ఓటీటీ కాలంలో థియేటర్లలో 50 రోజులు.. ధురంధర్ అరుదైన రికార్డు.. మొత్తం కలెక్షన్లు ఎంతో తెలుసా?
ఇప్పుడంతా ఓటీటీ జమనా నడుస్తోంది. కొత్త సినిమా థియేటర్లలోకి వచ్చిన వారం, రెండు వారాల్లోనే డిజిటల్ స్ట్రీమింగ్ కు వస్తున్న రోజులివి. ఈ కాలంలోనూ ధురంధర్ మూవీ థియేటర్లలో 50 రోజులు కంప్లీట్ చేసుకుని అరుదైన ఘనత దక్కించుకుంది. ఈ మూవీ మొత్తం కలెక్షన్లు ఎన్ని కోట్లో చూసేయండి.
థియేటర్లలో 50 రోజులు.. ఒకప్పుడు సినీ ఇండస్ట్రీలో ఏ మూవీ అయినా ఈ మైల్ స్టోన్ చేరుకుంటే సంబరాలు చేసేవాళ్లు. కానీ ఈ ఓటీటీ కాలంలో ఆ సందడి, సెలబ్రేషన్స్ లేకుండా పోయాయి. అలా థియేటర్లలోకి వచ్చిన మూవీ, ఇలా ఓటీటీలోకి రావడం కామనైపోయింది. అలాంటిది ఈ రోజుల్లోనూ 50 రోజుల పాటు థియేటర్లలో రన్ అవడం మామూలు విషయం కాదు. ఈ అరుదైన రికార్డును ధురంధర్ సాధించింది.

ధురంధర్ 50 డేస్
రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన హిందీ స్పై యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్ మరో రికార్డు ఖాతాలో వేసుకుంది. థియేటర్లలో విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకున్న సినిమాగా నిలిచింది. ఓటీటీ జమానాలో ఈ ఫీట్ చిన్నదేం కాదు. డిసెంబర్ 5, 2025న ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది ధురంధర్. దీనికి ఆదిత్య ధర్ డైరెక్టర్. సారా అర్జున్ హీరోయిన్.
ధురంధర్ కలెక్షన్లు
బాక్సాఫీస్ దగ్గర ఎన్నో రికార్డులు బ్రేక్ చేసింది ధురంధర్. ఈ స్పై థ్రిల్లర్ తన ఏడో వారంలోనూ సినిమా హాళ్లలో జోరు కొనసాగిస్తోంది. 50వ రోజు (జనవరి 23) ధురంధర్ మూవీ ఇండియాలో రూ.0.36 కోట్ల నెట్ కలెక్షన్లు ఖాతాలో వేసుకుంది. దీంతో ఈ మూవీ 50 రోజుల మొత్తం ఇండియా నెట్ వసూళ్లు రూ.830.86 కోట్లకు చేరుకున్నాయి.
50వ రోజు ఆక్యుపెన్సీ గణాంకాలు ధురంధర్ సినిమా పరిమితమైన డిమాండ్‌ను చూపుతున్నాయి. ఉదయం షోలు సగటున 8.46%, మధ్యాహ్నం షోలు 21.36% ఆక్యుపెన్సీ నమోదు చేశాయి.
వరల్డ్ వైడ్ వసూళ్లు
ధురంధర్ మూవీ వరల్డ్ వైడ్ కలెక్షన్లలో సత్తాచాటింది. ఈ సినిమా 7వ వారం మొత్తం రూ. 13.9 కోట్ల వసూళ్లు సాధించింది. వరల్డ్ వైడ్ గా చూసుకుంటే కలెక్షన్లు రూ.1,289 కోట్లుగా ఉన్నాయి. ఇప్పటికే ఇండియాలో అత్యధిక కలెక్షన్లు సాధించిన హిందీ సినిమాగా ధురంధర్ రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే. పుష్ప 2 హిందీ వర్షన్ రికార్డును ధురంధర్ బ్రేక్ చేసింది.
మూడు వారాల్లోనే
ఇక థియేటర్లలో రిలీజైన మూడు వారాల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లు కలెక్ట్ చేసింది ధురంధర్. అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన ఇండియన్ మూవీగా నిలిచింది. ఇప్పటివరకూ అన్ని ప్రాంతాలలో కలిపి సుమారు 3.5 కోట్ల మంది ధురంధర్ సినిమాను థియేటర్లలో చూడటం విశేషం. ఈ చిత్రంలో రణ్‌వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్.మాధవన్ తదితరులు నటించారు.
సీక్వెల్ రిలీజ్ డేట్
ధురంధర్ ఇంతటి ఘన విజయం సాధించడంతో ధురంధర్ 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ధురంధర్ 2 మార్చి 19, 2026న రిలీజ్ కానుంది. మరి ఈ సీక్వెల్ ఎన్ని సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


