జపనీస్ భాషలో పుష్ప 2 డైలాగ్‌తో ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించిన అల్లు అర్జున్.. వీడియో వైరల్
అల్లు అర్జున్ తన పుష్ప 2 మూవీలోని డైలాగ్ ను జపనీస్ భాషలో చెప్పి జపాన్ అభిమానులను ఉర్రూతలూగించాడు. ప్రస్తుతం అతడు రష్మికతో కలిసి జపాన్ టూర్లో ఉన్న విషయం తెలిసిందే. అక్కడ ఈ మూవీ రిలీజ్ కు సిద్ధమైంది.
జపాన్ బాక్సాఫీస్ వద్ద మరోసారి తెలుగు సినిమా సత్తా చాటేందుకు సిద్ధమైంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన బ్లాక్ బస్టర్ ‘పుష్ప 2: ది రూల్’ జపాన్‌లో విడుదలకు రెడీ అయింది. ఈ సందర్భంగా ప్రమోషన్ల కోసం టోక్యో వెళ్లిన బన్నీకి అక్కడి అభిమానులు బ్రహ్మరథం పట్టారు. గురువారం (జనవరి 15) జరిగిన సినిమా ప్రీమియర్ షోలో అల్లు అర్జున్ చేసిన సందడి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

‘కొన్నిచివా’ అంటూ జపనీస్‌లో అదరగొట్టిన బన్నీ
టోక్యోలోని ఓ థియేటర్‌లో జరిగిన ప్రీమియర్ ఈవెంట్‌లో అల్లు అర్జున్ వేదికపైకి రాగానే ఆడిటోరియం మొత్తం చప్పట్లతో మారుమోగింది. ఈ సందర్భంగా బన్నీ మైక్ అందుకొని జపనీస్ భాషలో ‘పుష్ప’ డైలాగ్ చెప్పడంతో ఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు. అతని డైలాగ్ డెలివరీకి, మ్యానరిజంకు జపాన్ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. బన్నీ పక్కనే ఉన్న నేషనల్ క్రష్ రష్మిక మందన్న కూడా చిరునవ్వులు చిందిస్తూ, అభిమానులకు అభివాదం చేసింది. అనంతరం వీరిద్దరూ జపనీస్ సంప్రదాయ పద్ధతిలో తల వంచి ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపాడు.
ఇంటర్నేషనల్ మాస్ అంటే ఇదే!
పుష్ప 2 చిత్ర నిర్మాణ సంస్థ ఈ వీడియోను ‘ఎక్స్’ వేదికగా పంచుకుంది. "కొన్నిచివా జపాన్.. టోక్యో ప్రీమియర్‌లో ఐకాన్ స్టార్ జపనీస్ డైలాగ్ విని ఆడియన్స్ స్టన్ అయ్యాడు" అని క్యాప్షన్ ఇచ్చింది.
దీనిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. "ఒక తెలుగు హీరోకు టోక్యోలో ఈ రేంజ్ రెస్పాన్స్ రావడం గ్రేట్.. ఇది కదా ఇంటర్నేషనల్ మాస్ అంటే" అని ఒకరు, "బన్నీ క్రేజ్‌కు హద్దులు లేవు" అని మరొకరు కామెంట్ చేస్తున్నారు.
జపాన్‌లో జనవరి 16న గ్రాండ్ రిలీజ్
అంతేకాకుండా అల్లు అర్జున్ అభిమానులతో కలిసి ఫోటోలు దిగుతూ, ఆటోగ్రాఫ్‌లు ఇస్తూ చాలా సరదాగా గడిపాడు. కొద్ది రోజుల కిందటే బన్నీ తన సతీమణి స్నేహారెడ్డితో కలిసి హైదరాబాద్ నుంచి జపాన్ వెళ్లిన సంగతి తెలిసిందే. జనవరి 16న (శుక్రవారం) జపాన్ వ్యాప్తంగా ‘పుష్ప 2’ భారీ ఎత్తున విడుదల కానుంది.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్, సునీల్, రావు రమేష్, జగపతి బాబు కీలక పాత్రల్లో నటించారు. 2021లో వచ్చిన ‘పుష్ప: ది రైజ్’కు సీక్వెల్‌గా వచ్చిన ఈ మూవీ ఇండియాలో భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో మూవీగా నిలిచింది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


