OTT Today: ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ ధురంధర్.. సీన్లు కట్, ఆ డైలాగ్ లు మ్యూట్.. నెట్‌ఫ్లిక్స్‌పై ఫ్యాన్స్ ఫైర్

ఓటీటీ లవర్స్ చాలా రోజులుగా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ ధురంధర్ ఇవాళ ఓటీటీలో రిలీజైంది. అయితే ఈ మూవీని స్ట్రీమింగ్ చేస్తున్న నెట్‌ఫ్లిక్స్‌ ప్లాట్ ఫామ్ పై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. సీన్లు కట్ చేయడం, డైలాగ్ లు మ్యూట్ చేయడం ఏంటీ అని అడుగుతున్నారు. 

Published on: Jan 30, 2026, 11:14:19 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

లేటెస్ట్ ఇండియన్ బాక్సాఫీస్ సెన్సేషన్ ధురంధర్. రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ థియేటర్లలో అదరగొట్టింది. కొత్త రికార్డులు నెలకొల్పింది. ఆదిథ్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా వెయిట్ చేశారు. ఎట్టకేలకు ఈ రోజు (జనవరి 30) ధురంధర్ ఓటీటీలోకి వచ్చింది. కానీ ఫ్యాన్స్ మాత్రం నిరాశకు గురవుతున్నారు. ఓటీటీ ప్లాట్ ఫామ్ పై ఫైర్ అవుతున్నారు.

ధురంధర్ సినిమాలో రణ్‌వీర్ సింగ్
ధురంధర్ సినిమాలో రణ్‌వీర్ సింగ్

ధురంధర్ ఓటీటీ

డిసెంబర్ 25, 2025న థియేటర్లలో రిలీజైన ధురంధర్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. అత్యంత వేగంగా రూ.1000 కోట్ల క్లబ్ లో చేరిన మూవీగా నిలిచింది. హిందీలో అత్యధిక కలెక్షన్లు సొంతం చేసుకున్న సినిమాగా రికార్డు నెలకొల్పింది. ఈ స్పై థ్రిల్లర్ శుక్రవారం ఓటీటీలో రిలీజైంది. కానీ దీన్ని స్ట్రీమింగ్ చేస్తున్న పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌పై మాత్రం అభిమానులు ఆగ్రహంతో ఉన్నారు.

ఇదే కారణం

బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన తర్వాత రణ్‌వీర్ సింగ్ స్పై థ్రిల్లర్ ధురంధర్ ఓటీటీ ప్రపంచంలోకి వచ్చింది. అయితే ఈ ఓటీటీ ప్రీమియర్ అభిమానులను ఆకట్టుకోలేకపోతోంది. కొన్ని డైలాగ్‌లు మ్యూట్ చేయడం, కొన్ని సీన్లు కట్ చేయడంపై ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. నెట్‌ఫ్లిక్స్‌ పై మండిపడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

సెన్సార్ చేయని వర్షన్

సాధారణంగా ఓటీటీలో సెన్సార్ చేయని వర్షన్ సినిమాలు, సిరీస్ లు వస్తున్నాయి. ఇందులో అసభ్య పదాలు, సన్నివేశాలు విచ్చలవిడిగా ఉంటున్నాయి. అందుకే ధురంధర్ మూవీ సెన్సార్ చేయని వర్షన్ ఓటీటీలో రిలీజ్ అవుతుందని ఫ్యాన్స్ ఆశించారు. కానీ డైలాగ్‌లను మ్యూట్ చేయడం, అసభ్య భాషను సెన్సార్ చేయడం, సినిమా నుంచి దాదాపు 10 నిమిషాల సీన్లు కట్ చేయడంపై కోప్పడుతున్నారు.

ఇంగ్లీష్ మూవీకి ఇలాగే చేస్తారా?

"నెట్‌ఫ్లిక్స్‌.. మీరు ధురంధర్ సినిమాలోని అసభ్య పదాలను ఎందుకు సెన్సార్ చేశారు? మనం సినిమాను సరిగ్గా ఎంజాయ్ చేయలేకపోతే ఇక పాయింట్ ఏంటీ? ఏదైనా ఇంగ్లీష్ సినిమాలో అసభ్య పదాలను ఇలాగే సెన్సార్ చేస్తారా? లేదు కదా.. మరి ఈ వివక్ష ఎందుకు? నిరాశ చెందా’’ అని ఒక యూజర్ సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు.

మోసం చేశారు

‘‘మేకర్స్ నిజంగా మనల్ని మోసం చేశారు. మీరు ఏదైనా సరే మ్యూట్ చేయబోతున్నట్లయితే మరి A సర్టిఫికేట్ ఎందుకు ఇస్తారు? సెన్సార్‌షిప్ పూర్తిగా జోక్’’ అని మరో ఫ్యాన్ ఫైర్ అయ్యాడు.

"మీరు సినిమాకు A సర్టిఫికేట్ ఇస్తారు కానీ ఆ పదాలను మాత్రం మ్యూట్/సెన్సార్ చేస్తారు! మనం 5 ఏళ్ల పిల్లలమా ఏంటీ? ఈ యాప్‌లోని ప్రతి ఒక్కరూ 18 ఏళ్లు నిండినవాళ్లే. చాలా కట్స్, సెన్సార్‌షిప్‌తో సినిమా చూడటంలో అర్థం లేదు. మీరు అసలైన వైబ్‌ను నాశనం చేస్తున్నారు’’ అని మరో యూజర్ పోస్టు చేశాడు.

ఇది జోక్

"నెట్‌ఫ్లిక్స్‌ చాలా డిసప్పాయింట్ చేసింది. అందరూ సెన్సార్ చేయని వెర్షన్ కోసం వెయిట్ చేసినప్పుడు మీరు ఎందుకు దాన్ని సెన్సార్ చేశారు. A రేటెడ్ సినిమాను సెన్సార్ చేయడం కూడా జోకే. కానీ యానిమల్, కబీర్ సింగ్ లో ఎలాంటి కట్స్ లేవు’’ అని మరొకరు నిరాశ వ్యక్తం చేశారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More