ధురంధర్ నంబర్ 1 హిందీ మూవీ.. టికెట్ల అమ్మకాల్లో సరికొత్త రికార్డు.. అయినా పుష్ప 2 కంటే చాలా వెనకే..

ధురంధర్ మూవీ రికార్డుల పరంపరం కొనసాగుతూనే ఉంది. తాజాగా టికెట్ల అమ్మకాల్లో నంబర్ 1 హిందీ సినిమాగా నిలిచింది. అయితే మన పుష్ప 2 టికెట్ల అమ్మకాల కంటే ఇప్పటికీ చాలా వెనుకబడే ఉండటం విశేషం.

Published on: Jan 2, 2026, 21:45:22 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రణ్‌వీర్ సింగ్ హీరోగా వచ్చిన యాక్షన్ స్పై థ్రిల్లర్ 'ధురంధర్' (Dhurandhar) బాక్సాఫీస్ దగ్గర అడ్డూ అదుపూ లేకుండా దూసుకెళ్తూనే ఉంది. ఇప్పటికే రూ. 1100 కోట్లు కొల్లగొట్టిన ఈ సినిమా.. ఇప్పుడు టికెట్ల అమ్మకాల్లో సరికొత్త రికార్డు సృష్టించింది. బుక్ మై షో (BookMyShow)లో అత్యధిక టికెట్లు అమ్ముడైన బాలీవుడ్ సినిమాగా నిలిచి.. షారుక్ ఖాన్ 'జవాన్', విక్కీ కౌశల్ 'ఛావా' రికార్డులను బద్దలు కొట్టింది.

ధురంధర్ నంబర్ 1 హిందీ మూవీ.. టికెట్ల అమ్మకాల్లో సరికొత్త రికార్డు.. అయినా పుష్ప 2 కంటే చాలా వెనకే..
ధురంధర్ నంబర్ 1 హిందీ మూవీ.. టికెట్ల అమ్మకాల్లో సరికొత్త రికార్డు.. అయినా పుష్ప 2 కంటే చాలా వెనకే..

బుక్ మై షోలో 'నంబర్ 1'.. కానీ పుష్ప రాజ్ రికార్డు సేఫ్

ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన 'ధురంధర్' కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. థియేటర్ల వద్దే కాదు, ఆన్‌లైన్ బుకింగ్స్‌లోనూ ఈ సినిమా జోరు మామూలుగా లేదు. ఆన్‌లైన్ టికెటింగ్ ప్లాట్‌ఫామ్ 'బుక్ మై షో'లో ఈ సినిమా అమ్మకాల లెక్కలు ఇలా ఉన్నాయి.

ధురంధర్ మూవీ ఇప్పటివరకు 1.3 కోట్ల టికెట్లు అమ్ముడయ్యాయి. దీంతో ఇది ఆల్ టైమ్ బెస్ట్ సెల్లింగ్ హిందీ సినిమాగా నిలిచింది. గతంలో విక్కీ కౌశల్ నటించిన 'ఛావా' (1.25 కోట్లు), షారుక్ ఖాన్ 'జవాన్' (1.24 కోట్లు), 'స్త్రీ 2' (1 కోటి+) రికార్డులను 'ధురంధర్' దాటేసింది.

అయితే ఓవరాల్‌గా ఇండియన్ సినిమా రికార్డు మాత్రం మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప 2: ది రూల్' పేరు మీదే ఉంది. పుష్ప 2 రిలీజ్ అయినప్పుడు ఏకంగా 2 కోట్ల టికెట్లు అమ్ముడయ్యాయి. ఆ రికార్డును అందుకోవడానికి 'ధురంధర్' ఇంకా చాలా దూరంలో ఉంది.

ధురంధర్ 1100 కోట్ల సామ్రాజ్యం

ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఇప్పటివరకు ఇండియాలో మొత్తం 3.5 కోట్ల మంది (ఆన్‌లైన్ + ఆఫ్‌లైన్ కలిపి) ఈ సినిమాను చూశారు. ఇండియా గ్రాస్ రూ. 886 కోట్లు కాగా, ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్స్ రూ. 1100 కోట్లు దాటాయి.

పాకిస్థాన్ గ్యాంగ్‌స్టర్ కథతో, రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో రణ్‌వీర్ సింగ్ ఇండియన్ స్పైగా, అక్షయ్ ఖన్నా విలన్‌గా, మాధవన్, అర్జున్ రాంపాల్ కీలక పాత్రల్లో నటించారు. ఈ కథకు ముగింపునిచ్చే 'ధురంధర్ పార్ట్ 2' ఇదే ఏడాది మార్చిలో రిలీజ్ కానుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More