఆ తర్వాత షర్ట్ లేకుండా బయటకు వచ్చిన యశ్ బ్లాక్ కోట్ వేసుకుని, నోట్లో సిగార్ కాలుస్తూ పొగమంచు మధ్యలో నుంచి ఎంట్రీ ఇస్తాడు. యశ్ నడుచుకుంటూ వచ్చే సీన్ అభిమానులకు పూనకాలు తెప్పిస్తోంది. గన్ పట్టుకుని ఒక్కసారిగా కాల్పులు జరుపుతూ "డాడీ ఈజ్ హోమ్" (Daddy’s Home) అని యశ్ చెప్పే డైలాగ్ టీజర్‌కే హైలైట్‌గా నిలిచింది.

హాలీవుడ్ రేంజ్‌లో మేకింగ్

టాక్సిక్ టీజర్ చూసిన నెటిజన్లు సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. "పక్కా హాలీవుడ్ వైబ్స్ కనిపిస్తున్నాయి", "శాండల్‌వుడ్ నుంచి హాలీవుడ్ స్థాయి సినిమా రాబోతోంది", "లేడీ డైరెక్టర్ నుంచి ఇలాంటి సినిమా ఊహించలేదు" అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ టేకింగ్, విజువల్స్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేశాయి. మైండ్‌లో నుంచి పోనివ్వని సీన్స్‌తో బోల్డ్ అండ్ వైల్డ్‌గా టాక్సిక్ టీజర్ ఉంది. ఇందులో రాయగా యశ్ ఊరమాస్ అవతారంలో కనిపించిన తీరు అందరిని ఫిదా చేస్తోంది.

సినిమా విశేషాలు

ఇకపోతే టాక్సిక్ పీరియాడిక్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కెవిఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై వెంకట్ కె. నారాయణ, యశ్ సంయుక్తంగా నిర్మించారు.

విశేషం ఏంటంటే, టాక్సిక్ చిత్రానికి యశ్ సహ రచయితగా కూడా వ్యవహరించారు. టాక్సిక్ మూవీలో నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, హుమా ఖురేషీ, అక్షయ్ ఒబెరాయ్ వంటి భారీ తారాగణం నటిస్తోంది. అలాగే కాంతార చాప్టర్ 1 బ్యూటీ రుక్మిణి వసంత్ ‘మెలిస్సా’ అనే కీలక పాత్రలో కనిపిస్తోంది.

భారీ అంచనాల మధ్య రూపొందుతున్న టాక్సిక్ చిత్రం మార్చి 19న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ‘కేజీఎఫ్’ తర్వాత యశ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద ఈ ‘టాక్సిక్’ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో అని అంతా ఎదురుచూస్తున్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More