హిందీలో ఆల్ టైమ్ కలెక్షన్లు- పుష్ప 2 రికార్డును బద్దలు కొట్టిన ధురంధర్- 46వ రోజు వసూళ్లు ఇవే!

ధురంధర్ సినిమా బాక్సాఫీస్ వద్ద తన అద్భుతమైన ప్రదర్శనను కొనసాగిస్తోంది. హిందీలో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా పుష్ప 2 రికార్డును బ్రేక్ చేసింది ఈ మూవీ. రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ స్పై థ్రిల్లర్ 46వ రోజు ఎంత వసూలు చేసిందో చూసేయండి. 

Published on: Jan 20, 2026, 06:04:42 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ధురంధర్ మూవీ రికార్డుల వేట ఆగడం లేదు. థియేటర్లలో రిలీజైన 46వ రోజు కూడా కొత్త హిస్టరీ క్రియేట్ చేసింది ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్. హిందీలో అత్యధిక కలెక్షన్లు సాధించిన మూవీగా పుష్ప 2 రికార్డును బ్రేక్ చేసింది ధురంధర్. రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన 'ధురంధర్' చిత్రం బాక్సాఫీస్ వద్ద తన అద్భుతమైన ప్రదర్శనను కొనసాగిస్తూ, తన మొత్తం ఆదాయాన్ని మరింత పెంచుకుంది.

ధురంధర్ కలెక్షన్ల రికార్డు
ధురంధర్ కలెక్షన్ల రికార్డు

ధురంధర్ కలెక్షన్లు

డిసెంబర్ 5, 2025న థియేటర్లోల రిలీజైంది ధురంధర్. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీకి మిక్స్ డ్ టాక్ వచ్చినా కలెక్షన్ల వర్షం మాత్రం కురుస్తూనే ఉంది. ఈ మూవీ 46వ రోజు (జనవరి 19) ఇండియాలో రూ.0.82 కోట్లు వసూలు చేసింది. దీంతో ధురంధర్ నెట్ కలెక్షన్లు 831.4 కోట్లకు చేరాయి.

పుష్ప 2 రికార్డు బ్రేక్

హిందీలో అత్యధిక నెట్ కలెక్షన్లు సాధించిన మూవీగా అల్లు అర్జున్ చిత్రం పుష్ప 2 రికార్డును ధురంధర్ బ్రేక్ చేసింది. అల్లు అర్జున్ మూవీ ఇండియాలో హిందీలో రూ.830.1 కోట్లు సాధించింది. ఇప్పుడు రూ.831.4 కోట్లతో ధురంధర్ ఈ రికార్డు బ్రేక్ చేసింది. హిందీతో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ధురంధర్ టాప్ ప్లేస్ లోకి దూసుకెళ్లింది.

ప్రపంచవ్యాప్తంగా

థియేటర్లలో రిలీజై నెల రోజులు గడిచిపోయిన తర్వాత కూడా ధురంధర్ మంచి రెస్పాన్స్ వస్తుంది. ఏడవ శనివారం (44వ రోజు) సుమారు రూ.3 కోట్లు, ఏడవ ఆదివారం (45వ రోజు) సుమారు రూ.3.75 కోట్లు వసూలు చేసింది. ధురంధర్ ప్రపంచవ్యాప్త వసూళ్లు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. బాలీవుడ్ హంగామా ప్రకారం ఈ చిత్రం ప్రపంచవ్యాప్త గ్రాస్ వసూళ్లు రూ.రూ.1,322 కోట్లు కాగా, సక్నిల్క్ ప్రకారం అవి రూ.1,279 కోట్లు.

ధురంధర్ గురించి

ధురంధర్ మూవీ అనేది ఆదిత్య ధర్ రాసి, దర్శకత్వం వహించిన స్పై యాక్షన్ థ్రిల్లర్. జియో స్టూడియోస్, బి62 స్టూడియోస్ బ్యానర్ల క్రింద జ్యోతి దేశ్‌పాండే, ఆదిత్య ధర్, లోకేష్ ధర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో రణ్‌వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్ వంటి స్టార్లు నటించారు. కరాచీ, పాకిస్థాన్‌లోని నేర, రాజకీయ నెట్‌వర్క్‌లలోకి చొరబడే ఒక భారతీయ అండర్‌కవర్ ఏజెంట్ కథ ఇది.

ఈ కథ దక్షిణ ఆసియా భూగోళశాస్త్రాన్ని ప్రభావితం చేసిన వాస్తవ చారిత్రక సంఘటనలను, 1999 IC-814 హైజాకింగ్, 2001 భారత పార్లమెంట్ దాడి, 2008 ముంబై దాడులు, లియారీకి సంబంధించిన కార్యకలాపాలను సూచిస్తుంది. ధురంధర్ 2 మార్చి 19, 2026న రిలీజ్ కానుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More